Nidhan
India vs Sri Lanka: టీమిండియా స్టార్ బ్యాటర్ కెరీర్ ఇప్పుడు రిస్క్‌లో పడింది. ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా ఎదిగే ఛాన్స్ వచ్చినా అతడు చేజేతులా మిస్ చేసుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
India vs Sri Lanka: టీమిండియా స్టార్ బ్యాటర్ కెరీర్ ఇప్పుడు రిస్క్‌లో పడింది. ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా ఎదిగే ఛాన్స్ వచ్చినా అతడు చేజేతులా మిస్ చేసుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Nidhan
అన్ని ఫార్మాట్లలోనూ టాప్ టీమ్‌గా దూసుకుపోతున్న భారత్.. మునుపటి ప్రభను కోల్పోయిన శ్రీలంకతో ఆడుతోందంటే ఆ జట్టును వైట్‌వాష్ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే టీ20 సిరీస్‌లో లంకను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో వన్డే సిరీస్ కూడా మనదేనని అంతా ఫిక్స్ అయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి వన్డే స్పెషలిస్ట్‌లు టీమ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆతిథ్య జట్టుకు దబిడిదిబిడేనని భావించారు. సింహళ జట్టు నుంచి కనీస పోటీ అయినా ఉంటుందా అని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. రోహిత్ సేనను వరుస మ్యాచుల్లో ఓడించి సిరీస్‌ను 2-0తో గెలుచుకుందా టీమ్. అసలేం జరుగుతుందో అర్థమయ్యే లోపే సిరీస్ ముగిసింది.
బ్యాటింగ్ ఫెయిల్యూర్, టీమ్ కాంబినేషన్ సెట్ కాకపోవడం, వార్మప్ మ్యాచ్‌లు లేకపోవడం, లంక పిచ్‌లను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఉన్న బలహీనత.. ఇలా భారత్ ఓటమికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘోర పరాభవం టీమ్ ఫ్యూచర్‌పై పెద్దగా ప్రభావం చూపించకపోయినా.. కొందరు ఆటగాళ్ల కెరీర్ మీద మాత్రం ఎఫెక్ట్ పడటం ఖాయంగా కనిపిస్తోంది. అందులో స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నాడు. అతడి కెరీర్ ఇప్పుడు డేంజర్లో పడింది. లంకతో వన్డే సిరీస్‌లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఈ టాలెంట్ బ్యాటర్ తీవ్రంగా నిరుత్సాహపర్చాడు. తొలి వన్డేలో 23 పరుగులు చేసిన చేసిన అయ్యర్.. మిగిలిన రెండు వన్డేల్లో కలిపి 15 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా సిరీస్‌లో 38 రన్స్ చేశాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసిన అయ్యర్.. ఇన్నింగ్స్‌ను నిలబెట్టి భారీ స్కోరు దిశగా టీమ్‌ను తీసుకెళ్తాడని అనుకుంటే త్వరగా ఔటై టీమ్ పతనానికి కారణమయ్యాడు.
అయ్యర్ వికెట్ల పతనాన్ని అడ్డుకొని ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లి ఉంటే సిరీస్‌లో రిజల్ట్ మరోలా ఉండేది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే.. వన్డేల్లో చాలా బాగా ఆడుతూ వచ్చాడు శ్రేయస్. 50 ఓవర్ల వరల్డ్ కప్-2023లో కూడా భారీగా పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌లో బీసీసీఐ మాట పెడచెవిన పెట్టి కాంట్రాక్ట్ కోల్పోయాడు. ఐపీఎల్ సక్సెస్‌తో తిరిగి టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ లంక సిరీస్‌లో దారుణంగా ఫెయిలయ్యాడు. భారత్ ఇంకో ఆర్నెళ్ల వరకు వన్డే ఆడదు. ఈ గ్యాప్‌లో పలు టీ20లు, టెస్టులు జరగనున్నాయి.
ఇక మీదట జరిగే పొట్టి ఫార్మాట్ సిరీస్‌ల్లో అయ్యర్‌కు చోటు దక్కే అవకాశాలు లేవు. టెస్టుల్లోనూ అతడ్ని ఎంపిక చేసినా ఆడిస్తారనే గ్యారెంటీ లేదు. ఈ గ్యాప్‌లో ఇతర ఆటగాళ్లు ఎవరైనా మిడిలార్డర్లో రాణిస్తే అయ్యర్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో చోటు దక్కడం కష్టమే. లంక సిరీస్‌లో రాణిస్తే మిగిలిన రెండు ఫార్మాట్లలో కమ్‌బ్యాక్ ఇచ్చేవాడు అయ్యర్. కానీ చేజేతులా అది కోల్పోవడమే గాక ఇప్పుడు వన్డే టీమ్‌లో బెర్త్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయ్యర్ కెరీర్ ఇక ముగిసిందని.. గంభీర్ కూడా అతడ్ని కాపాడలేడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇస్తాడా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.