SNP
IPL 2024, CSK vs RCB, Prediction: ఐపీఎల్ 2024 సీజన్ చెన్నై వర్సెస్ బెంగళూరు మ్యాచ్‌తో అట్టహాసంగా ప్రారంభం కానుంది. మరి ఈ తొలి మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుంది? ఎవరి బలం ఎలా ఉంది? బలహీనతలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
IPL 2024, CSK vs RCB, Prediction: ఐపీఎల్ 2024 సీజన్ చెన్నై వర్సెస్ బెంగళూరు మ్యాచ్‌తో అట్టహాసంగా ప్రారంభం కానుంది. మరి ఈ తొలి మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుంది? ఎవరి బలం ఎలా ఉంది? బలహీనతలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
SNP
ఐపీఎల్ 2024 సీజన్‌లో తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ షురూ కానుంది. ఈ సీజన్‌లో చెన్నై జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌ను రుతురాజ్ ఏ మేర సక్సెస్‌ఫుల్‌గా నడిపించగలడో చూడాలి. మరోవైపు డుప్లెసిస్ కెప్టెన్సీలో కోహ్లీ, మ్యాక్స్‌వెల్, సిరాజ్ లాంటి స్టార్లతో కూడిన టీమ్ కూడా సూపర్ స్ట్రాంగ్‌గా ఉంది. మరి ఈ రెండు జట్ల బలాలు, బలహీనతలు ఏంటి? ఎవరికి మ్యాచ్ గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం..
చెన్నై సూపర్ కింగ్స్..
ధోని కెప్టెన్సీగా లేకపోవడం సీఎస్‌కేకు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అయితే కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై పూర్తి భారం మోపకుండా ధోని కూడా సపోర్ట్‌గా సలహాలు అందిస్తే.. సీఎస్‌కేకు ఈజీ అవుతుంది. అయితే.. బ్యాటింగ్‌లో ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వె సీఎస్‌కేకు ప్రధాన బలం అని చెప్పవచ్చు. అలాగే వన్‌డౌన్‌లో రచిన్ రవీంద్ర ఉన్నాడు. అయితే.. రచిన్ ఓపెనర్‌గా కూడా రావొచ్చు. మిడిల్డార్‌లో అజింక్యా రహానె, సమీర్ రిజ్వీ, ధోని ఉండనే ఉన్నారు. జడేజా, శివమ్ దూబేతో ఆల్‌రౌండర్ ద్వయం అద్భుతంగా ఉంది. బౌలింగ్‌లో ముస్తిఫిజుర్ రెహ్మాన్, మహీష్ తీక్షణ, దీపక్ చాహర్‌తో బౌలింగ్ డిపార్ట్‌మెంట్ కూడా స్ట్రాంగ్‌గానే ఉంది. రచిన్ రవీంద్ర, దూబే కూడా బౌలింగ్ చేయగలరు. అయితే.. స్టార్ బౌలర్ మతీష పతిరణ అందుబాటులో లేకపోవడం సీఎస్‌కే గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
ఆర్సీబీ బలం మొత్తం బ్యాటింగ్‌లోనే ఉంది. డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్‌తో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్‌లో సిరాజ్, ఆకాశ్‌దీప్, అల్జారి జోసెఫ్, లూకీ ఫెర్గుసన్‌లతో స్ట్రాంగ్‌గానే ఉంది. అయితే.. ఆర్సీబీలో మ్యాక్స్‌వెల్ మినహా మరో స్ట్రాంగ్ ఆల్‌రౌండర్ లేకపోవడం పెద్ద మైనస్. అయితే.. విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. కానీ, సిరాజ్, పాటిదార్ ఫామ్‌లో లేరు. స్పిన్ ఆల్‌రౌండర్ కరన్ శర్మ ఏ మేర రాణిస్తాడో చూడాలి. కామెరున్ గ్రీన్ కాస్త బలం చేకూర్చవచ్చు. బలాబలాల పరంగా ఆర్సీబీనే కాస్త వీక్‌గా కనిపిస్తోంది.
ప్రిడిక్షన్: ఇరు జట్ల బలాలు, బలహీనతలు అంచనా వేసిన తర్వాత ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది.
ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)
సీఎస్‌కే
రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోని, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, మహేశ్ తీక్షణ.
ఆర్సీబీ
ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, మయాంక్ డాగర్, విజయ్‌కుమార్ వ్యాషాక్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ సిరాజ్, కరన్ శర్మ.