Nidhan
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్ అందరికీ సుపరిచితురాలే. బుమ్రా వైఫ్‌గానే కాదు.. స్పోర్ట్స్ యాంకర్‌గానూ ఆమెకు మంచి క్రేజ్ ఉంది.
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్ అందరికీ సుపరిచితురాలే. బుమ్రా వైఫ్‌గానే కాదు.. స్పోర్ట్స్ యాంకర్‌గానూ ఆమెకు మంచి క్రేజ్ ఉంది.
Nidhan
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటేనే ప్రత్యర్థి బ్యాటర్లు గజగజలాడుతున్నారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అతడి బౌలింగ్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ఇండియన్ పిచెస్పై ఓ పేస్ బౌలర్ ఇంతలా రెచ్చిపోయి బౌలింగ్ చేయడం మునుపెన్నడూ చూడలేదని అంటున్నారు. స్పిన్, ఫ్లాట్ ట్రాక్స్ మీదే బ్యాటర్లను వణికిస్తున్న బుమ్రా.. ఒకవేళ పేస్ ట్రాక్స్ వస్తే ఇంకెంత డేంజరస్‌గా మారతాడోనని అంటున్నారు. ఇంగ్లండ్ బజ్‌బాల్‌కు సరైన కౌంటర్ బూమ్‌బాల్ అని చెబుతున్నారు. ఈ తరుణంలో బుమ్రా భార్య సంజనా గణేషన్ కొందరు ట్రోలర్స్‌పై విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారింది. ఆ మాటలు అనేందుకు సిగ్గుండాలంటూ ఆమె సీరియస్ అయింది.
అధిక బరువు అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది. జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో పాటు వారసత్వం వల్ల కూడా కొందరు ఓవర్ వెయిట్‌తో ఇబ్బంది పడుతున్నారు. అయితే పురుషుల సంగతి పక్కనబెడితే.. మహిళల్లో ముఖ్యంగా డెలివరీ తర్వాత స్త్రీలు కాస్త బరువు పెరగడం కామనే. అయితే కొందరు విమెన్‌ను టార్గెట్ చేసుకొని బరువు ఎక్కువ ఉన్నారంటూ కామెంట్స్ చేస్తుంటారు. అందులోనూ క్రికెటర్లు, సినీ తారల విషయంలో ట్రోలింగ్ చాలా ఎక్కుగా ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరు బుమ్రా భార్యను ట్రోల్ చేశారు. ఆమె లావెక్కిందంటూ కామెంట్ చేశారు. దీనికి సంజన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అలా మాట్లాడటానికి సిగ్గుండాలంటూ ఆమె సీరియస్ అయింది. స్కూలు సైన్స్ పుస్తకాల్లో ఏముందో గుర్తుండదని.. కానీ స్త్రీల శరీరాల గురించి కామెంట్ చేసేందుకు మాత్రం ముందుంటారంటూ ఫైర్ అయింది.
ట్రోలర్స్‌పై విరుచుకుపడిన బుమ్రా భార్యను సోషల్ మీడియాలో నెటిజన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదంటున్నారు. ఇతరుల గురించి మాట్లాడేవారు.. ముందు వాళ్ల లైఫ్, కెరీర్ గురించి చూసుకుంటే బెటర్ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుందని, సమస్యలు ఉంటాయని.. సెలబ్రిటీలు అయినంత మాత్రాన వారి మీద ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసే హక్కు ఉందనుకోవడం సరికాదంటున్నారు. ట్రోలర్స్‌కు సంజనా కరెక్ట్ కౌంటర్ ఇచ్చిందని.. ఇది ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తోందని చెబుతున్నారు. ఇక, ఈ విషయాన్ని అటుంచితే.. భారత జట్టు రాజ్‌కోట్ టెస్టుకు రెడీ అవుతోంది. సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచులో నెగ్గి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లాలని భావిస్తోంది. మరి.. ట్రోలర్స్‌కు బుమ్రా భార్య ఇచ్చిపడేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: క్రికెట్‌కు టీమిండియా స్టార్ గుడ్‌బై.. మరో ధోని అవుతాడనుకుంటే..!
Sanjana Ganesan’s reply on the Instagram post. pic.twitter.com/DgIhrtRurs
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 12, 2024