IND vs SL, Gambhir: శ్రీలంకతో సిరీస్‌కు జట్ల ఎంపికపై క్లారిటీ! గంభీర్‌ మార్క్‌ సెలెక్షన్‌!

IND vs SL, Gautam Gambhir, Hardik Pandya, KL Rahul: కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ శ్రీలంక సిరీస్‌తో ఛార్జ్‌ తీసుకోనున్నాడు. అయితే.. తొలి సిరీస్‌ నుంచే తన మార్క్‌ చూపించే పనిలో పడిపోయాడు గంభీర్‌. మరి ఆ మార్క్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

IND vs SL, Gautam Gambhir, Hardik Pandya, KL Rahul: కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ శ్రీలంక సిరీస్‌తో ఛార్జ్‌ తీసుకోనున్నాడు. అయితే.. తొలి సిరీస్‌ నుంచే తన మార్క్‌ చూపించే పనిలో పడిపోయాడు గంభీర్‌. మరి ఆ మార్క్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

అందరు అనుకున్నట్లుగానే టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. మంగళవారం బీసీసీఐ కార్యదర్శి జైషా గంభీర్‌ను భారత హెడ్‌ కోచ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. హెడ్‌ కోచ్‌గా ఈ నెల శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్‌లతో గంభీర్‌ ఛార్జ్‌ తీసుకోనున్నాడు. తొలి సిరీస్‌తోనే కోచ్‌గా తన మార్క్‌ చూపించాలని భావిస్తున్నాడు గంభీర్‌. తన పనితనం జట్టు ఎంపిక నుంచే మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచిన తర్వాత.. రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అతనితో పాటు విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా కూడా టీ20లకు గుడ్‌ బై చెప్పారు.

ఇలా ముగ్గురు స్టార్‌ క్రికెటర్లు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో సరికొత్త టీ20 టీమ్‌ను నిర్మించే బాధ్యత కొత్త కోచ్‌పై పడింది. పైగా టీమ్‌కు కెప్టెన్‌ను కూడా నియమించాలి. ఇలాంటి కీలక అంశాల్లో గంభీర్‌ తన సూచనలను సెలెక్షన్‌ కమిటీకి అందించినట్లు సమాచారం. అలాగే శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రాలకు రెస్ట్‌ ఇవ్వడంతో వారి స్థానంలో కూడా కొత్త ప్లేయర్లకు అవకాశం ఇవ్వనున్నారు. అలాగే వన్డే సిరీస్‌కు కూడా కెప్టెన్‌ ఎంపిక కీలక మారింది. తొలి సిరీస్‌కే ఎదురైన ఇన్ని సవాళ్లను గంభీర్‌ చాలా తెలివిగా ఛేదిస్తున్నట్లు తెలుస్తోంది. టీ20ల్లో హార్ధిక్‌ పాండ్యాకు, వన్డే సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని గంభీర్‌ బీసీసీఐకి సూచించినట్లు తెలుస్తోంది.

బీసీసీఐ కూడా వారినే ఫైనల్‌ చేసినట్లు సమాచారం. అలాగే టీ20 ఫార్మాట్‌ కోసం కోర్‌ టీమ్‌ను నిర్మించేందుకు భారీ మార్పులతో ఒక విధంగా టీ20 జట్టును ప్రక్షాళన చేసే ఆలోచనలో గంభీర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ, సెలెక్టర్లు, హెడ్‌ కోచ్‌ గంభీర్‌ మధ్య చర్చలు పూర్తి అయిన తర్వాత.. ఈ వారం చివర్లో శ్రీలంక టూర్‌ కోసం టీ20, వన్డే టీమ్స్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి భారత్‌, శ్రీలంక మధ్య టీ20 సిరీస్‌ మొదలు కానుంది. మరి తొలి సిరీస్‌లోనే గంభీర్‌ తన మార్క్‌ చూపిస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments