MS Dhoni: RCB విషయంలో ధోని తప్పు చేయలేదు! ప్రూఫ్ గా షాకింగ్ వీడియో రిలీజ్!

RCB విషయంలో మహేంద్రసింగ్ ధోని ఎలాంటి తప్పు చేయలేదని ఓ షాకింగ్ వీడియోను ప్రూఫ్ గా రిలీజ్ చేశాడు ఓ అభిమాని. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

RCB విషయంలో మహేంద్రసింగ్ ధోని ఎలాంటి తప్పు చేయలేదని ఓ షాకింగ్ వీడియోను ప్రూఫ్ గా రిలీజ్ చేశాడు ఓ అభిమాని. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024లో భాగంగా ఇటీవల ఆర్సీబీ వర్సెస్ చెన్నై మధ్య కీలకమైన మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో చెన్నైని ఓడించి బెంగళూరు టీమ్ ప్లే ఆఫ్స్ కు చేరిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ బిగ్ కాంట్రవర్సీకి దారితీసింది. మ్యాచ్ అనంతరం ప్రత్యర్థి ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే ధోని గ్రౌండ్ ను వీడాడు అంటూ ధోనిపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ధోని ఆర్సీబీ ఆటగాళ్ల కోసం వేచి ఉన్నాడు.. కానీ వారు రాకపోవడంతోనే ధోని గ్రౌండ్ ను వీడి వెళ్లాడు అంటూ వీడియో ప్రూఫ్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోని తప్పు చేయలేదంటూ ఓ షాకింగ్ వీడియోను రిలీజ్ చేశాడు ఓ అభిమాని.

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో మహేంద్రసింగ్ ధోని ఆర్సీబీ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానించాడని పెద్ద వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంలో కొందరు ధోనిదే తప్పు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు ధోని ఎంత వేచి చూసినా.. గెలుపు సంబరాల్లో ఉన్న ఆర్సీబీ ఆటగాళ్లు రాకపోవడంతోనే గ్రౌండ్ నుంచి వెనుదిరిగాడని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని ధోని వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిపే ఓ షాకింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ఏముందంటే?

అది 2023 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. గుజరాత్ ను ఓడించి టైటిల్ ఐదవసారి ఐపీఎల్ టైటిల్ ను ఎగరేసుకుపోయింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో విన్నింగ్ మూమెంట్ వీడియోనే ఆ వ్యక్తి షేర్ చేసింది. టైటిల్ సాధించిన తర్వాత చెన్నై ప్లేయర్లు అందరూ ధోని చుట్టు ముట్టి గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ధోని మాత్రం ముందు గుజరాత్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్స్ ఇవ్వాలి పదండి అంటూ ఆటగాళ్లను తీసుకెళ్లాడు. ధోని తప్పు చేశాడు అంటున్న వారికి కౌంటర్ గా ఈ వీడియోను షేర్ చేశాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో.. ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ధోనిది తప్పు అని ఎలా అంటారు.  అంటూ రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు. నిజానికి ధోని గ్రౌండ్ వేచి చూశాడు. కానీ విజయోత్సవంలో ఉన్న ఆర్సీబీ ఆటగాళ్లు ఎంతకీ రాకపోవడంతో.. ధోని వెనుదిరగాల్సి వచ్చింది. మరి ఈ వీడియో చూశాక.. ఈ వివాదంలో తప్పు ఎవరిదో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments