Team India: తుఫాన్ బీభత్సం.. హోటల్లోనే టీమిండియా ప్లేయర్లు! జై షా కీలక నిర్ణయం..

బెరిల్ తుఫాన్ కారణంగా బార్బడోస్ లో చిక్కుకుపోయిన టీమిండియా ప్లేయర్లు, సిబ్బందిని స్వదేశానికి రప్పించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే కీలక నిర్ణయం తీసుకున్నట్లు సెక్రటరీ జై షా పేర్కొన్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

బెరిల్ తుఫాన్ కారణంగా బార్బడోస్ లో చిక్కుకుపోయిన టీమిండియా ప్లేయర్లు, సిబ్బందిని స్వదేశానికి రప్పించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే కీలక నిర్ణయం తీసుకున్నట్లు సెక్రటరీ జై షా పేర్కొన్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 ప్రపంచ కప్ ను గెలిచిన టీమిండియా తిరిగి ఇంకా స్వదేశానికి చేరుకోలేదు. టీమిండియా ప్లేయర్లతో పాటుగా వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది అందరూ బార్బడోస్ లోనే చిక్కుకుపోయారు. బెరిల్ తుఫాన్ సృష్టిస్తున్న బీభత్సం కారణంగా అక్కడ  అన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎయిర్ పోర్ట్ లు మూసివేశారు. దాంతో టీమిండియా ఆటగాళ్లు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బార్బడోస్  లో బెరిల్ తుఫాన్ సృష్టిస్తున్న బీభత్సంతో టీమిండియా ఆటగాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. హోటల్ గదుల్లోనే ప్లేయర్లు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుఫాన్ కారణంగా విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. మూసిన ఎయిర్ పోర్ట్ ఎప్పుడు తెరుచుకుంటుంది? అన్నది ఇంకా ఎవ్వరికీ తెలియరాలేదు. దాంతో భారత ప్లేయర్లను స్వదేశానికి రప్పించేందుకు బీసీసీఐ రంగంలోకి దిగింది. చార్టర్డ్ ఫైట్స్ ద్వారా ఆటగాళ్లను ఇండియాకు రప్పించేందుకు సిద్దమవుతున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు.

జై షా మాట్లాడుతూ..”టీమిండియా ప్లేయర్లను, మీడియా ప్రతినిధులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. ఇందుకోసం చార్టర్డ్ విమానంలో ప్లేయర్లను తరలించేందుకు సిద్ధపడ్డాం. కానీ విమానాశ్రయం మూసివేయడంతో.. అది కుదరలేదు. చార్టర్డ్ విమానాలు నడిపే కంపెనీలతో బోర్డ్ టచ్ లో ఉందని, తుఫాన్ తీవ్రత తగ్గి.. విమానాశ్రయం తెరవగానే ఆటగాళ్లను ఇక్కడికి తీసుకొస్తాం” అని జై షా చెప్పుకొచ్చాడు. అయితే మంగళవారం కూడా ఆటగాళ్లు బార్బడోస్ ను వదిలి వెళ్లడం కష్టంగానే ఉంది. తుఫాన్ పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. రేపు(బుధవారం) టీమిండియా ప్లేయర్లు భారత్ కు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రేపు(బుధవారం) ఉదయం 7.45 గంటలకు ఢిల్లీకి చేరుకోవచ్చని తెలుస్తోంది. అయితే ఇది తుఫాన్ తీవ్రతపై ఆధారపడుతుంది. దాంతో టీమిండియా ఫ్యాన్స్ లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్లేయర్లు సురక్షితంగా ఇండియాకు రావాలని వారు ప్రార్థిస్తున్నారు.

Show comments