iDreamPost
android-app
ios-app

Virat Kohli: పంజాబ్ పై విజయం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ క్యూట్ వీడియో!

  • Published Mar 26, 2024 | 3:04 PM Updated Updated Mar 26, 2024 | 3:04 PM

పంజాబ్ పై విజయం సాధించి.. ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్న తర్వాత కింగ్ కోహ్లీ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ విరాట్ చేసిన పనేంటి?

పంజాబ్ పై విజయం సాధించి.. ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్న తర్వాత కింగ్ కోహ్లీ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ విరాట్ చేసిన పనేంటి?

  • Published Mar 26, 2024 | 3:04 PMUpdated Mar 26, 2024 | 3:04 PM
Virat Kohli: పంజాబ్ పై విజయం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ క్యూట్ వీడియో!

ఐపీఎల్ 2024 సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. సీజన్ ప్రారంభ మ్యాచ్ లో చెన్నై చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిచవిచూసింది. అయితే తర్వాతి మ్యాచ్ లో గొప్పగా పుంజుకుని పంజాబ్ కింగ్స్ ను 4 వికెట్ల తేడాతో చిత్తుచేసింది ఆర్సీబీ. ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ సూపర్ నాక్ ఆడాడు. రెచ్చిపోయి ఆడిన విరాట్ తన టీమ్ కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్న తర్వాత కోహ్లీ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆర్సీబీ-పంజాబ్ మధ్య జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో అద్భుతమైన విజయం సాధించింది కోహ్లీ టీమ్. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన ఈ పోరులో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయఢంకా మోగించింది. తద్వారా టోర్నీలో ఫస్ట్ విజయాన్ని నమోదుచేసుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. జట్టులో కెప్టెన్ ధావన్ ఒక్కడే 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం 177 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ టీమ్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సూపర్బ్ నాక్ తో అదరగొట్టాడు. అద్భుతమైన ఆటతీరుతో జట్టుకు విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్ లో కోహ్లీ 49 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 2 సిక్సులతో 77 పరుగులు చేశాడు. దీంతో కోహ్లీకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డును అందుకున్న తర్వాత కోహ్లీ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అవార్డు అందుకున్న అనంతరం విరాట్ తన ఫ్యామిలీకి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. తన పిల్లలపై ముద్దుల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే విరాట్ తన పళ్లను చూపిస్తూ.. నేను బ్రష్ చేశాను, నువ్వు చేశావా? చూపించు అని తన కుమార్తెను అడిగాడు. ఈ క్యూట్ వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. కాగా.. ఇటీవలే రెండోసారి తండ్రైన విరాట్ తన ఫ్యామిలీతో ఎక్కువ రోజులు సంతోషంగా గడిపాడు. ఇక మ్యాచ్ లో విజయం తర్వాత తన ఇద్దరి పిల్లలతో వీడియో కాల్ ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నాడు. మరి ఫ్యామిలీ మెన్ విరాట్ క్యూటెస్ట్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Middle stump Cricket (@middle.stump.cric)

ఇదికూడా చదవండి: ధావన్ అరుదైన ఘనత.. IPL చరిత్రలో ఒకే ఒక్కడిగా సరికొత్త రికార్డు!

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet