SNP
Jasprit Bumrah, Glenn Mcgrath, T20 World Cup 2024: ఆస్ట్రేలియా వరుస వరల్డ్ కప్పులు కొట్టడానికి కారణం ఒక ఆయుధం.. అలాంటి ఆయుధమే ఇప్పుడు మనకూ ఉంది. అందుకే ఈ వరల్డ్ కప్ మనదే అంటున్నారు క్రికెట్ నిపుణులు. మరి ఆ ఆయుధం ఎవరో? ఏంటో ఇప్పుడు చూద్దాం..
Jasprit Bumrah, Glenn Mcgrath, T20 World Cup 2024: ఆస్ట్రేలియా వరుస వరల్డ్ కప్పులు కొట్టడానికి కారణం ఒక ఆయుధం.. అలాంటి ఆయుధమే ఇప్పుడు మనకూ ఉంది. అందుకే ఈ వరల్డ్ కప్ మనదే అంటున్నారు క్రికెట్ నిపుణులు. మరి ఆ ఆయుధం ఎవరో? ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
2011 తర్వాత టీమిండియా ఇంత వరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. దాదాపు 13 ఏళ్లు గడిచిపోయాయి.. ఈ మధ్య కాలంలో టీమ్ సరిగ్గా లేదా? అంటే అదీ కాదు.. ప్రపంచ క్రికెట్‌ను డామినేట్ చేస్తూనే ఉంది. మూడు ఫార్మాట్లలోనూ టాప్ వన్ లేదా టూలో ఉంటూ వస్తోంది. వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తున్నా.. ఆ ‘కప్పు’ మాత్రం కొట్టలేకపోతుంది. టోర్నీ మొత్తం ఎంత బాగా ఆడినా.. కప్పు కొట్టకపోతే.. ఆ కష్టమంతా వేస్టే. టీమిండియా ప్రధాన బలం ఏంటి అంటే ఎవరైనా చెప్పేది బ్యాటింగ్ అనే. ఇన్నేళ్ల టీమిండియా ప్రస్థానంలో బ్యాటింగ్ బలంతోనే చాలా మ్యాచ్‌లు నెగ్గింది. బౌలింగ్ బలంతో నెగ్గిన మ్యాచ్‌లు వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. ఇలా ఒక్క విభాగంలోనే స్ట్రాంగ్‌గా ఉండటం టీమిండియాకు ఉన్న పెద్ద మైనస్ ఇదే.
మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం కప్పుల మీద కప్పులు కొడుతుంది. ఇండియా, ఆస్ట్రేలియా రెండు పెద్ద టీములు.. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడితే ఏ జట్టు గెలుస్తుందో చెప్పడం కష్టం. ఎందుకంటే.. రెండు సమవుజ్జీ జట్లే. 1990 చివర్ల నుంచి 2000 దశకం వరకు ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న తరుణంలో కూడా కంగారులకు గట్టి పోటీ ఇచ్చిన ఏకైక జట్టు ఇండియానే. ఆ తర్వాత వారి డామినేషన్‌ను తొక్కి.. వాళ్లనే డామినేట్ చేసే స్థాయికి ఎదిగింది. అయినా కూడా కప్పుల విషయానికి వచ్చే సరికి ఇప్పటికీ ఆస్ట్రేలియానే టాప్‌లో ఉంది. గతంలో ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో స్ట్రాంగ్‌గా ఉన్న సమయంలో ఆ టీమ్‌కు ఒక బలమైన ఆయుధం ఉండేది. ఆ ఆయుధం పేరు గ్లెన్ మెక్‌గ్రాత్. కళ్లు చెదిరే వేగం ఉండదు, విచిత్రమై బౌలింగ్ శైలి కాదు.. అయినా కూడా ప్రపంచ క్రికెట్‌లో హేమాహేమీ బ్యాటర్లకు నిద్రలేకుండా చేసిన బౌలర్ అతను.
ఆస్ట్రేలియా వరుసగా మూడు వరల్డ్ కప్పులు.. 1999, 2003, 2007 వన్డే వరల్డ్ కప్స్ గెలిచిందంటే.. అందుకు ప్రధాన కారణం మెక్‌గ్రాత్. మిగతా టీమ్ కూడా ఎంతో పటిష్టంగా ఉన్నా కూడా మెక్‌గ్రాత్ టీమ్‌లో ఉండటం, అతను మెరుగైన ప్రదర్శన చేయడం.. ఆసీస్‌ను తిరుగులేని శక్తిగా నిలబెట్టింది. అప్పట్లో ఆస్ట్రేలియాకు అద్భుతమైన ఓపెనర్లు గిల్‌క్రిస్ట్, మ్యాథ్యూ హేడెన్, గొప్ప కెప్టెన్ రికీ పాంటింగ్, స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్, గొప్ప స్పిన్నర్ షేన్ వార్న్.. ఇలా టీమ్ అంతా స్ట్రాంగ్‌గా ఉన్నా.. మెక్‌గ్రాత్‌తో ఆ టీమ్ భయంకరంగా మారింది. వేరే టీమ్స్ కూడా బ్యాటింగ్ విషయంలో ఆస్ట్రేలియాకు పోటీ ఇస్తున్నా.. బౌలింగ్ విషయం వచ్చేసరికి.. మిగతా టీమ్స్‌కి, ఆస్ట్రేలియాకి మెక్‌గ్రాత్ ఒక స్పష్టమైన తేడాలా కనిపించేవాడు. కేవలం మెక్‌గ్రాత్ ఉండటంతోనే ‘వామ్మో ఆస్ట్రేలియా’నా అనిపించే స్థాయికి వెళ్లింది కంగారుల టీమ్. అందుకే వరల్డ్ కప్పులను టీ కప్పులు అందుకున్నంత ఈజీగా అందుకుంది ఆస్ట్రేలియా.
అయితే.. 1999 నుంచి 2007 మధ్య కాలంలో ఆస్ట్రేలియాకు ఎలాగైతే మెక్‌గ్రాత్ ఒక ఆయుధంగా ఉండేవాడో.. ఇప్పుడు టీమిండియాకు కూడా అలాంటి ఒక వజ్రాయుధమే దొరికింది. ఆ వజ్రాయుధం పేరు జస్ప్రీత్ బుమ్రా. ఈ బౌలర్ టీమ్‌లోకి వచ్చి చాలా కాలమైంది. వచ్చినప్పటి నుంచి మంచి ప్రదర్శనలు చేస్తూనే ఉన్నాడు. గాయాలతో సహవాసం చేస్తూ.. మ్యాచ్ ఆడినప్పుడు మంచి ప్రదర్శనలు ఇస్తున్నాడు. కానీ, గత కొన్ని రోజులుగా ‘అన్ ప్లేయబుల్’ బౌలర్‌గా మారిపోయాడు. బుమ్రా బౌలింగ్‌ను ఆడాలంటే ప్రత్యర్థి వెన్నులో వణుకు పుడుతోంది. పాకిస్థాన్ లాంటి టీమ్‌పై టీ20 మ్యాచ్‌లో 119 పరుగులు మాత్రమే చేసి కూడా టీమిండియా గెలిచింది అంటే అది బుమ్రా వల్లే. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా 4 ఓవర్లలో కేవలం 8 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మొత్తం బుమ్రా.. టీమిండియాకు మెక్‌గ్రాత్‌లా మారిపోయాడు.
కేవలం బ్యాటింగ్ బలంతోనే కాదు.. బుమ్రాను నమ్ముకుని ఎంత చిన్న స్కోర్‌నైనా కాపాడుకుని మ్యాచ్‌ను గెలవచ్చు అనే ధీమా ప్రస్తుతం టీమిండియాలో కనిపిస్తోంది. దానికి ఏకైక కారణం బూమ్ బూమ్ బుమ్రానే. అయితే.. ఈ వజ్రాయుధాన్ని సరిగ్గా వాడితే.. అప్పుడ ఆస్ట్రేలియా ఎలాగైతే కప్పులు పంట పడించిందో.. ఇప్పుడు టీమిండియా కూడా సేమ్ అలాంటి ఆధిపత్యాన్ని చూపించవచ్చు. అప్పటి ఆస్ట్రేలియా లానే ఇప్పుటి టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో లాంటి సీనియర్లతో పాటు రిషభ్ పంత్, పాండ్యా అలాగే స్పిన్ విభాగాంలో కుల్దీప్ యాదవ్, పేస్ బౌలింగ్‌లో బుమ్రాకు తోడుగా సిరాజ్, అర్షదీప్.. వస్తే మొహమ్మద్ షమీ.. ఇలా టీమ్ ఎంతో స్ట్రాంగ్‌గా ఉంది. అంతా ఉన్నా.. బుమ్రా ఉండటంతో టీమిండియా నెక్ట్స్ లెవెల్ టీమ్‌లా మారిపోయింది. అందుకే బుమ్రాను సరిగ్గా వాడుకుని కప్పులు కొట్టాలని, ఇప్పుడు అంతా మన చేతుల్లోనే ఉందని క్రికెట్ నిపుణులు అంటున్నారు.. బుమ్రా అనే ఆయుధంతో.. కప్పు వేటను ఈ టీ20 వరల్డ్ కప్‌తోనే మొదలుపెట్టాలని కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
BUMRAH HAS BOWLED 62 DOT BALLS FROM 15 OVERS IN T20I WORLD CUP 2024. 🤯 pic.twitter.com/0prXGCC9fR
— Johns. (@CricCrazyJohns) June 21, 2024