iDreamPost
android-app
ios-app

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బుమ్రా భార్య! పేరు కూడా పెట్టేశారు

  • Published Sep 04, 2023 | 10:43 AM Updated Updated Sep 04, 2023 | 10:43 AM
  • Published Sep 04, 2023 | 10:43 AMUpdated Sep 04, 2023 | 10:43 AM
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బుమ్రా భార్య! పేరు కూడా పెట్టేశారు

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తండ్రైయ్యాడు. ఈ రోజు ఉదయం అతని భార్య సంజనా గణేశన్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను బుమ్రా స్వయంగా తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో వెల్లడించాడు. పైగా తన కుమారుడికి పేరు కూడా పెట్టేశాడు. అంగద్‌ జస్ప్రీత్‌ బుమ్రాను ఈ ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నట్లు తన సంతోషాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు. తన చేసిన పోస్టులో ‘ చిన్న కుటుంబం పెరిగింది. మా హృదయాలు ఊహించిన దానికంటే నిండుగా ఉన్నాయి! ఈ ఉదయం మేము మా చిన్నోడు అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోకి స్వాగతించాం. ప్రస్తుతం మాకు చందమామపై ఉన్నట్లు ఉంది. మా జీవితంలోని ఈ కొత్త అధ్యాయంతో తెచ్చే ప్రతిదాని కోసం వేచి ఉండలేం’ అంటూ పేర్కొన్నాడు.

కాగా బుమ్రా ప్రస్తుతం ఆస్పత్రిలో భార్య, బాబుతోనే ఉన్నాడు. శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్‌ 2023లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన బుమ్రా.. తన భార్య డెవలరీ టైమ్‌ రావడంతో ఇండియాకు ఆదివారం తిరిగి వచ్చేశాడు. సోమవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లకు బహుషా బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చు. వెన్నుగాయం నుంచి దాదాపు ఏడాది కాలం జట్టుకు దూరమైన బుమ్రా.. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆ సిరీస్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన బుమ్రా.. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్లో మాత్రం వర్షం కారణంగా బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. కానీ, బ్యాటింగ్‌లో మాత్రం పాక్‌ పేసర్ల బౌలింగ్‌లో సూపర్‌ షాట్లతో అలరించాడు. ఇప్పుడు బుమ్రా వారుసుడి రాకతో మరింత సంతోషంగా ఉన్నాడు. మరి బుమ్రా కుమారుడి పేరు ఎలా ఉండదో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సిక్సులతో హడలెత్తించిన హల్క్‌! కొడితే ఇలా కొట్టాలి.. సెంచరీ!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet