వీడియో: బుమ్రా డెడ్లీ యార్కర్‌! పృథ్వీషా రియాక్షన్‌ చూడండి!

Jasprit Bumrah, Prithvi Shaw, MI vs DC, IPL 2024: ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌లో బుమ్రా వేసిన ఓ డెలవరీ మ్యాచ్‌ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఆ బాల్‌కు అవుటైన పృథ్వీ షా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ ఇంకా హైలెట్‌. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Jasprit Bumrah, Prithvi Shaw, MI vs DC, IPL 2024: ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌లో బుమ్రా వేసిన ఓ డెలవరీ మ్యాచ్‌ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఆ బాల్‌కు అవుటైన పృథ్వీ షా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ ఇంకా హైలెట్‌. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

బుమ్రా పేరు చెబితేనే చాలా మంది గొప్ప గొప్ప బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అతను వేసే కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంత్‌, యార్కర్లకు ఇబ్బంది పడి, వికెట్లు సమర్పించుకున్న బ్యాటర్లు ఎంతో మంది ఉన్నారు. బుమ్రా బౌలింగ్‌లో అవుటైన బాల్‌ను తల్చుకుంటూ ఇప్పటికీ భయపెడే ప్లేయర్ల జాబితాలో టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షా కూడా చేరిపోయినట్లు ఉన్నాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షా.. 40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 66 పరుగులు చేసి రాణించాడు. కానీ, బుమ్రా బౌలింగ్‌లో అతను అవుటైన తీరు మాత్రం మొత్తం మ్యాచ్‌కే హైలెట్‌ నిలిచింది. బుమ్రా యార్కర్లు అద్భుతంఆ వేస్తాడని అందరికీ తెలిసిందే. అయితే.. అతను యార్కర్‌ వేసిన ప్రతిసారీ.. అది హైలెట్‌గానే మారుతుంది. తాజాగా సూపర్‌ యార్కర్‌తో అప్పటి వరకు బాగా ఆడుతున్న పృథీ షాను పెవిలియన్‌కు పంపాడు.

ముంబైలో వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సూపర్‌ యార్కర్‌ చోటు చేసుకుంది. 40 బంతుల్లో 66 పరుగులతో అద్భుతంగా ఆడుతున్న పృథ్వీ షాను అవుట్‌ చేసేందుకు బుమ్రా.. 12వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్‌ ఐదో బంతికి కళ్లు చెదిరే మిస్సైల్‌ లాంటి యార్కర్‌ను సంధించాడు. అప్పటి వరకు బౌలర్లందరిని బాగానే ఎదుర్కొంటూ.. వేగంగా పరుగులు చేస్తున్న పృథ్వీ షా వద్ద ఆ బాల్‌కు సమాధానం లేకపోయింది. కనీసం దాన్ని డిఫెన్స్‌ చేసే ఛాన్స్‌ కూడా ఇవ్వలేదు బుమ్రా.. మధ్యలో కాలు పెడితే.. కాలు విరిగిపోయే వేగంతో వచ్చిన బాల్‌ను తన తల తప్పించి గాయం కాకుండా బతికిపోయాడు షా. కానీ, లెగ్‌ స్టంప్‌ వికెట్‌ మాత్రం.. నేలవాలిపోయింది. బాల్‌ ఎంత వేగంగా వచ్చిందంటే.. ఆ వేగానికి లెగ్‌ వికెట్‌ పూర్తిగా పడిపోయింది కానీ, పక్కనే ఉన్న రెండు వికెట్ల పైన ఉన్న స్టంప్‌ మాత్రం కదల్లేదు. అది బూమ్‌ బూమ్‌ బుమ్రా స్పెషల్‌.. అయితే.. అవుట్‌ అయ్యాకా.. అసలు అలా ఎలా అవుట్‌ అయ్యానా? అని పృథ్వీ షా పెట్టిన తికమక ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్‌ అయితే హైలెట్‌గా నిలిచింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రోహిత్‌ శర్మ 49, ఇషాన్‌ కిషన్‌ 42, టిమ్‌ డేవిడ్‌ 45, షెఫర్డ్‌ 39 పరుగులతో రాణించారు. రోహిత్‌-ఇషాన్‌ ముంబైకి సూపర్‌ స్టార్ట్‌ అందించారు. చివర్లో షెఫర్డ్‌ విధ్వంసం సృష్టించాడు. చివరి ఓవర్‌లో నాలుగు సిక్సులు, రెండో ఫోర్లతో 32 పరుగులు రాబట్టాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌, నోర్జే రెండేసి వికెట్లతో రాణించారు. ఇక 235 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన డీసీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. పృథ్వీ షా 66, అభిషేక్‌ సోరెల్‌ 41, ట్రిస్టన్‌ స్టబ్స్‌ 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులతో 71 పరుగులు చేసి రాణించినా.. విజయం దక్కలేదు. ముంబై బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ 4, బుమ్రా 2 వికెట్లతో సత్తా చాటారు. మరి ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో పృథ్వీ షా క్లీన్‌ బౌల్డ్‌ అయిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments