Nidhan
James Anderson Praises Virat Kohli: ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ జేమ్స్ అండర్సన్ సుదీర్ఘ కెరీర్లో ఎంతో మంది టాప్ బ్యాటర్లను ఫేస్ చేశాడు. అయితే ఆ టీమిండియా స్టార్ మాత్రం వాళ్లలో స్పెషల్ అని అంటున్నాడు జిమ్మీ. అతడ్ని మించినోడు క్రికెట్ హిస్టరీలోనే లేడని చెబుతున్నాడు.
James Anderson Praises Virat Kohli: ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ జేమ్స్ అండర్సన్ సుదీర్ఘ కెరీర్లో ఎంతో మంది టాప్ బ్యాటర్లను ఫేస్ చేశాడు. అయితే ఆ టీమిండియా స్టార్ మాత్రం వాళ్లలో స్పెషల్ అని అంటున్నాడు జిమ్మీ. అతడ్ని మించినోడు క్రికెట్ హిస్టరీలోనే లేడని చెబుతున్నాడు.
Nidhan
ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ జేమ్స్ అండర్సన్ రెండు దశాబ్దాలకు పైగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు. ఇటీవలే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడీ దిగ్గజం. సుదీర్ఘ కెరీర్లో ఎందరో టాప్ బ్యాటర్స్‌ను అతడు ఫేస్ చేశాడు. తోపు ప్లేయర్లను కూడా తన పేస్ మ్యాజిక్‌తో ముప్పుతిప్పలు పెట్టి ఎదురులేని బౌలర్‌గా ప్రశంసలు అందుకున్నాడు. అలాంటి అండర్సన్ తాను బౌలింగ్ చేసిన వారిలో ఆ టీమిండియా స్టార్ మాత్రం చాలా స్పెషల్ అని అంటున్నాడు. అతడ్ని మించినోడు క్రికెట్ హిస్టరీలోనే లేడని పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. ఎందరో బ్యాటర్లను చూసుంటాం.. కానీ అతడి లాంటోడు మళ్లీ తారసపడటం కష్టమేనని చెబుతున్నాడు. అండర్సన్ నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఆ భారత బ్యాటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై అండర్సన్ ప్రశంల జల్లులు కురిపించాడు. కోహ్లీ లాంటోడు క్రికెట్ హిస్టరీలోనే లేడని మెచ్చుకున్నాడు. టెయిలెండర్స్ అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జిమ్మీ విరాట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘విరాట్ కోహ్లీ మాదిరిగా ఛేజింగ్ చేసే మొనగాడు, సెకండ్ ఇన్నింగ్స్‌లో అంతలా రెచ్చిపోయే బ్యాటర్ మరొకరు లేరు. క్రికెట్ హిస్టరీలోనే అతడు అత్యుత్తమ ఫినిషర్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఛేజింగ్‌లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో అతడు చేసిన సెంచరీలు నమ్మశక్యం కానివి. అతడికి తన మీద తనకు నమ్మకం ఎక్కువ. ఈ నమ్మకం కారణంగానే అతడు ఛేజింగ్‌లో ఇంతలా సక్సెస్ అయ్యాడు’ అని అండర్సన్ చెప్పుకొచ్చాడు.
ఛేజింగ్ టైమ్‌లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కోహ్లీ తన మెంటాలిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో దాన్ని ఈజీగా అధిగమిస్తాడని అండర్సన్ తెలిపాడు. వైట్‌బాల్ క్రికెట్లో అతడ్ని మించిన ఫినిషర్ లేడని మెచ్చుకున్నాడు. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో బెస్ట్ ఫినిషర్‌గా కొందరు ఆస్ట్రేలియా దిగ్గజం మైకేల్ బెవాన్ పేరు చెబుతుంటారు. నంబర్ 6లో బ్యాటింగ్‌కు దిగే బెవాన్.. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థుల నుంచి మ్యాచ్‌లు లాగేసుకునేవాడు. ఇదే విషయాన్ని అండర్సన్‌ను అడగ్గా.. బెవాన్ కంటే కోహ్లీనే బెస్ట్ అని స్పష్టం చేశాడు. కోహ్లీ నంబర్ 3లో దిగి ఆఖరి వరకు బ్యాటింగ్ చేస్తాడని, మ్యాచ్ ఫినిష్ చేయకుండా బయటకు వెళ్లడని తెలిపాడు. భారీ సెంచరీలు బాదుతూ టీమ్‌ను ఫినిష్ లైన్స్‌కు చేరుస్తాడని, అతడి కంటే బెటర్ ఫినిషర్ క్రికెట్ హిస్టరీలో లేడని.. అతడికి ఎవరూ సాటిరారని పేర్కొన్నాడు. మరి.. కోహ్లీ లాంటోడు క్రికెట్ హిస్టరీలో లేడంటూ జిమ్మీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Jimmy Anderson said, “I don’t think there’s anyone better than Virat Kohli in history of the game while chasing in white ball cricket”. (Tailenders Podcast). pic.twitter.com/EKyaId7BaB
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 27, 2024