13 ఏళ్లలో 3 వికెట్లు తీశాడు! ఇలా అయితే టీమిండియా మరో వెస్టిండీసే!

13 ఏళ్లలో 3 వికెట్లు తీశాడు! ఇలా అయితే టీమిండియా మరో వెస్టిండీసే!

భారత్‌-వెస్టిండీస్‌ మధ్య పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్‌ సైతం మూదో రోజు బాగానే బ్యాటింగ్‌ చేసింది. వర్షం అంతరాయం కలిగించించడంతో పూర్తి రోజు ఆట కొనసాగలేదు. ఒక వికెట్‌ నష్టానికి 87 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆట మొదలు పెట్టిన విండీస్‌.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అయితే.. భారత బౌలర్లు విండీస్‌ను చాలా తక్కువ స్కోర్‌కే ఆలౌట్‌ చేస్తారనుకుంటే.. అలా జరగలేదు. విండీస్‌ బ్యాటర్లు పోరాట స్ఫూర్తిని కనబరుస్తున్నారు.

వారికి పోరాటానికి మన బౌలర్ల వైఫల్యం కూడా తోడవుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్‌ జయదేవ్‌ ఉనద్కట్‌ ఒక్కటంటే ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు. మిగతా బౌలర్లు కనీసం ఒక్క వికెట్‌ అయినా తీసుకున్నారు. ఇప్పటి వరకు 16 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఉనద్కట్‌కు వికెట్‌ దక్కలేదు సరికదా పైగా 44 పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా బౌలర్ల కంటే అతని ఎకానమినే ఎక్కవ.

2 టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉండి, ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో మంచి స్థితిలోనే ఉన్నప్పటికీ ఉనద్కట్‌ ప్రదర్శన కలవరపరుస్తోంది. వెస్టిండీస్‌ ప్రస్తుతం పసికూన జట్టుగా పరిగణిస్తున్న తరుణంలో మిగతా బౌలర్లు పనికానిచ్చేస్తున్నారు. కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ పెద్ద జట్లు అయితే ఉనద్కట్‌ లాంటి బౌలర్‌ను ఉతికి ఆరేసి.. కావాల్సినన్ని పరుగులు పిండుకుంటాయి.

31 ఏళ్ల జయదేవ్ ఉనద్కట్‌ 2010లో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 3 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. డిసెంబర్ 2010లో అరంగేట్రం చేసిన తర్వాత.. జట్టులో స్థానం కోల్పోయి గతేడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్ పర్యటనతో మళ్లీ తిరిగి టీమ్‌లోకి వచ్చాడు. బంగ్లాతో మ్యాచ్‌లో పర్వాలేదనిపించిన ఉనద్కట్‌.. విండీస్‌తో ఆడుతున్న సిరీస్‌లో ఇప్పటివరకు రెండు టెస్టుల్లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇలాంటి బౌలర్లకు మరిన్ని అవకాశాలు ఇస్తే.. భవిష్యత్తులో టీమిండియా పరిస్థితి ప్రస్తుత వెస్టిండీస్‌లా మారుతుందని క్రికెట్‌ అభిమానులు అభిప్రాయాపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: క్రికెట్​కు గుడ్​బై చెప్పిన స్టార్ బ్యాటర్.. ఆ కారణాల వల్లే రిటైర్మెంట్ అంటూ..!

Show comments