IPL 2024 వేలం.. ప్లేయర్ల షార్ట్‌ లిస్ట్‌ ఇదే! ఆ 10 మందిపై కన్ను

IPL Auction 2024: క్రికెట్‌ అభిమానులకు రెండు నెలల పాటు ఫుల్‌ వినోదాన్ని అందించే ఐపీఎల్‌ రాబోయే సీజన్‌ కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. తాజాగా బీసీసీఐ ఐపీఎల్‌ 2024 మినీ వేలం కోసం ఆటగాళ్ల షార్ట్‌ లిస్ట్‌ను విడుదల చేసింది. అందులో ఓ 10 మందికి మాత్రం భారీ డిమాండ్‌ ఉండే అవకాశం ఉంది. ఆ 10 మంది ఎవరో ఇప్పుడు చూద్దాం..

IPL Auction 2024: క్రికెట్‌ అభిమానులకు రెండు నెలల పాటు ఫుల్‌ వినోదాన్ని అందించే ఐపీఎల్‌ రాబోయే సీజన్‌ కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. తాజాగా బీసీసీఐ ఐపీఎల్‌ 2024 మినీ వేలం కోసం ఆటగాళ్ల షార్ట్‌ లిస్ట్‌ను విడుదల చేసింది. అందులో ఓ 10 మందికి మాత్రం భారీ డిమాండ్‌ ఉండే అవకాశం ఉంది. ఆ 10 మంది ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024 కోసం ఇప్పటి నుంచే హడావిడి మొదలైపోయింది. రాబోయే సీజన్‌ కోసం జరగనున్న వేలానికి ఐపీఎల్‌ నిర్వహకులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. అందుకోసం ఐపీఎల్‌ వేలంలో పాల్గొనేందుకు రిజిస్టర్‌ చేసుకున్న ప్లేయర్ల లిస్ట్‌ను వడపోసి.. 333 మందితో ఫైనల్‌ లిస్ట్‌ను రూపొందించారు. ఈ 333 మంది ఐపీఎల్‌ 2024 వేలంలో అందుబాటులో ఉండనున్నారు. వీరి నుంచి ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను వేలంలో దక్కించుకోనున్నాయి. ఈ నెల 19న దుబాయ్‌లోని కోకో-కోలా ఎరినా‌లో ఐపీఎల్ 2024 మినీ వేలం జరగనుంది.

షార్ట్ లిస్ట్ అయిన ఆటగాళ్లలో 214 మంది భారత ప్లేయర్లు, 119 ఫారెన్‌ ఆటగాళ్లు, ఇద్దరు అసోసియేట్ దేశాల ఆటగాళ్లున్నారు. 116 మంది క్యాప్డ్‌ ప్లేయర్లు కాగా.. 215 మంది అన్‌క్యాప్డ్‌ ఆటగాళ్లు. కాగా.. ఐపీఎల్‌ 2024 కోసం ఇప్పటికే అన్ని ఫ్రాంచైజ్‌లు కొంతమంది ఆటగాళ్లను రిలీజ్‌ చేశాయి. వారి స్థానాలను వేలంలో భర్తి చేయనున్నాయి. మొత్తంగా 10 ఫ్రాంచైజీలు కలుపుకుని మొత్తం 77 ఖాళీలు ఉన్నాయి. వాటిలో 30 ఓవర్‌సీస్ స్లాట్స్ ఉన్నాయి. రూ.2 కోట్ల బేస్‌ ప్రైజ్‌తో 23 మంది ఆటగాళ్లు.. రూ. 1.5 కోట్ల బేస్ ప్రైజ్‌తో 13 మంది ఆటగాళ్లు వేలానికి అందుబాటులో ఉన్నారు.

అయితే వేలంలో 333 మంది ఆటగాళ్లు ఉన్నా.. ఎక్కువ డిమాండ్‌ మాత్రం ఓ పది మంది ప్లేయర్లకే ఉండే అవకాశం ఉంది. వారి కోసం ఫ్రాంచైజ్‌ లు పోటీ పడనున్నాయి. ఆ పది మందిలో.. ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌, న్యూజిలాండ్‌ యువ సంచలనం రచిన్‌ రవీంద్ర, ఆసీస్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌, ఇంగ్లండ్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌, భారత ఆటగాడు శార్దుల్‌ ఠాకూర్‌, ఇంగ్లండ్‌ ప్లేయర్‌ క్రిస్‌ వోక్స్‌, ఆసీస్‌ ప్లేయర్‌ జోష్‌ ఇంగ్లిస్‌, ఇంగ్లండ్‌ ఆటగాడు ఫిలిప్‌ సాల్ట్‌, ఆసీస్‌ పేసర్‌ జోష్‌ హెజల్‌వుడ్‌, న్యూజిలాండ్‌ డారిల్‌ మిచెల్‌ లు ఉన్నారు. ఈ పది మందికి వేలంలో మంచి ధర పలికే ఛాన్స్‌ ఉంది. కాగా, ఈ వేలంలో పది ఫ్రాంచైజీలు 77 మంది ఆటగాళ్ల కోసం రూ.262.95 కోట్లు ఖర్చు చేయనున్నాయి. టీమ్స్‌ పరంగా ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో చూసుకుంటే.. గుజరాత్ టైటాన్స్ దగ్గర రూ.38.15 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.13.5 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 31.4 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.28.95 కోట్లు, కేకేఆర్ దగ్గర రూ. 32.7 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ.17.75 కోట్లు, పంజాబ్ కింగ్స్ వద్ద రూ.29.1 కోట్లు, ఆర్‌సీబీ వద్ద రూ.23.25 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 14.5 కోట్లు, ఎస్‌ఆర్‌హెచ్ వద్ద రూ. 34 కోట్లు ఉన్నాయి. మరి ఈ వేలంలో ఏ జట్టు ఎవర్ని దక్కించుకుంటుందో చూడాలి.

Show comments