ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ హోరాహోరిగా సాగుతోంది. తొలి రెండు టెస్ట్ ల మాదిరిగానే మూడో టెస్ట్ కూడా రసవత్తరంగా మారుతోంది. లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఆ సంఘటనతో ఆసీస్ ఆటగాళ్లు ఒక్కసారిగా నవ్వులు చిందించారు. రెండో టెస్ట్ మ్యాచ్ లో అనూహ్యంగా రనౌట్ అయిన బెయిర్ స్టో.. తాజా మ్యాచ్ లో దాన్ని గుర్తుపెట్టుకుని మరీ ఆసీస్ ఆటగాళ్లవైపు ఇప్పుడు అవుట్ చేయండ్రా అన్నట్లు చూశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న యాషెస్ సమరంలో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గెలుపోటముల కన్నా.. మ్యాచ్ లో జరిగే ఇతర విషయాలే ఎక్కువగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తొలి టెస్ట్ మెుదలు కొని, ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ వరకు వివాదాలకు దారితీసిన సంఘటనలు ఎన్నో జరిగాయి. తొలి టెస్ట్ లో గ్రీన్ పట్టిన క్యాచ్, రెండో టెస్ట్ లో స్మిత్ క్యాచ్, స్టార్క్ క్యాచ్ లతో పాటుగా బెయిర్ స్టో రనౌట్ తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్ట్ మ్యాచ్ లో కీలక సమయంలో బెయిర్ స్టో అవుట్ కావడంతో.. ఇంగ్లాండ్ విజయావకాశాలు దెబ్బతిన్నాయనే చెప్పాలి. ఇక ఈ ఔట్ క్రీడాస్ఫూర్తికి విరుద్దంగా జరిగిందని కొందరు అంటే.. కరెక్టే అని మరికొందరు వాదించారు.
ఇక సంఘటనను మైండ్ లో గుర్తు పెట్టుకున్నట్లు ఉన్నాడు బెయిర్ స్టో.. మూడో టెస్ట్ లో తొలి రోజు బ్యాటింగ్ కు వచ్చిన బెయిర్ స్టో.. ఓ బంతిని షాట్ ఆడాడు. ఆ బంతి బ్యాట్ కు తాకి, ఫ్యాడ్ కు తాకి అక్కడే కొద్ది దూరంలో వెల్లింది. దాంతో కొద్దిగా క్రీజ్ బయటకు రన్ కోసం వచ్చినట్లుగా వచ్చాడు బెయిర్ స్టో.. బంతి దగ్గరికి ఫీల్డర్ రాగా.. ఆస్ట్రేలియా ఫీల్డర్లను కోపంగా చూస్తూ..బ్యాట్ పట్టుకుని క్రీజ్ లోనే నిల్చున్నాడు. ఓవర్ పూర్తయ్యాక వికెట్ కీపర్, స్లిప్ ఫీల్డర్ నుంచి బాల్ వెల్లేంత వరకు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు అవుట్ చేయండ్రా అనే విధంగా కోపంగా చూశాడు బెయిర్ స్టో. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Once bitten, twice shy 😅
Jonny Bairstow stays well inside the crease only to let the Australians know about it after his unusual dismissal at Lords 🫢#SonySportsNetwork #ENGvAUS #Ashes2023 #RivalsForever pic.twitter.com/mfWqOOBC9w
— Sony Sports Network (@SonySportsNetwk) July 7, 2023