Shreyas Iyer Bullet Throw Run Out Kamindu Mendis: వీడియో: అయ్యర్ బుల్లెట్ త్రో.. అంత దూరం నుంచి త్రో ఎలా సాధ్యమైంది?

Shreyas Iyer: వీడియో: అయ్యర్ బుల్లెట్ త్రో.. అంత దూరం నుంచి త్రో ఎలా సాధ్యమైంది?

India vs Sri Lanka: టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఓ స్టన్నింగ్ రనౌట్​తో అందర్నీ అలరించాడు. లంకతో జరిగిన రెండో వన్డేలో అయ్యర్ అద్భుతమైన ఫీల్డింగ్​తో ఆడియెన్స్​ మనసుల్ని దోచుకున్నాడు.

India vs Sri Lanka: టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఓ స్టన్నింగ్ రనౌట్​తో అందర్నీ అలరించాడు. లంకతో జరిగిన రెండో వన్డేలో అయ్యర్ అద్భుతమైన ఫీల్డింగ్​తో ఆడియెన్స్​ మనసుల్ని దోచుకున్నాడు.

శ్రీలంక టూర్​లో ఉన్న భారత్​కు మరో షాక్ తగిలింది. టీ20 సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసిన టీమిండియా వన్డే సిరీస్​లో మాత్రం ఎదురుదెబ్బలు తింటోంది. స్టార్లతో నిండిన రోహిత్ సేనను కుర్రాళ్లతో నిండిన లంక భయపెడుతోంది. తొలి వన్డేలో ఓటమి కోరల్లో నుంచి బయటపడి.. మ్యాచ్​ను టై చేసింది ఆతిథ్య జట్టు. రెండో వన్డేలో మరోమారు చెలరేగి ఆడి విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్​లో భారత్ 0-1తో వెనుకబడింది. మూడో వన్డేలోనూ బోణీ కొట్టకపోతే సిరీస్​ మిస్సయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి త్వరగా కోలుకొని తమ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాలి టీమిండియా.

ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్ పరంగా ఆకట్టుకున్నా బ్యాటింగ్​లో తేలిపోవడంతో విజయం లంక వశమైంది. ఆ టీమ్​ ఇచ్చిన 240 పరుగుల టార్గెట్​ను అందుకోలేక 208 పరుగులకే చతికిలపడింది. అయితే ఈ మ్యాచ్​లో ఫీల్డింగ్ టైమ్​లో భారత స్టార్ శ్రేయస్ అయ్యర్ బుల్లెట్ రనౌట్​ మాత్రం హైలైట్​గా నిలిచింది. అర్ష్​దీప్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్​లో ఐదో బంతికి మిడ్ వికెట్​ వైపు కొట్టాడు బ్యాటర్ కమిందు మెండిస్. గాల్లో లేచిన బంతిని ఫీల్డర్ అందుకొని త్రో చేసేలోపు రెండు పరుగులు పూర్తి చేయాలని భావించాడు మెండిస్.

లెగ్ సైడ్ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. డీప్ మిడ్ వికెట్ ఏరియాలో పడిన బంతిని అందుకొని బ్యాటింగ్ ఎండ్ వైపు విసిరాడతను. అయితే ఈజీగా రెండు పరుగులు వస్తాయనుకొని కాస్త బద్దకంగా పరిగెత్తిన కమిందు మెండిస్ వికెట్లను చేరుకోలేకపోయాడు. అయ్యర్ విసిరిన డైరెక్ట్ త్రో వాయు వేగంతో వచ్చి నేరుగా వికెట్లను తాకింది. దెబ్బకు స్టంప్స్ షేక్ అయ్యాయి. బెయిల్స్ ఎగిరి దూరంగా పడ్డాయి. క్రీజుకు చాలా దూరంలో ఉన్న మెండిస్.. కళ్ల ముందే మెరుపు వేగంతో వచ్చి బాల్ వికెట్లను తాకడంతో నిరాశతో క్రీజును వీడాడు. అయితే అంత దూరం నుంచి నేరుగా వికెట్లకు గురి పెట్టి త్రో చేయడం సులువైన విషయం కాదు. అందుకు ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్​కు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని నెటిజన్స్ అంటున్నారు. క్యాచ్​లు, రనౌట్​లు, త్రోల విషయంలో అతడు చేయించిన ప్రాక్టీస్ వల్లే అయ్యర్ అలవోకగా రనౌట్ చేశాడని అంటున్నారు. మరి.. అయ్యర్ త్రోపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments