iDreamPost
android-app
ios-app

మిడిల్‌ ఫింగర్‌ చూపిస్తూ కేన్‌ మామ.. ఆలస్యంగా వీడియో లీక్!

  • Published Feb 19, 2024 | 8:21 PM Updated Updated Feb 19, 2024 | 8:21 PM

Kane Williamson: ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కేన్ విలియమ్సన్ కు తొలిసారి కోపమెుచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే?

Kane Williamson: ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కేన్ విలియమ్సన్ కు తొలిసారి కోపమెుచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే?

  • Published Feb 19, 2024 | 8:21 PMUpdated Feb 19, 2024 | 8:21 PM
మిడిల్‌ ఫింగర్‌ చూపిస్తూ కేన్‌ మామ.. ఆలస్యంగా వీడియో లీక్!

కేన్ విలియమ్సన్.. ప్రపంచ క్రికెట్ లో కూలెస్ట్ ప్లేయర్ గా మంచి గుర్తింపు పొందాడు. వివాదాలకు ఆమడదూరంలో ఉండే కేన్ మామ.. అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం భీకరఫామ్ లో ఉన్న కేన్ మామ.. సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల్లో 3 సెంచరీలతో దుమ్మురేపాడు. దీంతో సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది కివీస్. అయితే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కేన్ మామకు తొలిసారి కోపమెుచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే?

ప్రపంచ క్రికెట్ లో వివాదాలకు దూరంగా ఉండే ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ ఆ లిస్ట్ లో ఫస్ట్ ఉంటాడు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్. తన కెరీర్ లోనే అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్న కేన్ మామ.. వరుసగా సెంచరీల మీద సెంచరీలు చేస్తూ.. దూసుకెళ్తున్నాడు. సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస్ నెగ్గడంలో కేన్ మామది కీలక పాత్ర. రెండు మ్యాచ్ లను కూడా కివీస్ నెగ్గి సిరీస్ ను దక్కించుకుంది. అయితే తొలి మ్యాచ్ లో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

తొలిటెస్ట్ మూడోరోజు ఆట ప్రారంభానికి ముందు.. కేన్ విలియమ్సన్ వామప్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సహచర ఆటగాడు బాల్ విసరడంతో.. బాల్ కాస్త వామప్ చేస్తున్న కేన్ మామకు తగిలింది. దీంతో ఆ బాల్ వేసిన ఆటగాడికి తన మిడిల్ ఫిగర్ చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారడంతో.. నెటిజన్లు షాక్ అవుతున్నారు. కేన్ మామను ఇలా కోపంగా ఎప్పుడూ చూడనేలేదు.. ఫస్ట్ టైమ్ కోపమెుచ్చినట్లు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం విలియమ్సన్ సరదాగా తన టీమ్మెట్ కు మిడిల్ ఫింగర్ చూపించాడని రాసుకొచ్చారు. ఇక ఈ కివీస్ మాజీ కెప్టెన్ రెండు టెస్టుల్లో వరుసగా.. 118, 109, 43, 133* పరుగులతో చెలరేగాడు. మరి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కేన్ మామ ఇలా కోపంగా మిడిల్ ఫింగర్ చూపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Rohit Sharma: రోహిత్‌ శర్మకు ఘోర అవమానం! కనీసం చోటు కూడా ఇవ్వలేదు!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetbaba girişgrandpashabet