Somesekhar
మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని మరోసారి నిరూపించాడు జమ్ము కశ్మీర్ కు చెందిన 34 ఏళ్ల అమీర్ హుస్సేన్ లోనే. విధిని ఎదిరించి.. విజేతగా నిలిచిన ఓ క్రికెటర్ గాథను ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని మరోసారి నిరూపించాడు జమ్ము కశ్మీర్ కు చెందిన 34 ఏళ్ల అమీర్ హుస్సేన్ లోనే. విధిని ఎదిరించి.. విజేతగా నిలిచిన ఓ క్రికెటర్ గాథను ఇప్పుడు తెలుసుకుందాం.
Somesekhar
మనసులో చిన్నప్పుడే నాటుకుపోయిన ఓ కల. ఇక ఆ కలను నేరవేర్చుకోవడానికి పసితనంలోనే పడరాని పాట్లు. ఇవి చాలవన్నట్లు కుటుంబ సమస్యలు ఉండనే ఉన్నాయి. దీంతో తన డ్రీమ్ నెరవేరుతుందా? లేదా? అన్న సంధిగ్ధంలో ఉండగానే ఊహించని సంఘటన ఎదురైంది ఆ యువకుడికి. 8 ఏళ్ల పసిప్రాయంలోనే యాక్సిడెంట్ రూపంలో విధి తన రెండు చేతులను తీసుకుపోయింది. వాటితో పాటుగా క్రికెటర్ కావాలన్న కలను కూడా తీసుకుపోయిందని అందరూ అనుకున్నారు. కానీ.. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని మరోసారి నిరూపించాడు జమ్ము కశ్మీర్ కు చెందిన 34 ఏళ్ల అమీర్ హుస్సేన్ లోన్. విధిని ఎదిరించి.. విజేతగా నిలిచిన ఓ క్రికెటర్ గాథను ఇప్పుడు తెలుసుకుందాం.
అమీర్ హుస్సేన్.. జమ్ము కశ్మీర్ లోని వాఘామా గ్రామంలో జన్మించాడు. చిన్నతనం నుంచే క్రికెట్ పై ఉన్న మక్కువతో.. ఎప్పుడూ బ్యాట్, బాల్ తోనే స్నేహం చేసేవాడు. కానీ తన జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య సంఘటనతో ఒక్కసారిగా అతడి జీవితం తలకిందులైంది. 8 సంవత్సరాల ప్రాయంలో తన తండ్రి మిల్ లో జరిగిన ప్రమాదంలో అమీర్ తన రెండు చేతులను కోల్పోయాడు. దీంతో క్రికెటర్ కావాలన్న తన కల, కలగానే మిగిలిపోతుందని గుండెలు పగిలేలా ఏడ్చాడు. కానీ.. ఎక్కడో మిగిలిన ఓ చిన్న ఆశతో పడిలేచిన కెరటంలా ముందుకు సాగుతున్నాడు. రెండు చేతులు లేకపోతే ఏం.. ప్రాణం ఉందిగా అని నమ్మి.. క్రికెట్ ను ప్రాక్టీస్ చేశాడు.
అయితే అమీర్ లో ఉన్న టాలెంట్ ను గుర్తించిన అతడి టీచర్.. పారా క్రికెట్ టీమ్ కు పరిచయం చేశాడు. ఇక అప్పటి నుంచి అతడి పోరాటం సాగుతూనే ఉంది. 2013 నుంచి జమ్ము కశ్మీర్ పారా క్రికెట్ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు హుస్సేన్. ప్రస్తుతం ఆ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న టీమిండియా జెర్సీ ధరించి నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న అతడి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రెండు చేతులు లేకపోయినా.. తల సాయంతో బ్యాటింగ్ చేస్తూ, కాళ్లతో బౌలింగ్ చేస్తున్నాడు అమీర్. కృషీ, పట్టుదలతో పాటుగా తన కలను నెరవేర్చుకోవాలన్న అతడి ఆశయం ముందు.. విధి తలవంచక మానలేదు. రెండు చేతులు లేకపోయినా.. తల సాయంతో అతడు బ్యాటింగ్ చేస్తున్న విధానం అందరిని అబ్బురపరుస్తోంది. ఇక కాలితో అతడు బౌలింగ్ చేయడం ఆకట్టుకుంటోంది. హుస్సేన్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో.. ఇప్పుడతడు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. చేతులు లేకపోయినా.. కోహ్లీలా కవర్ డ్రైవ్ లు ఆడుతున్నాడని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. మరి విధిని ఎదిరించి.. విజేతగా నిలిచిన అమీర్ హుస్సేన్ జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Anantnag, J&K: 34-year-old differently-abled cricketer from Waghama village of Bijbehara. Amir Hussain Lone currently captains Jammu & Kashmir’s Para cricket team. Amir has been playing cricket professionally since 2013 after a teacher discovered his cricketing talent… pic.twitter.com/hFfbOe1S5k
— ANI (@ANI) January 12, 2024