iDreamPost
android-app
ios-app

HCA అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు.. ఒకే ఒక్క ఓటుతో విజయం!

  • Author Soma Sekhar Published - 11:39 AM, Sat - 21 October 23

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితారు విడుదల అయ్యాయి. హోరాహోరిగా సాగిన ఈ ఎన్నికల్లో హెచ్ సీఏ నూతన అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు విజయం సాధించారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితారు విడుదల అయ్యాయి. హోరాహోరిగా సాగిన ఈ ఎన్నికల్లో హెచ్ సీఏ నూతన అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు విజయం సాధించారు.

  • Author Soma Sekhar Published - 11:39 AM, Sat - 21 October 23
HCA అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు.. ఒకే ఒక్క ఓటుతో విజయం!

భారత క్రికెట్ లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) కు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గతకొంత కాలంగా హెచ్ సీఏ తరచుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ టైమ్ లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు వచ్చాయి. దీంతో అందరూ ఈ ఎన్నికలపై ఆసక్తిని కనబర్చారు. తాజాగా ఈ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటుతో నూతన అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు విజయం సాధించాడు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితారు విడుదల అయ్యాయి. హోరాహోరిగా సాగిన ఈ ఎన్నికల్లో హెచ్ సీఏ నూతన అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు విజయం సాధించారు. ఆయన కేవలం ఒకే ఒక్క ఓటుతో గెలుపొందారు. అయితే ప్రత్యర్థి ప్యానల్ కు చెందిన అమర్ నాథ్ రీ కౌంటింగ్ చేపట్టాలని కోరారు. ఇదిలా ఉండగా.. క్రికెట్ ఫస్ట్ ప్యానల్ కు చెందిన సునీల్ అగర్వాల్ కౌన్సిలర్ గా విజయం సాధించారు. ఇక ఈ ప్యానల్ కు శివలాల్ యాదవ్, అర్షద్ ఆయూబ్ మద్దతిచ్చారు.

కాగా.. ఈ ఎన్నికల్లో మెుత్తం 173 మంది ఓటర్లకుగాను 169 మంది పోలింగ్ లో పాల్గొన్నారు. తొలిసారి బలమైన వర్గం అయిన శివలాల్, అర్షద్ లు నిలబెట్టిన వ్యక్తిని కాదని ఓటర్లు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. జగన్మోహన్, అమర్ నాథ్ మధ్య విజయం దోబూచులాడుతూ వచ్చింది. చివరికి 63 ఓట్లు సాధించి జగన్మోహన్ రావు విజయ కేతనం ఎగురవేశాడు. ఇక హెచ్ సీఏ అధ్యక్షుడిగా విజయం సాధించిన జగన్మోహన్ రావుకు తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, నటుడు సోనూసూద్ తో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap