iDreamPost
android-app
ios-app

వీడియో: కోహ్లి, రహానేను అవమానించిన ఇషాన్.. ఇవే తగ్గించుకో అంటున్న ఫ్యాన్స్!

  • Author singhj Published - 07:41 PM, Sat - 15 July 23
  • Author singhj Published - 07:41 PM, Sat - 15 July 23
వీడియో: కోహ్లి, రహానేను అవమానించిన ఇషాన్.. ఇవే తగ్గించుకో అంటున్న ఫ్యాన్స్!

ప్రపంచ టెస్టు సిరీస్​ ఫైనల్ తర్వాత ఆడిన తొలి మ్యాచ్​లోనే టీమిండియా ఘన విజయం సాధించింది. వెస్టిండీస్​తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు కరీబియన్ గడ్డపై అడుగుపెట్టింది భారత్. తాజాగా ముగిసిన తొలి టెస్టులో సూపర్బ్ విక్టరీతో ఈ టూర్​ను గ్రాండ్​గా ఆరంభించింది రోహిత్ సేన. విండీస్​తో డొమినికా వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్​ 141 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఈ విక్టరీతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​ (2023-25) సైకిల్​లో భారత్​కు అదిరిపోయే ఆరంభం లభించిందని చెప్పొచ్చు. అటు బ్యాటింగ్​తో పాటు ఇటు బౌలింగ్​లోనూ మన ప్లేయర్లు అదరగొట్టారు. విండీస్​పై మొదటి టెస్టులో సెంచరీతో కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్​ను అందుకోవడం విశేషం.

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తృటిలో శతకాన్ని మిస్సయినా తన క్లాస్​ను నిరూపించుకున్నాడు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అయితే డెబ్యూ మ్యాచ్​లోనే సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్, జైస్వాల్, కోహ్లి బ్యాటింగ్​లో రాణించగా.. బౌలింగ్​ భారాన్ని తన భుజస్కందాలపై మోశాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. మ్యాచ్​లో ఏకంగా 12 వికెట్లు తీసి విండీస్​ను దారుణంగా దెబ్బతీశాడు. అశ్విన్​కు మిగతా బౌలర్లు బాగా సహకరించారు. ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో తొలి టెస్టును మూడ్రోజుల్లోనే ముగించింది టీమిండియా. యంగ్​స్టర్ జైస్వాల్ సెంచరీ మ్యాచ్​కు హైలెట్​గా నిలిచింది. అయితే మరో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. విండీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడిన ఈ లెఫ్టాండర్.. ఒక్క రన్ చేసేందుకు 20 బంతులు తీసుకున్నాడు.

బ్యాటింగ్​తో పాటు కీపింగ్​లోనూ ఫెయిలైన ఇషాన్ కిషన్.. విరాట్ కోహ్లి, అజింక్యా రహానె లాంటి సీనియర్లను టీజ్ చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవతున్నాడు. మొదటిరోజు ఆటలో కోహ్లీకి ఇషాన్ కిషన్ సూచనలు ఇవ్వడం హాట్ టాపిక్​గా మారింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ సందర్భంగా స్లిప్​లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీని కాస్త పక్కకు జరగమని ఇషాన్ సూచించాడు. మూడో రోజు ఆట సందర్భంగా భారత్ విజయానికి చేరువవుతున్న తరుణంలో వైస్ కెప్టెన్ అజింక్యా రహానేను అవమానించినట్లుగా మాట్లాడాడు ఇషాన్. విండీస్ ఆఖరి బ్యాటర్ జోమెల్ వారికన్ 18 బంతుల్లో 18 రన్స్ చేసి అశ్విన్ బౌలింగ్​లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

వారికన్ ఇన్నింగ్స్​ను రహానె గేమ్​తో పోల్చాడు ఇషాన్. ఇతడు నీ కంటే ఎక్కువ బంతులు ఆడాడు అజ్జూ భయ్యా అంటూ రహానేను టీజ్ చేశాడు. దీంతో సీరియస్ లుక్ ఇచ్చిన రహానె.. ‘ఏంటి? ఏమంటున్నావ్’ అని బదులిచ్చాడు. కోహ్లీతో పాట రహానేను కించపరిచిన ఇషాన్ కిషన్​పై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ‘ఇషాన్.. అంతొద్దు, కాస్త తగ్గు. ఇలాంటి పిచ్చిపనులు మానేసి గేమ్​పై ఫోకస్ చెయ్’ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆట తక్కువ, ఓవరాక్షన్ ఎక్కువ.. సీనియర్లతో ఇలాగేనా ప్రవర్తించేది అని నెటిజన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. ఇషాన్ కిషన్ ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet