MS Dhoni: ధోని క్రేజ్ కు ఫిదా అయిన లక్నో స్టార్ క్రికెటర్ భార్య! పోస్ట్ వైరల్..

మహేంద్రసింగ్ ధోని క్రేజ్ కు షాకైంది లక్నోసూపర్ జెయింట్స్ స్టార్ క్రికెటర్ డికాక్ భార్య సాషా హర్లీ. ఇందుకు సంబంధించిన పోస్ట్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మహేంద్రసింగ్ ధోని క్రేజ్ కు షాకైంది లక్నోసూపర్ జెయింట్స్ స్టార్ క్రికెటర్ డికాక్ భార్య సాషా హర్లీ. ఇందుకు సంబంధించిన పోస్ట్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు ఉన్నప్పటికీ.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి ఉన్న క్రేజే వేరు. ఆ విషయం ఎన్నోసార్లు రుజువైంది. ఈ మిస్టర్ కూల్ బ్యాటర్ భారీ ఇన్నింగ్స్ లు ఆడాల్సిన అవసరం లేదు. అలా సింహంలా గ్రౌండ్ లోకి అడుగుపెడితే.. ఫ్యాన్స్ కు పండగే. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ఇదే పండగను ఎంజాయ్ చేస్తున్నారు ధోని ఫ్యాన్స్. క్రీజ్ లో ఉన్నంతసేపు భారీ సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు మహేంద్రుడు. ఇక తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో ధోని క్రేజ్ కు ఫిదా అయ్యింది లక్నో స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ భార్య సాషా హర్లీ.

మహేంద్రసింగ్ ధోని.. ఈ ఐపీఎల్ సీజన్ లో అభిమానులను అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు. తక్కువ బంతులే ఎదుర్కొంటున్నప్పటికీ.. వీరబాదుడు బాదుతూ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిస్తున్నాడు. ఇక ధోని ఎప్పుడు క్రీజ్ లోకి వచ్చినా ఏదో ఒక రికార్డ్ బద్దలు అవుతూనే ఉంటుంది, అలాంటి క్రేజ్ ధోని సొంతం. ఇక ఈ జార్ఖండ్ డైనమెట్ క్రేజ్ చూసి ఫిదా అయిపోయింది లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ భార్య సాషా హర్లీ. ఈ రేంజ్ క్రేజ్ ఏంటి? అంటూ సోషల్ మీడియాలో తాను ఎక్స్ పీరియన్స్ చేసిన సంఘటనను పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో ఏముందంటే?

“లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోని బ్యాటింగ్ కు వస్తున్నప్పుడు నా స్మార్ట్ వాచ్ లో నమోదైన దృశ్యమిది. అతడి రాకతో గ్రౌండ్ లో నినాదాలు హోరెత్తాయి. అప్పుడు ఆ సౌండ్స్ 95 డెసిబల్స్ కు చేరుకున్నాయి. ఇలాగే ఓ పది నిమిషాలు కొనసాగితే.. తాత్కాలికంగా వినికిడి కోల్పోతాం” అని తన స్మార్ట్ ఫోన్ లో చూపించిన దానిని షేర్ చేసింది డికాక్ భార్య సాషా. ఇదిలా ఉంటే.. ఒక్కోసారి ధోని గ్రౌండ్ లోకి వస్తుంటే సౌండ్ డెసిబల్స్ 130 దాటిని సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ లో కేవలం 9 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సులతో 28 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరి ధోని క్రేజ్ కు డికాక్ భార్య ఫిదా కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments