IPL పరువుతీసిన DC విధ్వంసకర ఓపెనర్‌! అంత మాట అనేశాడేంటి?

Jake Fraser Mcgurk, IPL 2024, T20 World Cup 2024: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌గా అదరగొడుతున్న ఫారెన్‌ కుర్రాడు.. ఐపీఎల్‌ పరువుతీసేలా కామెంట్స్‌ చేశాడు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

Jake Fraser Mcgurk, IPL 2024, T20 World Cup 2024: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌గా అదరగొడుతున్న ఫారెన్‌ కుర్రాడు.. ఐపీఎల్‌ పరువుతీసేలా కామెంట్స్‌ చేశాడు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌లో ఓ చిచ్చరపిడుగు ప్రపంచ శ్రేణి బౌలర్లను భయపెట్టాడు. చాలా కాలంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఏం మిస్‌ అవుతుందో దాన్ని భర్తీ చేస్తూ.. విధ్వంసకర బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభాలు అందించాడు. అతని కోసం.. డేవిడ్‌ వార్నర్‌ లాంటి ప్లేయర్‌ను పక్కనపెట్టాల్సి వచ్చింది. ఆ కుర్రాడు పేరు పలికేందుకు ఇబ్బందిగా ఉన్నా.. అతని ఆట చూస్తే వణుకు పుట్టాల్సిందే. ఐపీఎల్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరులా నిలిచిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్.. తాజాగా ఐపీఎల్‌ గురించి ఓ సంచలన కామెంట్‌ చేశాడు.

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌గా ఆడుతున్న ఈ ఆస్ట్రేలియా అండర్‌ 19 కుర్రాడు.. కచ్చితంగా టీ20 వరల్డ్‌ కప్‌కు ఎంపిక అవుతాడని అంతా భావించారు. ఎందుకంటే అతని ఆట ఆ రేంజ్‌లో ఉంది. పవర్‌ ప్లేలో అతని హిట్టింగ్‌ చూసి.. హేమాహేమీ బౌలర్లే భయపడ్డారు. టీ20 లాంటి క్రికెట్‌కు ఈ కుర్రాడి ఆట సరిగ్గా సరిపోతుంది.. జూన్‌లో జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఈ ఆటగాడిని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ఎంపిక చేస్తుందనే టాక్‌ వచ్చింది కానీ, అతనికి షాకిస్తూ.. క్రికెట్‌ ఆస్ట్రేలియా అతన్ని ఎంపిక చేయలేదు.

ఈ విషయంపై తాజాగా స్పందించిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్.. తాను టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కించుకునేంత వాడిని ఇంకా కాలేదని, దానికి ఇంకా సమయం ఉంది. అయినా ఐపీఎల్‌ లాంటి ఫ్రాంచైజ్‌ క్రికెట్‌ వేరే, వరల్డ్‌ కప్‌ టోర్నీలు వేరంటూ ఐపీఎల్‌ గాలి తీసేశాడు. ఇంత అద్భుతంగా ఆడుతున్నా.. తనకు ఇంకా వరల్డ్‌ కప్‌లో దేశానికి ఆడే అర్హత రాలేదంటూ, ఐపీఎల్‌లో ఆట ఏముందిలే ఏదో సరదాగా ఆడేస్తుంటాం అన్నట్లు పేర్కొన్నాడు. కానీ, అదే మన దేశంలో ఐపీఎల్‌లో ఓ రెండు మ్యాచ్‌లు బాగా ఆడితే చాలని, సోషల్‌ మీడియాలో వచ్చే హైప్‌తో వరల్డ్‌ కప్‌ లాంటి మెగా టోర్నీలకు ఎంపిక చేసి చేతులు కాల్చుకుంటూ ఉంటారని, ఆస్ట్రేలియా అన్ని వరల్డ్‌ కప్‌లు గెలిచేందుకు వాళ్ల క్రికెట్‌ బోర్డు తీసుకునే నిర్ణయాలే కారణం అంటూ క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి జేక్‌ ఫ్రేజర్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments