Rohit Sharma: ఆ విషయాలు ఆలోచించకుండా.. టీమ్‌ మార్చాలి అనుకున్నాను: రోహిత్‌

Rohit Sharma, Team India, CEAT Awards: టీమ్‌ను మార్చాలని తాను కల కన్నట్లు.. భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Rohit Sharma, Team India, CEAT Awards: టీమ్‌ను మార్చాలని తాను కల కన్నట్లు.. భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీమిండియా వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను సియట్‌ ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు వరించిన విషయం తెలిసిందే. బుధవారం ప్రకటించిన ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో రోహిత్‌ శర్మ పాల్గొని మాట్లాడాడు. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలు కూడా వెల్లడించాడు. టీ20 వరల్డ్ కప్‌ 2024 విజయం, అందుకు కారణమైన వ్యక్తులతో పాటు మరిన్న విషయాలు తెలిపాడు. ఈ క్రమంలోనే టీమిండియాను తాను మార్చాలని కలగన్నట్లు పేర్కొన్నాడు. స్టాట్స్‌తో సంబంధం లేకుండా టీమ్‌ విజయం కోసమే ఆడే విధంగా.. టీమ్‌ను ట్రాన్స్‌ఫామ్‌ చేయాలని కల కన్నట్లు రోహిత్‌ వెల్లడించాడు.

కెప్టెన్‌ అయినప్పటి నుంచి రోహిత్‌ శర్మ ఇదే మాట​ చెబుతున్నాడు. వ్యక్తిగత రికార్డులు కాదు.. టీమ్‌ గెలిచిందా లేదా అన్నదే చూడాలని అంటున్నాడు. తాను కూడా అదే విధంగా ఆడుతున్నాడు. 49 పరుగుల వద్ద ఉన్నా.. 99 పరుగుల వద్ద ఉన్నా.. సెంచరీ కోసం సింగిల్‌ తీయకుండా.. మంచి బాల్‌ పడితే అగ్రెసివ్‌ షాటే ఆడాడు. ఓపెనర్‌గా వచ్చే రోహిత్‌ శర్మ.. పవర్‌ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడానికి హాఫ్‌ సెంచరీ, సెంచరీ వంటి మైల్‌ స్టోన్స్‌ను చూసుకోకుండా.. అగ్రెసివ్‌గానే బ్యాటింగ్‌ చేశాడు. అందులో కొన్ని సార్లు అవుట్‌ అయ్యేవాడు. అయినా కూడా అతను ఆ ఇంటెంట్‌ను వదిలిపెట్టలేదు.

అతనిలానే జట్టులోని ప్రతి ఆటగాడు టీమ్‌ విజయం కోసమే ఆడాలని, వ్యక్తి రికార్డులును పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఒక వేళ టీమ్‌ కోసం అగ్రెసివ్‌గా ఆడుతూ.. వరుసగా చాలా మ్యాచ్‌లలో విఫలమైనా.. పర్వాలేదనే మైండ్‌సెట్‌తో రోహిత్‌ ఉన్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో విరాట్‌ కోహ్లీ.. ఓపెనర్‌గా ఆడుతూ.. అగ్రెసివ్‌ ఇంటెంట్‌ చూపిస్తూ.. చాలా మ్యాచ్‌లు విఫలమైనా.. రోహిత్‌, కోహ్లీని బ్యాక్‌చేస్తూ వచ్చాడు. ఫైనల్‌ కోసం కోహ్లీ రన్స్‌ దాస్తున్నాడంటూ కూడా సపోర్ట్‌ చేశాడు. రోహిత్‌ అన్నట్లే.. కోహ్లీ ఫైనల్‌లో చెలరేగి ఆడాడు. ఇలా టీమ్‌లో ఒక కొత్త ఆలోచన విధానాన్ని తీసుకొచ్చేందుకు రోహిత్‌ శర్మ ఎంతో తపించాడు. అతని కష్టం ఫలితంగానే మనకు టీ20 వరల్డ్‌ కప్‌ వచ్చింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments