iDreamPost
android-app
ios-app

వీడియో: ఒకే ఓవర్​లో 27 రన్స్.. ఆ బౌలర్​ను టార్గెట్ చేసుకొని అభిషేక్ విధ్వంసం!

  • Published Apr 06, 2024 | 10:02 AM Updated Updated Apr 06, 2024 | 10:02 AM

సన్​రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఊచకోత అంటే ఎలా ఉంటుందో చెన్నై బౌలర్లకు చూపించాడు. అతడు ఒకే ఓవర్​లో ఏకంగా 27 రన్స్ బాదాడు.

సన్​రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఊచకోత అంటే ఎలా ఉంటుందో చెన్నై బౌలర్లకు చూపించాడు. అతడు ఒకే ఓవర్​లో ఏకంగా 27 రన్స్ బాదాడు.

  • Published Apr 06, 2024 | 10:02 AMUpdated Apr 06, 2024 | 10:02 AM
వీడియో: ఒకే ఓవర్​లో 27 రన్స్.. ఆ బౌలర్​ను టార్గెట్ చేసుకొని అభిషేక్ విధ్వంసం!

ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడి హైదరాబాద్​కు వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్​కు చుక్కలు చూపించింది సన్​రైజర్స్. భారీ బ్యాటింగ్ లైనప్ కలిగిన సీఎస్​కేను 165 పరుగులకే కట్టడి చేశారు ఎస్​ఆర్​హెచ్ బౌలర్లు. శివమ్ దూబె (24 బంతుల్లో 42) తప్పితే మిగిలిన వాళ్లు సన్​రైజర్స్ బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. స్లో పిచ్​పై పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్​లో వేరియేషన్స్​తో బంతులు వేస్తూ చెన్నై బ్యాటర్లను కట్టిపడేశారు. ఆ తర్వాత ఛేజింగ్​లో విధ్వంసం అంటే ఎలా ఉంటుందో సీఎస్​కేకు చూపించాడు అభిషేక్ శర్మ. స్లో పిచ్ అంటూ పరుగులు తీసేందుకు ప్రత్యర్థి జట్టు ఇబ్బంది పడిన చోట ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు అభిషేక్. 12 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. ఒక బౌలర్​ను టార్గెట్ చేసుకొని ఊచకోత కోశాడీ ఓపెనర్.

మొదటి బాల్ నుంచే హిట్టింగ్ స్టార్ట్ చేసిన అభిషేక్.. సీఎస్​కే లెఫ్టార్మ్ పేసర్ ముకేశ్ చౌదరీని లక్ష్యంగా చేసుకొని మరింత చెలరేగిపోయాడు. అతడు వేసిన ఓవర్​లో ఏకంగా 27 పరుగులు పిండుకున్నాడు. ముకేశ్ ఓవర్​లో తొలి బంతిని బౌండరీకి పంపాడు ఎస్ఆర్​హెచ్ ఓపెనర్. ఆ తర్వాతి బంతిని డిఫెన్స్ చేసిన అభిషేక్.. నెక్స్ట్ బాల్ సిక్స్ కొట్టాడు. నాలుగో బంతి డాట్ అయింది. ఐదో బంతి నో బాల్ కాగా దాన్ని స్టాండ్స్​లోకి పంపాడు. ఆ తర్వాత ఫ్రీ హిట్​ బాల్​ను కూడా సిక్స్ బాదేశాడు. ఆఖరి బంతికి ఫోర్ కొట్టి ఓవర్​ను గ్రాండ్​గా ముగించాడు. అభిషేక్ దెబ్బకు ముకేశ్ మళ్లీ బౌలింగ్​కు రాలేదు. అతడి ఊచకోత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ అభిషేక్ బ్యాటింగ్​, సిక్స్ హిట్టింగ్ ఎబిలిటీ, టెక్నిక్​ను మెచ్చుకుంటున్నారు.

Abhishek sharma Hitting

ఇక, నిన్నటి మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్​కే 20 ఓవర్లకు 165 పరుగులు చేసింది. ఈ టార్గెట్​ను మరో 11 బంతులు ఉండగానే ఎస్ఆర్​హెచ్​ ఛేదించింది. అభిషేక్​తో పాటు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (24 బంతుల్లో 31), ఎయిడెన్ మార్క్రమ్ (36 బంతుల్లో 50) రాణించారు. ఆఖర్లో షాబాజ్ అహ్మద్ (18), నితీష్ కుమార్ రెడ్డి (14) కూడా ఆకట్టుకున్నారు. వైజాగ్ కుర్రాడు నితీష్‌ రెడ్డి సిక్స్ కొట్టి మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్​లో విజయానికి సన్​రైజర్స్ బౌలర్లతో పాటు బ్యాటర్లు రాణించడమే కారణమని చెప్పాలి. అయితే ఎక్కువ క్రెడిట్ మాత్రం బౌలర్లకు ఇవ్వాలి. స్ట్రాంగ్ బ్యాటింగ్ యూనిట్ కలిగిన సీఎస్​కేను వాళ్లు నిలువరించిన తీరు అద్భుతం. ఆ తర్వాత మెచ్చుకోవాల్సింది హెడ్-అభిషేక్​నే. వీళ్లిద్దరూ కలసి ఫస్ట్ వికెట్​కు 2.4 ఓవర్లలో 46 పరుగులు జోడించారు. మరి.. అభిషేక్ శర్మ బ్యాటింగ్ విధ్వంసం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbenjaminsbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş