వీడియో: యాషెస్ రెండో టెస్ట్.. గ్రౌండ్ లోకి దూసుకొచ్చిన నిరసనకారులు! ఎత్తి పడేసిన బెయిర్ స్టో..

  • Author Soma Sekhar Published - 07:05 PM, Wed - 28 June 23
  • Author Soma Sekhar Published - 07:05 PM, Wed - 28 June 23
వీడియో: యాషెస్ రెండో టెస్ట్.. గ్రౌండ్ లోకి దూసుకొచ్చిన నిరసనకారులు! ఎత్తి పడేసిన బెయిర్ స్టో..

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు కొన్ని అవాంతరాలు ఏర్పడుతుంటాయి. తమ అభిమాన ఆటగాడిని కలవడానికి గ్రౌండ్ లోకి దూసుకొస్తుంటారు ఫ్యాన్స్. ఇక మరికొంత మంది ఫ్లకార్డులు ప్రదర్శించి తమ ప్రేమను తెలియపరుస్తుంటారు.ఇంకొంత మంది తమ బాధను మైదానంలోకి దూసుకొచ్చి వెలిబుచ్చుతుంటారు. తాజాగా లార్డ్స్ గ్రౌండ్ లో జరిగిన ఓ సంఘటన నెట్టింట వైరల్ గా మారింది. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ లో భాగంగా బుధవారం నుండి రెండో టెస్ట్ ప్రారంభం అయ్యింది. ఆట ప్రారంభం అయిన కొద్ది నిమిషాలకే గ్రౌండ్ లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ లో భాగంగా.. బుధవారం రెండో టెస్ట్ ప్రారంభం అయ్యింది. తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగగా.. అండర్సన్ తొలి ఓవర్ వేశాడు. ఈ ఓవర్ ముగిసిన వెంటనే గ్రౌండ్ లోకి ఇద్దరు నిరసనకారులు దూసుకొచ్చారు. వారి చేతుల్లో ఆరెంజ్ ఉన్న ఆరెంజ్ కలర్ ను చల్లుతూ.. ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ అంటూ నినాదాలు ఇచ్చారు. అక్కడే ఉన్న ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో.. ఓ నిరసనకారుడిని అమాంతం ఎత్తుకుని బౌండరీలైన్ అవతల దింపాడు. అతడిని తీసుకెళ్లే క్రమంలో బెయిర్ స్టో ముఖంలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపించింది. మరో నిరసన కారుడిని స్టోక్స్ నిలువరించాడు. దాంతో వెంటనే అప్రమత్తం అయిన సెక్యూరిటీ గ్రౌండ్ లోకి వచ్చి.. వారిని తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ నిరసనకారులు ఎవరు?

‘జస్ట్ స్టాప్ ఆయిల్’ అనేది ఇంగ్లాండ్ లో పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న ఓ గ్రూప్. 2022 మార్చి నుంచి ఈ ఉద్యమం కొనసాగుతోంది. యూకేలో ఇంధన సంస్థలకు అడ్డగోలుగా లైసెన్స్ లు ఇవ్వడాన్నిజస్ట్ స్టాప్ ఆయిల్ గ్రూప్ వ్యతిరేకిస్తోంది. ఈ ఉద్యమం కొనసాగుతున్న వేళ 2025 నాటికి కొత్తగా మరో 100కి పైగా ఆయిల్, గ్యాస్ ప్రాజెక్ట్ లను తీసుకురావాలని యూకే ప్రభుత్వం చూస్తోంది. ఈ నిర్ణయం జస్ట్ స్టాప్ ఆయిల్ గ్రూప్ కు ఆగ్రహం తెప్పించింది. ఇలా ఆయిల్ కంపెనీలకు అడ్డూ అదుపులేకుండా లైసెన్స్ లు ఇచ్చుకుంటూ పోతే.. పర్యావరణం దెబ్బతింటుందని ఈ గ్రూప్ కు చెందిన నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజ్ లో డేవిడ్ వార్నర్ (53) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. తొలి టెస్ట్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజా 17 పరుగులకే అవుట్ అయ్యాడు.

Show comments