టీ20 వరల్డ్ కప్.. టీమిండియా పెద్ద తప్పు చేస్తోంది! హెచ్చరించిన పాక్ మాజీ క్రికెటర్

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగే భారత్-పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్ కు ముందు.. ఆ విషయంలో టీమిండియా బిగ్ మిస్టేక్ చేస్తోందని, అది సరిచేసుకోకపోతే..భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగే భారత్-పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్ కు ముందు.. ఆ విషయంలో టీమిండియా బిగ్ మిస్టేక్ చేస్తోందని, అది సరిచేసుకోకపోతే..భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్.

టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. ఇక అందుకు తగ్గట్లుగానే తన తొలి మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ను మట్టికరిపించింది. ఇక తన తర్వాతి మ్యాచ్ లో దాయాది దేశమైన పాకిస్తాన్ ను ఢీ కొనబోతోంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ లవర్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పాక్ తో మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ఆ విషయంలో పెద్ద తప్పు చేస్తోందని, తప్పును సరిదిద్దుకోవాలని హెచ్చరించాడు ఆ జట్టు మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్. మరి ఇంతకీ టీమిండియా చేస్తున్న ఆ బిగ్ మిస్టేక్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో భారత్-పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఐర్లాండ్ పై గెలిచి సమరోత్సాహంలో ఉంది టీమిండియా. అటు పాకిస్తాన్ అమెరికాపై దారుణంగా ఓడిపోయి ఒత్తిడిలో ఉంది. దాంతో ఈ మ్యాచ్ పై అభిమానుల్లో ఎక్కడాలేని ఆసక్తి నెలకొంది. సహజంగానే ఇండియా-పాక్ మ్యాచ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కాగా.. పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు ఆ జట్టు మాజీ క్రికెటర్ టీమిండియాను హెచ్చరించాడు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా పెద్ద తప్పు చేస్తోందని, ఆ తప్పును సరిచేసుకోకపోతే.. కష్టమే అని కొన్ని కీలక సూచనలు చేశాడు.

“టీమిండియ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా ఉందని నేను భావించడం లేదు. ఇక విరాట్ కోహ్లీని ఓపెనర్ గా పంపిస్తూ భారత్ పెద్ద తప్పు చేస్తోంది. వీలైనంత త్వరగా ఈ తప్పును సరిదిద్దుకుని, ఓపెనర్లుగా రోహిత్-జైస్వాల్ ను పంపించాలి. కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి మ్యాచ్ ను ముగించాలి. కాదు, కూడదు అని కోహ్లీతో ఓపెనింగ్ చేయిస్తే.. టీమిండియ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం టీమిండియాలో మంచి ఫామ్ లో ఉంది. బుమ్రా, సిరాజ్, పాండ్యాలు టచ్ లోకి వచ్చారు. అదీకాక ఒకే గ్రౌండ్ లో భారత జట్టు ఎక్కువ మ్యాచ్ లు ఆడటం వారికి కలిసొచ్చే అంశం” అని చెప్పుకొచ్చాడు పాక్ మాజీ స్పిన్నర్ కమ్రాన్ అక్మల్.

ఈ క్రమంలోనే ఐసీసీపై కాసింత అసంతృప్తిని కూడా వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల కోసం ఐసీసీ మెరుగైన పిచ్ లను రెడీ చేయాలి, లేకుంటే.. ప్రజలు క్రికెట్ ను చూడ్డం మానేస్తారు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి విరాట్ కోహ్లీని ఓపెనర్ గా కంటే మూడో స్థానంలోనే బ్యాటింగ్ కు పంపితేనే జట్టుకు మంచిది అని సూచనలు ఇచ్చిన కమ్రాన్ అక్మల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments