SNP
Ishan Kishan, Champions Trophy 2025, T20 World Cup 2024: రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడంపై స్పందిస్తూ.. యువ క్రికెటర్ ఇషాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Ishan Kishan, Champions Trophy 2025, T20 World Cup 2024: రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడంపై స్పందిస్తూ.. యువ క్రికెటర్ ఇషాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
అద్భుతమైన టాలెంట్ ఉన్నా.. కాస్త ఓవర్ యాక్షన్‌తో పాటు క్రమశిక్షణ లేక టీమిండియాకు దూరమైన ఆటగాడు ఇషాన్ కిషన్. బీసీసీఐ ఆగ్రహానికి గురి కాకుండా ఉండి ఉంటే.. టీ20 వరల్డ్ కప్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉండే వాడు ఇషాన్. కానీ, అతనికి ఆ అదృష్టం లేదు. ఐపీఎల్ 2024 కంటే ముందు గాయమైందని, రెస్ట్ కావాలంటూ టీమిండియా ఆడే సిరీస్‌లకు దూరంగా ఉండి, పార్టీలకు, టీవీ షోలకు హాజరైన ఇషాన్ కిషన్‌పై బీసీసీఐ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతన్ని తప్పించడమే కాకుండా టీమ్‌లో అతని ప్లేస్‌పై వేటు చేసింది. అయితే.. ఇటీవల టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 గెలవడంతో ఇషాన్ కిషన్ స్పందించాడు.
ఇషాన్ మాట్లాడుతూ.. ‘ఆరంభంలో కొన్ని తప్పులు చేశాం.. మన టైమ్ సరిగా లేదు. మొత్తానికి టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది.. జట్టు నుంచి అంతా ఇదే ఆశిస్తున్నారు. ఇక రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలవాలని మనం కోరుకుందాం’ అంటూ పేర్కొన్నాడు. పాకిస్థాన్ వేదికగా 2025లో ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. తన తప్పులను సరిదిద్దుకుని ఇషాన్ కిషన్.. టీమిండియాకి ఆడాలని ప్రయత్నిస్తున్నాడు. మరి ఛాంపియన్స్ ట్రోఫీ వరకు తిరిగి టీమ్‌లో వస్తాడో లేదో చూడాలి.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. కాస్త ఆలస్యంగా టీమిండియా గురువారం స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్‌తో వచ్చిన రోహిత్ సేనకు ఘన స్వాగతం లభించింది. గురువారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో, ఆ తర్వాత ప్రధాని అధికారిక నివాసంలో, ఆ తర్వాత ముంబై ఎయిర్ పోర్టులో వాటర్ సెల్యూట్, అలాగే మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు విక్టరీ పరేడ్, స్టేడియంలో సన్మానం ఇలా.. అన్ని చోట్ల టీమిండియాకు అద్భుతమైన స్వాగతం లభించింది. మొత్తంగా టీమిండియా కప్పు కొట్టడంపై దేశం అంతా సంతోషంగా ఉంది. ఇదే సంతోషాన్ని ఇషాన్ కిషన్ కూడా వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
VIDEO | “India has won. We should all pray for their win in the upcoming Champions Trophy. We were making some mistakes but the way we played and won, it was expected from the team,” says cricketer Ishan Kishan on India’s T20 World Cup victory. pic.twitter.com/7RD4IWrhJr
— Press Trust of India (@PTI_News) July 4, 2024