క్రికెట్ మైదానాల్లో ఒక్కోసారి చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని సంఘటనలు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని వివాదాలకు దారితీస్తాయి. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా.. ప్రారంభమైన తొలి టెస్ట్ లో విండీస్ తడబడింది. తొలి రోజే, తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్ల ధాటికి కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో వెంటరన్ స్పిన్నర్ అశ్విన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. జడేజా మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ-ఇషాన్ కిషన్ ల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో విండీస్ జట్టు తడబడింది. భారత బౌలర్ల ధాటికి తొలి రోజే కుప్పకూలింది. విండీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జట్టులో అతానజే 47 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో చెలరేగితే.. జడ్డూ భాయ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ దంచి కొట్టింది. టీమిండియా ఓపెనర్లు జైశ్వాల్ (40), కెప్టెన్ రోహిత్ శర్మ (30) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా టీమిండియా 80 పరుగులు చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 70 పరుగులు వెనకబడి ఉంది.
కాగా.. తొలిరోజు మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ సమయంలో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. విరాట్ కోహ్లీని టీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. అశ్విన్ బౌలింగ్ వేస్తున్న సమయంలో.. బాల్ వేసిన తర్వాత ఇషాన్ కిషన్ కోహ్లీని ఉద్దేశించి “Bhai Thoda Sa Sidha Konasi JGH Dhund Li Bhai” అంటూ పేర్కొన్నాడు. కాగా.. ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్ లో రికార్డు అయ్యాయి. ఈ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దాంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. టీమిండియాలో ఇషాన్ కిషన్ చాలా సరదాగా ఉండే ఆటగాడు. ఫన్నీగా.. చలాకీగా ఉంటూ తన తొటి టీమ్మెట్స్ ను ఆటపట్టిస్తుంటాడు. అందులో భాగంగానే విరాట్ కోహ్లీని సరదగా టీజ్ చేశాడు ఇషాన్. మరి విరాట్ కోహ్లీని సరదాగా ఇషాన్ కిషన్ టీజ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ishan Kishan Stump Mic Recording 😂😂😂🤣🤣🤣#indiavswestindies #IshanKishan #YashasviJaiswal #ViratKohli𓃵 #1STTEST pic.twitter.com/XuVZC8sQKK
— THE BSA NEWS (@BsaNewsOfficial) July 12, 2023
ఇదికూడా చదవండి: 5 వికెట్లతో సత్తా చాటిన అశ్విన్! రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు