Irfan Pathan On Disapproval Of Hardik Pandya: హార్దిక్ పాండ్యాను అందుకే తిట్టా.. అది అతడి తప్పే: ఇర్ఫాన్ పఠాన్

Hardik Pandya: హార్దిక్ పాండ్యాను అందుకే తిట్టా.. అది అతడి తప్పే: ఇర్ఫాన్ పఠాన్

Team India: టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు నయా హీరోగా అవతరించాడు. వరల్డ్ కప్ ఫైనల్​తో అతడి క్రేజ్ నెక్స్ట్ లెవల్​కు చేరుకుంది.

Team India: టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు నయా హీరోగా అవతరించాడు. వరల్డ్ కప్ ఫైనల్​తో అతడి క్రేజ్ నెక్స్ట్ లెవల్​కు చేరుకుంది.

13 ఏళ్ల నుంచి అందని ద్రాక్షగా ఉన్న టీ20 వరల్డ్ కప్​ను భారత్ గెలుచుకోవడంతో కోట్లాది మంది అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ప్రపంచ కప్ ఫైనల్ ముగిసి పది రోజులు కావొస్తున్నా సంబురాలు ఇంకా కొనసాగుతున్నాయి. రోహిత్ సేన సాధించిన విజయాన్ని ఫ్యాన్స్ ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈ కప్పు అంత ఈజీగా రాలేదు. టీమిండియాలోని అందరు ప్లేయర్లు కలసికట్టుగా రాణిస్తేనే ఇది సాధ్యమైంది. ఈ విక్టరీకి ఎక్కువ క్రెడిట్ స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఇవ్వాల్సిందే. అతడు బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ అద్భుతంగా రాణించాడు. 144 పరుగులు చేసిన పాండ్యా.. 11 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ ఫైట్​లో కీలక సమయంలో క్లాసెన్, మిల్లర్​ను ఔట్ చేసి భారత్​ వైపు మ్యాచ్​ను తిప్పాడు.

ఫైనల్ మ్యాచ్​తో హీరోగా అవతరించాడు హార్దిక్ పాండ్యా. ఇప్పుడు అతడ్ని అభిమానించని క్రికెట్ లవర్ లేడంటే అతిశయోక్తి కాదు. మెగాటోర్నీలో అతడు ఆడిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. అయితే ఇదే హార్దిక్​ను కొన్ని నెలల కింద అంతా విలన్​గా చూశారు. ఐపీఎల్-2024 టైమ్​లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదం, బ్యాటర్​గా, బౌలర్​గా ఫెయిలవడంతో హార్దిక్​ను విమర్శలు చుట్టుముట్టాయి. ఇర్ఫాన్ పఠాన్ సహా పలువురు మాజీలు అతడ్ని తిట్టిపోశారు. పాండ్యాకు ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వడం అక్కర్లేదని.. ఐపీఎల్ పెర్ఫార్మెన్స్​కే ఇంత బిల్డప్ ఇస్తే ఎలా అని అన్నారు. అయితే ఈ ట్రోలింగ్​కు వరల్డ్ కప్ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చాడు హార్దిక్. అందుకే ఈ విషయంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తాజాగా రియాక్ట్ అయ్యాడు.

వరల్డ్ కప్​లో హార్దిక్ ఆడిన తీరు సూపర్బ్ అంటూ మెచ్చుకున్నాడు పఠాన్. అతడి జర్నీ చాలా స్పెషల్ అని.. అన్ని విమర్శలు ఎదుర్కొని ఇంత బాగా కమ్​బ్యాక్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదన్నాడు. హార్దిక్​ను తాను కూడా తిట్టానని.. కానీ అందుకు అతడే కారణమన్నాడు ఇర్ఫాన్. ఐపీఎల్ సమయంలో పాండ్యా సరిగ్గా ఆడలేదని, అతడు చాలా తప్పులు చేశాడని.. అందుకే విమర్శలు చేశానని పఠాన్ స్పష్టం చేశాడు. రోహిత్ శర్మ, జస్​ప్రీత్ బుమ్రా స్థాయిలో హార్దిక్ పెర్ఫార్మ్ చేసి వరల్డ్ కప్​ను టీమిండియా గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడని మెచ్చుకున్నాడు. రోహిత్, బుమ్రా, హార్దిక్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉండటం వల్లే భారత్ చాలా స్పెషల్ టీమ్​గా తయారైందన్నాడు. పాండ్యాను చూస్తుంటే 2007 టీ20 వరల్డ్ కప్​కు ముందు తన పరిస్థితి ఎలా ఉండేదో అది గుర్తుకొస్తుందన్నాడు పఠాన్. ఆ టోర్నీకి ముందు తనను జట్టులో నుంచి తీసేశారని.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాక టీమ్​లోకి వచ్చి సక్సెస్ అయ్యానని పేర్కొన్నాడు. మరి.. పాండ్యా-పఠాన్ ఉదంతంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments