Ravindra Jadeja: ధోని క్రేజీ రికార్డ్ బద్దలు కొట్టిన జడేజా.. ఇది రేర్ ఫీట్!

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఈ క్రమంలో ధోని పేరిట ఉన్న ఓ క్రేజీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు జడ్డూ. మరి ఆ రికార్డ్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఈ క్రమంలో ధోని పేరిట ఉన్న ఓ క్రేజీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు జడ్డూ. మరి ఆ రికార్డ్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

వాంఖడే వేదికగా మెున్న జరిగిన మ్యాచ్ లో ఓడిపోయిన చెన్నై.. తాజాగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 28 పరుగుల తేడాతో పంజాబ్ ను చిత్తుచేసింది. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెన్నైకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాడు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ఈ క్రమంలోనే ధోని ఆల్ టైమ్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. మరి ఆ రికార్డ్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

పంజాబ్ తో ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. జట్టులో రవీంద్ర జడేజా 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేయగా.. డార్లీ మిచెల్ 30 రన్స్ చేశాడు. అనంతరం 168 పరుగుల ఓ మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. దారుణంగా విఫలం అయ్యింది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంలో.. పరుగులు రావడం కష్టమైపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 రన్స్ కే పరిమితమై 28 రన్స్ తేడాతో పంజాబ్ పరాజయాన్ని మూటగట్టుకుంది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 4 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దాంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును జడ్డు అందుకున్నాడు.

ఈ క్రమంలోనే ఎంఎస్ ధోని ఆల్ టైమ్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు జడేజా. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లు అందుకున్న ఆటగాడిగా జడ్డూ నిలిచాడు. అతడు చెన్నై తరఫున 16 సార్లు ఈ అవార్డు ను అందుకున్నాడు. అంతకు ముందు ధోని 15 సార్లు ఈ ఘనత సాధించాడు. ఇక ఈ లిస్ట్ లో  సురేష్ రైనా(12), రుతురాజ్ గైక్వాడ్(11), మైక్ హస్సీ(10) ఉన్నారు. మరి ధోని క్రేజీ రికార్డ్ జడేజా బద్దలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments