అతడొక క్లాస్ ప్లేయర్! యంగ్ సెన్సేషన్ పై కమ్మిన్స్ ప్రశంసలు!

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో ఉన్న యంగ్ ప్లేయర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్. అయితే అభిషేక్ శర్మను కాదని.. మరొక ప్లేయర్ ని క్లాస్ ఆటగాడు అంటూ పొగిడాడు కమ్మిన్స్. ఆ వివరాల్లోకి వెళితే..

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో ఉన్న యంగ్ ప్లేయర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్. అయితే అభిషేక్ శర్మను కాదని.. మరొక ప్లేయర్ ని క్లాస్ ఆటగాడు అంటూ పొగిడాడు కమ్మిన్స్. ఆ వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 సీజన్ లో దుమ్మురేపే ఆటతీరుతో ప్లే ఆఫ్స్ కు దూసుకొచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. నిన్న తన చివరి లీగ్ మ్యాచ్ లో సైతం అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి.. టాప్ 2కి వచ్చింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ విధించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయం తర్వాత సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తమ జట్టులో ఉన్న యంగ్ ప్లేయర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడొక క్లాస్ ప్లేయర్ అంటూ యంగ్ సెన్సేషన్ పై పొగడ్తల వర్షం కురిపించాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఈ ఐపీఎల్ సీజన్ లో మంచి దూకుడు మీదుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన SRH.. పంజాబ్ పై విజయంతో పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేస్ లోకి దూసుకొచ్చింది. దీంతో మే 21న అహ్మదాబాద్ వేదికగా కేకేఆర్ తో తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉండంగా పంజాబ్ తో విజయం సాధించిన తర్వాత మాట్లాడిన కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. యంగ్ ప్లేయర్లపై ప్రశంసలు కురిపించాడు.

ప్యాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ..” ఈ సీజన్ లో యంగ్ ప్లేయర్లు అద్భుతంగా రాణించారు. ప్రతీ ఒక్కరూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరీ ముఖ్యంగా అభిషేక్ శర్మ. అతడి గురించి ఎంత చెప్పిన తక్కువే. అతడికున్న అద్భుతమైన నైపుణ్యాలతో ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. అభిషేక్ సృష్టించే విధ్వంసానికి ప్రతి ఒక్క బౌలర్ భయపడాల్సిందే. నేను కూడా అతడికి బౌలింగ్ వేయాలనుకోవడం లేదు. ఇక నితీశ్ రెడ్డి ఒక క్లాస్ ప్లేయర్. అతడి అనుభవానికి మించి ఆడుతున్నాడు. మా టాప్ ఆర్డర్ లో నితీశ్ కీలక ఆటగాడు. వీరిద్దరి టీమిండియాలో ఎంతో భవిష్యత్ ఉంది” అంటూ యువ సంచలనాలపై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా.. నాకౌట్ మ్యాచ్ ల్లో కూడా ఇదే తరహా ఆటతీరును ప్రదర్శిస్తామని కమ్మిన్స్ ధీమా వ్యక్తం చేశాడు.

Show comments