iDreamPost
android-app
ios-app

IPL 2024: ధోని కారణంగా లవర్ కు బ్రేకప్ చెప్పిన అభిమాని.. వైరలవుతున్న వింత రీజన్!

  • Published Apr 30, 2024 | 12:40 PM Updated Updated Apr 30, 2024 | 12:40 PM

మహేంద్రసింగ్ ధోనిపై ఉన్న ప్రేమ కారణంగా తన లవర్ కు బ్రేకప్ చెప్పాడు ఓ ప్రియుడు. అయితే అతడు తన ప్రేయసితో విడిపోవడానికి చెప్పిన కారణం మాత్రం వింతగా ఉంది. మరి వింత రీజన్ ఏంటో చూద్దాం పదండి.

మహేంద్రసింగ్ ధోనిపై ఉన్న ప్రేమ కారణంగా తన లవర్ కు బ్రేకప్ చెప్పాడు ఓ ప్రియుడు. అయితే అతడు తన ప్రేయసితో విడిపోవడానికి చెప్పిన కారణం మాత్రం వింతగా ఉంది. మరి వింత రీజన్ ఏంటో చూద్దాం పదండి.

  • Published Apr 30, 2024 | 12:40 PMUpdated Apr 30, 2024 | 12:40 PM
IPL 2024: ధోని కారణంగా లవర్ కు బ్రేకప్ చెప్పిన అభిమాని.. వైరలవుతున్న వింత రీజన్!

మహేంద్రసింగ్ ధోని.. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయినా గానీ క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. తగ్గక పోగా.. మరింతగా పెరిగిందనే చెప్పాలి. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్ గా వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు ‘తలా’. ఇక ఐపీఎల్ చరిత్రలో 5 టైటిళ్లను చెన్నై సూపర్ కింగ్స్ కు కట్టబెట్టి.. తిరుగులేని రికార్డ్ ను లిఖించాడు. ఇక తన మాస్టర్ మైండ్ తో ఓడిపోయే మ్యాచ్ లను కూడా ప్రత్యర్థి నుంచి లాగేసుకోవడంలో ధోని దిట్ట. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టే.. ధోని అంటే అభిమానులకు పిచ్చి. ఆ పిచ్చి ప్రేమతోనే తన ప్రేమకు బ్రేక్ చెప్పాడు ఓ లవర్. మరి ధోని కారణంగా తన లవర్ కు ఆ ప్రియుడు ఎందుకు బ్రేకప్ చెప్పాడు? ఆ వింత రీజన్ ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్ 2024లో భాగంగా ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో 78 పరుగుల తేడాతో చెన్నై ఘన విజయం సాధించింది. ఇంత వరకు మనందరికి తెలిసిందే. కానీ ఈ మ్యాచ్ లో మనం గమనించని ఓ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారి.. వైరల్ అవుతోంది. ఓ ప్రియుడు తన లవర్ కు బ్రేకప్ చెప్పడానికి కారణం ధోని అని చెప్పుకొచ్చాడు. అతడు పట్టుకున్న ప్లకార్డ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ప్లకార్డ్ లో ఏముందంటే?

సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ధోని వీరాభిమాని పట్టుకున్న పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ధోనిపై తనకు ఎంత అభిమానుం ఉందో చూపించి.. అందరిని షాక్ కు గురిచేశాడు. అతడు ప్లకార్డ్ లో ఈ విధంగా రాసుకొచ్చాడు..”నా గర్ల్ ఫ్రెండ్ కు నేను బ్రేకప్ చెప్పా.. ఎందుకంటే? ఆమె పేరులో 7 అక్షరాలు లేవు” అన్న పోస్టర్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. ధోని ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కు రాగానే కెమెరామెన్ ఆ ప్లకార్డ్ ను ఫోకస్ చేసి.. బిగ్ స్క్రీన్ పై చూపించాడు. దీంతో ఒక్కసారిగా గ్రౌండ్ మెుత్తం హోరెత్తింది. ఇక ఈ పోస్టర్ వైరల్ కావడంతో.. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పిచ్చి బాగా ముదిరిపోయింది అనుకుంటా, ఇదెక్కడి వింత రీజన్ బ్రో.. ఇంకేం దొరకలేదా? ధోనికి అసలైన ఫ్యాన్ వి నువ్వే బ్రదర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ధోనిపై ప్రేమతో తన ప్రేమనే కాదనుకున్న వీరాభిమానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş