Nidhan
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సంచలన మార్పులకు భారత క్రికెట్ బోర్డు సిద్ధమైందని తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లూ లేనిది అనూహ్యంగా మార్పులు జరగడానికి ఫుల్ క్రెడిట్ సన్‌రైజర్స్ కో-ఓనర్ కావ్యా మారన్కే ఇవ్వాలని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సంచలన మార్పులకు భారత క్రికెట్ బోర్డు సిద్ధమైందని తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లూ లేనిది అనూహ్యంగా మార్పులు జరగడానికి ఫుల్ క్రెడిట్ సన్‌రైజర్స్ కో-ఓనర్ కావ్యా మారన్కే ఇవ్వాలని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
Nidhan
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సంచలన మార్పులకు భారత క్రికెట్ బోర్డు సిద్ధమైందని తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లూ లేనిది అనూహ్యంగా మార్పులు జరగడానికి ఫుల్ క్రెడిట్ సన్‌రైజర్స్ కో-ఓనర్ కావ్యా మారన్కే ఇవ్వాలని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ ఏడాది ఆఖర్లో మెగా ఆక్షన్ నిర్వహించనున్న నేపథ్యంలో రీసెంట్గా అన్ని ఫ్రాంచైజీల ఓనర్స్‌తో బీసీసీఐ సమావేశమైన సంగతి తెలిసిందే. ఇందులో శాలరీ పర్స్, ప్లేయర్ల రిటెన్షన్, ఆర్టీఎంతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లాంటి వాటిపై సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిసింది. అయితే ఈ పాయింట్లతో పాటు సన్‌రైజర్స్ కో-ఓనర్ కావ్యా మారన్ లేవనెత్తిన ఫారెన్ ప్లేయర్ల బ్యాన్ మీద కూడా వాడివేడిగా డిస్కషన్స్ నడిచాయని సమాచారం.
ఆక్షన్‌లో టీమ్స్‌కు ఎంపికైన తర్వాత కావాలని గాయం సాకు చూపి లీగ్‌లో ఆడకుండా తప్పించుకునే విదేశీ ఆటగాళ్ల మీద నిషేధం విధించాలని కావ్యా మారన్ పట్టుబట్టారట. వేలంలో తక్కువ ధర వచ్చిందనే కోపంతో కొందరు ఆటగాళ్లు ఇంజ్యురీ కాకపోయినా అయ్యిందనే సాకుతో ఐపీఎల్‌కు అందుబాటులో లేకుండా పోతున్నారు. ఇంకొందరు ఆడటం ఇష్టం లేక ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ లేదా ఫ్యామిలీ అర్జెన్సీని సాకుగా చూపి జట్లను మధ్యలోనే వదిలేసి వెళ్తున్నారు. దీని వల్ల టీమ్స్ మీద తీవ్ర ప్రభావం పడుతోందని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లారట కావ్యా మారన్. అలా వెళ్లిపోయే ఆటగాళ్లను రీప్లేస్మెంట్ చేయలేక తాము తంటాలు పడుతున్నామని.. ఇలాంటి ప్లేయర్లపై నిషేధం విధించాలని ఆమె డిమాండ్ చేశారని సమాచారం. కావ్య డిమాండ్లకు బోర్డు దిగొచ్చిందట. ఇక మీదట ఆక్షన్‌లో ఎంపికైన ఆటగాళ్లు.. టీమ్‌ను వదిలేసి వెళ్లిపోతే రెండేళ్లు బ్యాన్ విధించాలని బీసీసీఐ డిసైడ్ అయిందని వినికిడి.
ఆక్షన్‌లో అమ్ముడుబోయిన ఆటగాళ్లు ఇక మీదట తప్పనిసరిగా ఆయా టీమ్స్‌లో ఆడేలా బీసీసీఐ నడుం బిగించిందని సమాచారం. ఇలా ఫ్రాంచైజీలను ఇబ్బంది పెట్టే ఆటగాళ్ల మీద 2 ఏళ్ల పాటు బ్యాన్ వేయాలని డిసైడ్ అయిందట. అయితే నిజంగానే ప్లేయర్లకు ఇంజ్యురీ అయినా లేదా ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉన్నా, ఇంటర్నేషనల్ సిరీస్‌లు ఆడాలని వాళ్ల బోర్డుల నుంచి పిలుపు వచ్చినా తామే పంపిస్తామని.. కానీ ఏ కారణం లేకపోయినా డుమ్మా కొట్టాలని చూస్తే వేటు వేయాల్సిందేనని బోర్డు నిర్ణయించిందట. ఈ సమస్యని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లడమే గాక ధైర్యంగా పోరాడినందుకు ఎస్ఆర్హెచ్ కో-ఓనర్ కావ్యా మారన్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. అసలు క్రెడిట్ ఆమెకే ఇవ్వాలని.. ఎలాంటి భయం లేకుండా బోర్డుతో ఆమె ఫైట్ చేశారని అంటున్నారు ఎక్స్పర్ట్స్. అయితే ఫారెన్ ప్లేయర్ల బ్యాన్పై బీసీసీఐ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఏదీ చెప్పలేం. మరి.. ఏదో ఒక సాకుతో టీమ్స్‌ను వదిలి వెళ్లే ఆటగాళ్లపై బ్యాన్ విధించాలనే నిర్ణయం మంచిదేనా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
IPL TEAMS WANT BAN ON FOREIGN PLAYERS IF WITHDRAW. 😲
IPL franchises have asked for a 2 year ban on foreign players who pull out of the season after getting picked in the auction. (Espncricinfo). pic.twitter.com/ZwFyszyM5S
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 2, 2024