iDreamPost
android-app
ios-app

టీ20ల్లో డబుల్‌ సెంచరీ కొట్టే దమ్ము ఆ భారత క్రికెటర్‌కే ఉంది: కేన్‌ మామ

  • Published Apr 18, 2024 | 2:48 PM Updated Updated Apr 18, 2024 | 2:48 PM

Kane Williamson, Rohit Sharma: ఐపీఎల్‌ 2024లో అదరగొడుతున్న టీమిండియా సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ గురించి కేన్‌ విలియమ్సన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో సెంచరీ కొట్టే దమ్మున్న ఆటగాడు అతనే అన్నాడు. మరి ఆ ప్లేయర్‌ ఎవరో చూద్దాం..

Kane Williamson, Rohit Sharma: ఐపీఎల్‌ 2024లో అదరగొడుతున్న టీమిండియా సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ గురించి కేన్‌ విలియమ్సన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో సెంచరీ కొట్టే దమ్మున్న ఆటగాడు అతనే అన్నాడు. మరి ఆ ప్లేయర్‌ ఎవరో చూద్దాం..

  • Published Apr 18, 2024 | 2:48 PMUpdated Apr 18, 2024 | 2:48 PM
టీ20ల్లో డబుల్‌ సెంచరీ కొట్టే దమ్ము ఆ భారత క్రికెటర్‌కే ఉంది: కేన్‌ మామ

న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్‌, ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడుతున్న కేన్‌ విలియమ్సన్‌ చేసిన వ్యాఖ్యలు ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ రోమాలు నిక్కబోడుచుకునేలా చేస్తున్నాయి. ఐపీఎల్‌లో జీటీ తరఫున కేన్‌ మామకు పెద్దగా ఆడే అవకాశం రావడం లేదు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా ఉన్న సమయంలో విలియమ్సన్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ అంతా ముద్దుగా కేన్‌ మామ అని పిలిచే వారనే విషయం తెలిసిందే. అతను వేరే టీమ్‌కి మారినా కూడా అతనిపై తెలుగు క్రికెట్‌ అభిమానులు చూపించే ప్రేమ మాత్రం తగ్గలేదు. కేన్‌ మామ, ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ బాండింగ్‌ గురించి పక్కనపెడితే.. ప్రస్తుతం కేన్‌ మామ చేసిన కామెంట్స్‌ హైలెట్‌ అవుతున్నాయి. ఇంతకీ అతను ఏం చెప్పాడో? ఎవరి గురించి చెప్పాడో వివరంగా తెలుసుకుందాం..

కేన్‌ విలియమ్సన్‌ చాలా సీనియర్‌ క్రికెటర్‌, న్యూజిలాండ్‌ టీమ్‌ను ఎంతో సక్సెస్‌ఫుల్‌గా నడిపించిన, నడిపిస్తున్న కెప్టెన్‌. అలాంటి ఆటగాడు ఏదైన విషయం గురించి మాట్లాడితే అందులో కచ్చితంగా విషయం ఉంటుంది. తాజాగా కేన్‌ మాట్లాడుతూ.. టీ20 క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ కొట్టగలిగే సత్తా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకే ఉందని విలియమ్సన్‌ అభిప్రాయపడ్డాడు. రోహిత్‌ శర్మ ఎంతటి విధ్వంసకర బ్యాటరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీ20 క్రికెట్‌లో ముఖ్యంగా ఐపీఎల్‌లో క్రిస్‌ గేల్‌ 175, బ్రాండెన్‌ మెక్‌కల్లమ్‌ 158 పరుగులు అత్యధిక స్కోర్లుగా ఉన్నాయి. అయితే.. ఇప్పటి వరకు ఎవరు టీ20ల్లో డబుల్‌ సెంచరీ చేయలేదు. అలా చేస్తే అది అద్భుత చరిత్రే అవుతుంది.

అలాంటి చరిత్రను సృష్టించేది రోహిత్‌ శర్మే అని కేన్‌ విలియమ్సన్‌ లాంటి దిగ్గజ క్రికెటర్‌ పేర్కొనడం విశేషం. రోహిత్‌ శర్మకు ఇప్పటికే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్‌ ఉంది. గతంలో కనీవిని ఎరుగని విధంగా వన్డేల్లో 264 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. అలాగే వన్డేల్లో అత్యధిక డబుల్‌ సెంచరీలు చేసిన రికార్డు కూడా రోహిత్‌ శర్మ పేరిటే ఉంది. వన్డేల్లో తొలి డబుల్‌ సెంచరీ చేసింది సచిన్‌ టెండూల్కరే అయినా.. డబుల్‌ సెంచరీని సెంచరీ చేసినంత ఈజీగా చేసి చూపించింది మాత్రం రోహితే. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, టీ20ల్లో ఎవరైనా డబుల్‌ సెంచరీలో చేస్తే గీస్తే అతను రోహిత్‌ శర్మే అవుతాడని, రోహిత్‌ బ్యాట్‌ నుంచే టీ20 డబుల్‌ సెంచరీ వస్తుందని ఆశిస్తున్నట్లు కేన్‌ మామ పేర్కొన్నాడు. మరి రోహిత్‌ బ్యాట్‌పై కేన్‌ మామకున్న నమ్మకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap