నోరు జారిన పాక్‌ క్రికెటర్‌! ‘రాత్రి 12 గంటల’ కామెంట్‌పై భజ్జీకి క్షమాపణలు!

Kamran Akmal, 12 o'clock Sikh, Harbhajan Singh, IND vs PAK: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ముగిసింది. అయితే.. ఈ మ్యాచ్‌ గురించి విశ్లేషిస్తూ.. ఓ పాక్‌ మాజీ క్రికెటర్‌ అర్షదీప్‌ సింగ్‌పై మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దానిపై భజ్జీ సీరియస్‌ అవ్వడంతో అక్మల్‌ ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Kamran Akmal, 12 o'clock Sikh, Harbhajan Singh, IND vs PAK: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ముగిసింది. అయితే.. ఈ మ్యాచ్‌ గురించి విశ్లేషిస్తూ.. ఓ పాక్‌ మాజీ క్రికెటర్‌ అర్షదీప్‌ సింగ్‌పై మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దానిపై భజ్జీ సీరియస్‌ అవ్వడంతో అక్మల్‌ ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆదివారం న్యూయార్క్‌లోని నసావు క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను కేవలం 119 పరుగులకే ఆలౌట్‌ చేసినా.. ఆ టార్గెట్‌ను కూడా ఛేజ్‌ చేయలేక చేతులెత్తేసింది. అయితే.. తమ జట్టు ఓడిపోతే.. ఓటమికి గల కారణాలు విశ్లేషించుకోవడమో, నెక్ట్స్‌ మ్యాచ్‌లో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో.. మాజీ క్రికెటర్లగా ఎవరైనా చేస్తారు. కానీ, పాకిస్థాన్‌ మాజీలు మాత్రం అది వదిలేసి.. టీమిండియా బౌలర్‌ అర్షదీప్‌ సింగ్‌ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతని మతానికి సంబంధించిన విషయంలో హేళన చేస్తూ కామెంట్‌ చేశాడు పాక్‌ మాజీ క్రికెటర్‌ కమ్రాన్‌ అక్మల్‌.

ఓ టీవీ ఛానెల్‌లో మ్యాచ్‌ ఎనాలసిస్‌ షోలో పాల్గొన్న అక్మల్‌.. సిక్కుల(అర్షదీప్‌ సింగ్‌)కు ‘రాత్రి 12 గంటల’కు బౌలింగ్‌ ఇచ్చారంటూ హేళనగా నవ్వాడు. ఈ కామెంట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ ఫుల్‌ సీరియస్‌ అయ్యాడు. ‘లఖ్ ది లానత్ తేరే కమ్రాన్ అఖ్మల్.. ఇలాంటి కామెంట్లు చేసే ముందు సిక్కుల చరిత్ర తెలుసుకో.. మీ తల్లులు, సోదరీమణులను ఆక్రమణదారులు అపహరించినప్పుడు, వారి చెర నుంచి మేం(సిక్కులు) రక్షించాం, అప్పుడు సమయం సరిగ్గా 12 గంటలు. సిగ్గుపడండి.. కొంత కృతజ్ఞత చూపండి’ అంటూ కమ్రాన్‌ అక్మల్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ట్వీట్‌ చేశాడు. భజ్జీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్మల్‌ వెంటనే ట్విట్టర్‌లో క్షమాపణలు కోరాడు. ‘నేను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నాను, హర్భజన్‌ సింగ్‌ను, సిక్కులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. నా మాటలు అసందర్భంగా, అగౌరవంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. ఎవరినీ బాధపెట్టాలని ఉద్దేశ పూర్వకంగా నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. నన్ను క్షమించండి.’ అంటూ పేర్కొన్నాడు.

అయితే.. అసలు ఈ ‘రాత్రి 12 గంటల’ జోక్‌ ఏంటి? దీనిని అక్మల్‌ ఎందుకు హేళనగా మాట్లాడాడు? భజ్జీ ఎందుకు సీరియస్‌ అయ్యాడు? అని చాలా మంది క్రికెట్‌ అభిమానులు ఆలోచిస్తున్నారు. ఈ ‘రాత్రి 12 గంటల’ జోక్‌ వెనుక చాలా హిస్టరీ ఉంది. 17వ శతాబ్దంలో నాదిర్‌ షా.. ఢిల్లీని దోచుకుని.. పంజాబ్‌ మీదుగా వెళ్తున్నాడు. ఆ సమయంలో చాలా మంది హిందూ, ముస్లింలను చంపి.. వారి తల్లులను, భార్యలను, అక్కాచెల్లెళ్లలను ఆడవారిని బంధీలుగా తీసుకుని వెళ్తున్నాడు. నాదిర్‌ షా చెర నుంచి హిందూ మహిళలను రక్షించాలని.. సిక్సులు నాదిర్‌ షాతో పోరాటానికి సిద్ధం అవుతారు. అయితే.. నాదిర్‌ షా సైన్యం పెద్దది, వారితో యుద్ధం చేయడం అసాధ్యం. అందుకోసం సిక్సులు ఒక ప్రణాళిక రచిస్తారు.. నాదిర్‌ షా సైన్యం నిద్రలో ఉన్న సమయంలో అంటే రాత్రి 12 గంటల సమయంలో వారి స్థావరంపై దాడి చేసి.. వందల మంది హిందూ, ముస్లిం మహిళలను రక్షిస్తారు. ఇంతటి వీరపోరాటం తర్వాతి కాలంలో జోక్‌గా మారిపోయింది. అదేంటంటే.. సిక్కులు రాత్రి 12 గంటల సమయంలోనే స్పృహలో ఉంటారని, చాలా మంది హిందువులు దాన్ని ఒక మతపరమైన జోక్‌గా సిక్కులపై వాడేవారు. కానీ, వారి తల్లి, భార్య, అక్కాచెల్లెళ్లలను రక్షించిన వారిని అవమానిస్తున్నార విషయం మర్చిపోతున్నారు.

ఇప్పుడు అక్మల్‌ కూడా.. ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా ఆలస్యం అవ్వడంతో అర్ధరాత్రి వరకు జరిగింది. దీంతో.. చివరి ఓవర్‌కి 18 పరుగుల డిఫెండ్‌ చేయాల్సి ఉన్నా.. టీమిండియా అర్షదీప్‌ సింగ్‌తో వేయించిందని, అసలే రాత్రి 12 గంటల సమయంలో సర్దార్‌ జీకి బౌలింగ్‌ ఇచ్చారంటూ హేళనగా మాట్లాడాడు. అక్మల్‌ వ్యాఖ్యలపై సిక్కు సమాజం మండిపడింది. హర్భజన్‌ సింగ్ కూడా అక్మల్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేయడంతో అతను తన తప్పు తెలుసుకొని సారీ చెప్పాడు. చరిత్రలో జరిగిన కొన్ని విషయాలు తర్వాత తర్వాత జోకులుగా మారుతాయని ఈ విషయం తెలిస్తే అర్థమవుతుంది. కానీ, వారి పోరాటం మాత్రం వెలకట్టలేనిదని నెటిజన్లు ఈ అంశంపై కామెంట్‌ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments