iDreamPost
android-app
ios-app

DC vs MI: ఢిల్లీకి భారీ షాక్.. స్టార్ ప్లేయర్ కు గాయం! సంతోషం అంటున్న ఫ్యాన్స్, కారణం?

  • Published Apr 06, 2024 | 6:21 PM Updated Updated Apr 06, 2024 | 6:21 PM

ముంబైతో మ్యాచ్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరం కానున్నాడు. కానీ ఢిల్లీ ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే?

ముంబైతో మ్యాచ్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరం కానున్నాడు. కానీ ఢిల్లీ ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే?

DC vs MI: ఢిల్లీకి భారీ షాక్.. స్టార్ ప్లేయర్ కు గాయం! సంతోషం అంటున్న ఫ్యాన్స్, కారణం?

ఢిల్లీ క్యాపిటల్స్.. ఈ ఐపీఎల్ సీజన్ లో దారుణమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో ప్లేస్ లో ఉంది. ఇక తన నెక్ట్స్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను ఢీ కొట్టబోతోంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకమైంది. ఏప్రిల్ 7(ఆదివారం)న వాంఖడే వేదికగా ఈ పోరు జరగనుంది. ఇలాంటి టైమ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ కు గాయమైంది. దీంతో మ్యాచ్ కు దూరం కానున్నాడు. అయితే ఢిల్లీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో హ్యాపీ అంటున్నారు. దానికి కారణం ఏంటో చూద్దాం పదండి మరి.

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య వాంఖడే వేదికగా ఆదివారం(ఏప్రిల్ 7) మ్యాచ్ జరగనుంది. ఈ గేమ్ కు ముందు ఢిల్లీకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా ముంబైతో మ్యాచ్ కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. కానీ మార్ష్ కు ఎలాంటి ఇంజ్యూరీ అయ్యింది? కోలుకోవడానికి ఎంత టైమ్ పడుతుందన్న విషయం మాత్రం వెల్లడించలేదు దాదా. ఇక మార్ష్ గాయం కారణంగా దూరం కావడంతో ఢిల్లీ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. అదేంటి? స్టార్ ప్లేయర్ కు ఇంజ్యూరీ అయితే బాధపడాలి గానీ.. హ్యాపీగా ఉండటం ఏంటని మీకు డౌట్ రావొచ్చు. దానికి ఓ భారీ కారణమే ఉందండోయ్. అదేంటంటే?

ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన మార్ష్ కేవలం 71 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్ లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టి.. దారుణంగా విఫలమైయ్యాడు. దీంతో డీసీ ఫ్యాన్స్ అతడిపై కోపంగా ఉన్నారు. ఇక ఇప్పుడు మార్ష్ గాయంతో జట్టును వీడటంతో.. అతడి ప్లేస్ లో ఆసీస్ విధ్వంసకర ప్లేయర్ జెక్ ప్రేజర్ మెక్ గర్క్ ను టీమ్ లోకి తీసుకోవాలని చూస్తోంది యాజమాన్యం. చిచ్చర పిడుగులా చెలరేగే ప్రేజర్ టీమ్ లోకి వస్తే.. డీసీ రాత మారుతుందేమో అని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే మార్ష్ ఇంజ్యూరికి గురైనా పెద్దగా బాధపడట్లేదు. ఇదిలా ఉండగా.. స్టార్ బౌలర్ కుల్దీప్ యాదవ్ కూడా ఈ మ్యాచ్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయంతో అతడు బాధపడుతున్నాడని సమాచారం. మరి ఢిల్లీ ఫ్యాన్స్ సంతోషపడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş