iDreamPost
android-app
ios-app

చిన్న పిల్లోడికి బౌల్డ్ బాడీ లైన్! కసితో రాజస్థాన్ ని చావకొట్టిన జేక్ ఫ్రెసర్!

  • Published May 07, 2024 | 8:21 PM Updated Updated May 07, 2024 | 8:21 PM

ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో జేక్ ఫ్రెసరర్ రాజస్థాన్ బౌలర్స్ కు చుక్కలు చూపించాడు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి రాజస్థాన్ కు సవాల్ విసిరాడు.

ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో జేక్ ఫ్రెసరర్ రాజస్థాన్ బౌలర్స్ కు చుక్కలు చూపించాడు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి రాజస్థాన్ కు సవాల్ విసిరాడు.

  • Published May 07, 2024 | 8:21 PMUpdated May 07, 2024 | 8:21 PM
చిన్న పిల్లోడికి బౌల్డ్ బాడీ లైన్! కసితో రాజస్థాన్ ని చావకొట్టిన జేక్ ఫ్రెసర్!

ఐపీఎల్ లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్యన మ్యాచ్ జరుగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య పోరు సాగుతోంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కు దిగింది. ఢిల్లీ జట్టు నుంచి ఓపెనర్లుగా జేక్ ఫ్రెసర్, అభిషేక్ పోరెల్ రంగంలోకి దిగారు. రాజస్థాన్ జట్టు నుంచి ట్రెంట్ బౌల్ట్ తొలి ఓవర్ వేశాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్ పై బౌల్ట్ తన ప్రతాపం చూపించాడు. బౌల్ట్ వేసిన బాల్ కు జేక్ ఫ్రెసర్ విలవిల్లాడిపోయాడు. బౌల్ట్ వేసిన బాల్ ను క్రీజులో ఉన్న ఫెసర్ అటాక్ చేసేందుకు ప్రయత్నించాడు.

వేగంగా వచ్చిన బంతి అతనికి తగలడంతో స్వల్పగాయాలపాలయ్యాడు. ఇక ఆ తర్వాత వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని ఫ్రెసర్ కి చికిత్స అందించారు. ఆ తర్వాత ఫ్రెసరర్ తన రివేంజ్ ఫోర్ రూపంలో తీర్చుకున్నాడు. తొలి ఓవర్లో బౌల్ట్ వేసిన బంతిని ఫోర్ గా మలిచాడు. ఆ తర్వాత ఫ్రెసరర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ ముచ్చెమటలు పట్టించాడు. 19 బంతుల్లోనే అర్థశతకం బాది రాజస్థాన్ జట్టుకు కొరకరాని కొయ్యగా మారాడు. ఏడు పోర్లు, మూడు సిక్సులతో ఫ్రెసరర్ చెలరేగాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 15 ఓవర్లో ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom