Nidhan
వరల్డ్ క్రికెట్ హిస్టరీలో ఓ సంచలన రికార్డు నమోదైంది. మహామహులకే సాధ్యం కాని అరుదైన ఘనత ఇది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వరల్డ్ క్రికెట్ హిస్టరీలో ఓ సంచలన రికార్డు నమోదైంది. మహామహులకే సాధ్యం కాని అరుదైన ఘనత ఇది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఏ ఆటలోనైనా రికార్డులు సృష్టించడం, ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు వాటిని బద్దలుకొట్టడం కామనే. అయితే ఒక్కోసారి మహామహులకు సాధ్యం కాని రికార్డుల్ని కొందరు అనామకులు బ్రేక్ చేసేస్తుంటారు. వాళ్లు ఎవరో కూడా చాలా మందికి తెలియదు. కానీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి సంచలనాలు చేసేస్తుంటారు. ఇలాంటి వాళ్లకు ఓవర్‌నైట్ స్టార్డమ్ వచ్చేస్తుంది. క్రికెట్లో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా వరల్డ్ క్రికెట్లో ఓ సంచలన రికార్డు నమోదైంది. ఇండోనేషియా విమెన్ ప్లేయర్ రోహ్మాలియా చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా ఎవరికీ సాధ్యం కానిది ఆమె సాధించింది.
ఇండోనేషియా, మంగోలియా మహిళా జట్ల మధ్య బుధవారం ఓ టీ20 మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో ఊహించని రికార్డు నమోదైంది. ఇండోనేషియా బౌలర్ రోహ్మాలియా హిస్టరీ క్రియేట్ చేసింది. 17 ఏళ్ల రోహ్మాలియా 3.2 ఓవర్లు బౌలింగ్ వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఏకంగా 7 వికెట్లు తీసింది. ఏడు వికెట్లు తీయడం మామూలే. కానీ ఒక్క రన్ కూడా ఇవ్వకుండా తీయడం గ్రేట్. టీ20 క్రికెట్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు ఇది. లెజెండరీ ప్లేయర్స్ కూడా ఈ ఘనతను అందుకోలేదు. కానీ ఇండోనేషియాకు చెందిన రోహ్మాలియా రికార్డు సృష్టించింది. ఆమె ధాటికి మంగోలియా టీమ్ 24 రన్స్‌కే కుప్పకూలింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండోనేషియా విమెన్స్ టీమ్ 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. నందా సకారిని (44 బంతుల్లో 61) ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించింది. ఆమెతో పాటు హిల్వా నూర్ (19) రాణించింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన మంగోలియా జట్టును రోహ్మాలియా కట్టిపడేసింది. ఆమె దెబ్బకు అపోజిషన్ టీమ్‌లో ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు చేయలేదు. సెండ్యూరెన్ (7) హైస్కోరర్. నిప్పులు చెరిగే బంతులతో మంగోలియాను కూల్చిన రోహ్మాలియా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికైంది.