ఆసియా కప్-2023లో భారత జట్టు వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్పిన్‌కు అనుకూలంగా మారిన కొలంబో పిచ్‌పై టీమిండియా బ్యాటర్లకు లంకేయులు గట్టి సవాలే విసిరారు. కెప్టెన్ రోహిత్ శర్మ (53) చెలరేగి మంచి ఓపెనింగ్ అందించడంతో భారత్ 300 పైచిలుకు స్కోరు చేసేలా కనిపించింది. కానీ యువ ఆల్‌రౌండర్ వెల్లలాగె, పార్ట్‌టైమ్ బౌలర్ అసలంక కొలంబో పిచ్‌పై అద్భుతంగా బౌలింగ్ చేశారు. వాళ్ల ధాటికి భారత్ 213 రన్స్‌కే పరిమితమైంది. భారత్ ఇన్నింగ్స్ సమయంలో స్పిన్‌కు పూర్తిగా అనుకూలించిన కొలంబో పిచ్‌పై లంక ఇన్నింగ్స్‌లో మంచి టర్న్, బౌన్స్ కనిపించింది. అయితే రోహిత్ శర్మ మాత్రం పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (2/30), మహ్మద్ సిరాజ్ (1/17)తోనే బౌలింగ్ మొదలుపెట్టాడు. ఇది బాగా వర్కౌట్ అయింది.
మొదటి ముగ్గురు లంక బ్యాట్స్‌మెన్‌ను బుమ్రా, సిరాజ్ వెనక్కి పంపారు. అయితే లంక అంత తేలిగ్గా వదల్లేదు. బౌలింగ్‌లో తన మ్యాజిక్ చూపించిన వెల్లలాగే (42 నాటౌట్) బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. అతడితో పాటు ధనంజయ డిసిల్వా (41) కూడా రాణించడంతో మ్యాచ్ లంక వైపు మొగ్గుతున్నట్లు కనిపించింది. కానీ కీలక సమయంలో గత మ్యాచ్ హీరో కుల్దీప్ యాదవ్ (4/43)తో పాటు జడేజా (2/33) కూడా విజృంభించడంతో విజయం భారత్ సొంతమైంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ రెండ్రోజులు కొనసాగడంతో లంకతో మ్యాచ్‌లో భారత ప్లేయర్లు కాస్త అలిసిపోయినట్లుగా కనిపించారు. బ్యాటింగ్‌లో త్వరగా ఆలౌట్ అవడంతో వారిలో నిరాశ కూడా కనిపించింది. కానీ బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా, హార్దిక్.. ఇలా బౌలర్లందరూ చెలరేగడంతో భారత జట్టు ఆటగాళ్లు జోష్‌గా కనిపించారు.
ఒక్కో వికెట్ పడుతూ విజయానికి దగ్గరైన సమయంలో భారత ప్లేయర్లందరిలో ఉద్వేగం కనిపించింది. ఇదే క్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో షనక ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న రోహిత్ అద్భుతంగా డైవ్ చేసి పట్టుకున్నాడు. దీంతో సంతోషం పట్టలేక కోహ్లీ వచ్చి హిట్‌మ్యాన్‌ను హగ్ చేసుకున్నాడు. విరాట్-రోహిత్‌కు పడదని చాలా మంది అనుకుంటారు. వీళ్లు శత్రువులనే భావన చాలా మందిలో ఉంది. కానీ లంకతో మ్యాచ్‌లో రోహిత్-కోహ్లీలు హగ్ చేసుకోవడం, కలసి సెలబ్రేట్ చేసుకోవడం, హిట్‌మ్యాన్‌కు విరాట్ సూచనలు ఇవ్వడం చూస్తే వీళ్ల మధ్య బంధం ఎంత బలంగా ఉందో అర్థమవుతుందని చెప్పొచ్చు. లంకతో మ్యాచ్‌లో వీళ్లిద్దరి మధ్య మ్యాజికల్ మూమెంట్స్‌కు హేటర్స్ కుళ్లుకోక తప్పదని ఫ్యాన్స్ అంటున్నారు.
Virat Kohli hugging Rohit Sharma was a wholesome moment.
The two legends of our sport…!!! ♥️pic.twitter.com/EnayDuhrw9
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2023