iDreamPost
android-app
ios-app

Jasprit Bumrah Birthday: బుమ్రాకు విషెస్ చెబుతూ భార్య ఎమోషనల్ పోస్ట్.. ప్రతి కన్నీటి బొట్టు..!

  • Author Soma Sekhar Updated - 08:45 PM, Wed - 6 December 23

జస్ప్రీత్ బుమ్రా 31వ పుట్టినరోజు సందర్భంగా అతడి భార్య సంజనా గణేషన్ భావోద్వేగపూరిత విషెస్ తెలిపింది. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

జస్ప్రీత్ బుమ్రా 31వ పుట్టినరోజు సందర్భంగా అతడి భార్య సంజనా గణేషన్ భావోద్వేగపూరిత విషెస్ తెలిపింది. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

  • Author Soma Sekhar Updated - 08:45 PM, Wed - 6 December 23
Jasprit Bumrah Birthday: బుమ్రాకు విషెస్ చెబుతూ భార్య ఎమోషనల్ పోస్ట్.. ప్రతి కన్నీటి బొట్టు..!

జస్ప్రీత్ బుమ్రా.. వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మెగాటోర్నీలో అందరికంటే ఎక్కువగా డాట్ బాల్స్ వేసి.. చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే నేడు(డిసెంబర్ 6)న పుట్టినరోజు జరుపుకుంటున్నాడు ఈ పేస్ గన్. 1993 డిసెంబర్ 6న అహ్మదాబాద్ లో జన్మించాడు. ఈ బర్త్ డేతో 31వ పడిలోకి అడుగుపెడుతున్నాడు ఈ టీమిండియా పేస్ దళపతి. ఇక తన భర్త పుట్టిన రోజును పురస్కరించుకుని భావోద్వేగపూరిత నోట్ షేర్ చేసింది సంజనా గణేషన్. స్పోర్ట్స్ ప్రజెంటర్ గా వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుమ్రా భార్య ఆ ఎమోషనల్ పోస్ట్ లో ఏం రాసుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం.

జస్ప్రీత్ బుమ్రా నేడు(డిసెంబర్ 6)న 31వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఇక తన భర్త పుట్టినరోజు సందర్భంగా సంజనా గణేషన్ భావోద్వేగ పోస్ట్ ను షేర్ చేసింది. అందులో తన భర్తపై ఉన్న అమితమైన ప్రేమను చాటుకుంది. ఆ పోస్ట్ లో సంజనా గణేషన్ ఈ విధంగా రాసుకొచ్చింది..”నా ప్రపంచం నువ్వే. మనిద్దరం ఒకేచోట ఉంటే.. ప్రతీ క్షణాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదించగలం. అలాగే బాధ కలిగించిన సంఘటనలు ఎదురైనప్పుడు అంతగా కుంగిపోము కూడా. ప్రతీ చిరునవ్వు, నా ప్రతీ కన్నీటి బొట్టు, సంతోషం.. అన్ని భావోద్వేగాల్లోనూ నేను నీతోనే ఉంటాను. నీతో జీవితాన్ని పంచుకోవడం నాకు సంతోషాన్నిస్తోంది. నున్వే నా ప్రపంచం.. నా వరల్డ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ ఎమోషనల్ గా విషెస్ చెప్పింది సంజనా.

కాగా.. బుమ్రా-సంజన దంపతులకు ఇటీవలే పండంటి కొడుకు పుట్టాడు. ఆ పిల్లాడికి అంగద్ బుమ్రా అని పేరు కూడా పెట్టారు. 2021 మార్చి 15న వీరిద్దరు మూడుముళ్లతో ఒక్కటైయ్యారు. ఇదిలా ఉండగా.. 2016లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్పీడ్ గన్ ఇప్పటి వరకు 181 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి.. 351 వికెట్లు పడగొట్టాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రస్తుతం టీమిండియా పేస్ దళానికి నాయకుడిగా ఉన్నాడు బుమ్రా. బుమ్రాతో పాటుగా మరికొంతమంది స్టార్ క్రికెటర్లు ఇదే రోజున బర్త్ డే జరుపుకుంటున్నారు. మరి బుమ్రా భార్య సంజనా ఎమోషనల్ విషెస్ చెప్పడం మీకేవిధంగా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sanjana Ganesan (@sanjanaganesan)