iDreamPost
android-app
ios-app

Ishan Kishan-Smriti Mandhana: KBCలో జంటగా ఇషాన్‌ కిషన్‌, స్మృతి మంధాన! ఏంటి సంగతి?

  • Published Dec 27, 2023 | 3:36 PM Updated Updated Dec 27, 2023 | 3:36 PM

టీమిండియా స్టార్ క్రికెటర్లు అయిన ఇషాన్ కిషన్, స్మృతి మంథాన కలిసి 'కౌన్ బనేగా కరోడ్ పతి' స్పెషల్ ఎపిసోడ్ కు వెళ్లారు. వీరిద్దరు క్రికెట్ పై అదికూడా సచిన్ పై వచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక గేమ్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు.

టీమిండియా స్టార్ క్రికెటర్లు అయిన ఇషాన్ కిషన్, స్మృతి మంథాన కలిసి 'కౌన్ బనేగా కరోడ్ పతి' స్పెషల్ ఎపిసోడ్ కు వెళ్లారు. వీరిద్దరు క్రికెట్ పై అదికూడా సచిన్ పై వచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక గేమ్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు.

  • Published Dec 27, 2023 | 3:36 PMUpdated Dec 27, 2023 | 3:36 PM
Ishan Kishan-Smriti Mandhana: KBCలో జంటగా ఇషాన్‌ కిషన్‌, స్మృతి మంధాన! ఏంటి సంగతి?

సాధారణంగా పలువురు సెలబ్రిటీలు పండగల నేపథ్యంలో వివిధ రియాలిటీ షోల్లో మెరుస్తూ ఉంటారు. తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్లు అయిన ఇషాన్ కిషన్, స్మృతి మంథాన కలిసి ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ స్పెషల్ ఎపిసోడ్ కు వెళ్లారు. క్రిస్మస్ పండగ సందర్భాగా వీరిద్దరు ఈ షోకు వెళ్లారు. ఇక ఈ షోకు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. వీరిద్దరు క్రికెట్ పై అదికూడా సచిన్ పై వచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక గేమ్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. మరి వారు గెలుచుకున్న అమౌంట్ ఎంత? ఏ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పలేకపోయారు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టీమిండియా స్టార్ క్రికెటర్లు ఇషాన్ కిషన్, స్మృతి మంథన కలిసి ప్రముఖ రియాలిటీ షో అయిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో పాల్గొన్నారు. వీరిద్దరు అమితాబ్ బచ్చన్ తో కలిసి ప్రేక్షకులను అలరించారు. ఇక ఇషాన్-స్మృతిల జోడీ ఈ గేమ్ షోలో రూ.12.5 లక్షలు గెలుచుకున్నారు. రూ.25 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయి.. గేమ్ నుంచి క్విట్ అయ్యారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? క్రికెట్ పై అదికూడా సచిన్ పై అడిగిన ప్రశ్నకు వీరిద్దరు ఆన్సర్ చెప్పలేకపోయి గేమ్ నుంచి బయటకు వచ్చారు.

ఇంతకీ బిగ్ బి అడిగిన ఆ ప్రశ్న ఏంటంటే? సచిన్ టెండుల్కర్ తన తొలి ఇంటర్నేషన్ సెంచరీ చేసిన మ్యాచ్ లో డెబ్యూ చేసిన భారత క్రికెటర్ ఎవరు? దీనికి రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, సౌరవ్ గంగూలీ, జవగళ్ శ్రీనాథ్ ఆఫ్షన్స్ గా ఇచ్చారు. అయితే లైఫ్ లైన్స్ యూస్ చేసుకున్నా గానీ సరైన ఆన్సర్ చెప్పలేకపోయింది ఈ జోడీ. తొలి లైఫ్ లైన్ లో రాంగ్ ఆన్సర్ చెప్పింది. అయితే సెకండ్ అటెప్ట్ లో అనిల్ కుంబ్లే అని కరెక్ట్ సమాధానం ఇచ్చారు. సచిన్ టెండుల్కర్ 1990లో ఇంగ్లాండ్ పై మాంచెస్టర్ వేదికగా జరిగిన టెస్ట్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో 119* పరుగులు చేశాడు. ఇదే మ్యాచ్ లో అనిల్ కుంబ్లే డెబ్యూ చేశాడు. ఇదిలా ఉండగా.. ఇషాన్ కిషన్ సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు ఎంపికైనప్పటికీ.. మెంటల్ కండిషన్ తో అతడే కావాలని విశ్రాంతి తీసుకున్నాడు. అయితే వీరిద్దరు కలిసి షోలో పాల్గొనడంలో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఏంటి సంగతి అంటూ ఆరా తీస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio