SNP
Jasprit Bumrah, Virat Kohli, IND vs BAN: బంగ్లాతో రెండో టెస్ట్ కంటే ముందు.. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా మధ్య ఆసక్తికర ఫైట్ చేసింది. ఆ ఫైట్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Jasprit Bumrah, Virat Kohli, IND vs BAN: బంగ్లాతో రెండో టెస్ట్ కంటే ముందు.. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా మధ్య ఆసక్తికర ఫైట్ చేసింది. ఆ ఫైట్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
భారత్-బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం నుంచి కాన్పూర్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. రెండు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా.. తొలి టెస్ట్ చెన్నై వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా రాణించి.. ఘన విషయం సాధించింది. ఇక రెండో టెస్ట్‌లో కూడా గెలిచి.. సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలని రోహిత్ సేన గట్టి పట్టుదలతో ఉంది. రెండో టెస్ట్ జరిగే కాన్పూర్ పిచ్ కండీషన్‌ను దృష్టిలో పెట్టుకొని.. ఒక్క మార్పుతో టీమిండియా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. స్పిన్‌ను అనుకూలించే పిచ్‌పై పేసర్ ఆకాశ్ దీప్‌ను పక్కనపెట్టి.. కుల్దీప్ యాదవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే.. రెండో టెస్ట్‌కి ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ నెట్స్‌తో తీవ్రంగా శ్రమించాడు.
ముఖ్యంగా భారత స్టార్ బౌలర్, స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను నెట్స్‌లో ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాడి వేడి ప్రాక్టీస్ నడిచింది. కోహ్లీని అవుట్ చేయాలని బుమ్రా.. బుమ్రా బౌలింగ్‌ను చితక్కొట్టాలని కోహ్లీ.. పట్టుదలతో ఆడారు. వీళ్లిద్దరు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కొద్ది సేపు సీరియస్ వాతావరణ కనిపించింది. బుమ్రా బౌలింగ్‌లో మొత్తంగా 15 బంతులు ఆడిన కోహ్లీ.. ఏకంగా 4 సార్లు అవుట్ కావడం గమనార్హం. కోహ్లీ వర్సెస్ బుమ్రా ఫైట్‌లో.. బుమ్రానే పైచేయి సాధించాడని చెప్పవచ్చు. అయితే.. బుమ్రా బౌలింగ్ ఆడిన తర్వాత.. కోహ్లీ స్పిన్ బౌలింగ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
పక్క నెట్స్‌లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బౌలింగ్ చేస్తుంటే.. వెళ్లి వారి బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. బుమ్రా బౌలింగ్‌లో ఇబ్బంది పడిన కోహ్లీ.. జడేజా బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు కూడా బాగా ఇబ్బంది పడ్డాడు. ఒక బాల్‌కు అయితే.. ఏకంగా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జడేజా వేసిన బాల్‌ను డిఫెండ్ చేయబోయి.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా నెట్స్‌లో విరాట్ కోహ్లీ అంత మంచి టచ్‌లో కనిపించలేదు. చెన్నైలో జరిగిన తొలి టెస్ట్‌లో కూడా కోహ్లీ విఫలమైన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో కోహ్లీ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడుతున్నాడు. అలాగే ఎంతో కాలంగా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్‌ను ఆడేందుకు కూడా ఇబ్బంది పడుతూ.. దాన్ని ఒక వీక్‌నెస్‌గా మార్చుకున్నాడు. తొలి టెస్ట్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అదే బాల్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. ఇప్పుడు రెండో టెస్ట్‌కి ముందు.. నెట్స్‌లో కోహ్లీ సరైన టచ్‌లో లేకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat kohli Reportedly Faced 15 deliveries Against jasprit Bumrah in The nets and he was Out Four Times🤯 pic.twitter.com/rzKcE4PNa3
— 45.❤ (@45_mahiya) September 26, 2024