IND vs SL Rohit Sharma Batting Secret: నిన్నటి మ్యాచ్​లో రోహిత్ బ్యాటింగ్​ను గమనించారా? స్లో పిచ్​పై ఇంతలా ఎలా రెచ్చిపోయాడు?

Rohit Sharma: నిన్నటి మ్యాచ్​లో రోహిత్ బ్యాటింగ్​ను గమనించారా? స్లో పిచ్​పై ఇంతలా ఎలా రెచ్చిపోయాడు?

India vs Sri Lanka: శ్రీలంకతో జరిగిన ఫస్ట్ వన్డేలో టీమిండియా ఆఖరి వరకు పోరాడినా గెలుపు తీరాలకు చేరుకోలేకపోయింది. అయితే టైగా ముగిసిన ఈ మ్యాచ్​లో కెప్టెన్ రోహిత్ శర్మ నాక్ మాత్రం స్పెషల్​గా నిలిచింది.

India vs Sri Lanka: శ్రీలంకతో జరిగిన ఫస్ట్ వన్డేలో టీమిండియా ఆఖరి వరకు పోరాడినా గెలుపు తీరాలకు చేరుకోలేకపోయింది. అయితే టైగా ముగిసిన ఈ మ్యాచ్​లో కెప్టెన్ రోహిత్ శర్మ నాక్ మాత్రం స్పెషల్​గా నిలిచింది.

శ్రీలంకతో జరిగిన ఫస్ట్ వన్డేలో టీమిండియా ఆఖరి వరకు పోరాడినా గెలుపు తీరాలను చేరుకోలేకపోయింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు అన్ని ఓవర్లు ఆడి 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన రోహిత్ సేన 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. ఆఖరి వరకు విజయం ఇరు జట్లతో దోబూచులాడింది. ఒక దశలో లంక సులువుగా గెలుస్తుందనిపిస్తే.. ఇంకో దశలో భారత్​దే విజయంలా అనిపించింది. కానీ రిజల్ట్ క్షణాల్లో మారిపోయింది. చరిత్ అసలంక వరుస బంతుల్లో 2 వికెట్లు తీయడంతో మ్యాచ్ టై అయింది. పైకి మ్యాచ్ సమమైనట్లు కనిపించినా.. నైతికంగా చూస్తే లంకదే విజయమని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి టాప్ బ్యాటర్స్ ఉన్న టీమ్​ను 230 ఛేజ్ చేయకుండా లంక ఆపడాన్ని మెచ్చుకోవాల్సిందే. ఆ జట్టు పోరాడిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే నిన్నటి మ్యాచ్​లో మెన్ ఇన్ బ్లూ కెప్టెన్ రోహిత్ శర్మ నాక్ మాత్రం స్పెషల్​గా నిలిచిందని చెప్పొచ్చు. క్రీజులో ఉన్నంత సేపు ఆతిథ్య జట్టు బౌలర్లను ఉతికారేశాడు హిట్​మ్యాన్. 47 బంతుల్లో 58 పరుగులు చేసిన అతడు.. 7 బౌండరీలతో పాటు 3 భారీ సిక్సులు బాదాడు. అతడి వల్లే నిన్న భారత్ ఛేజింగ్​లో నిలబడింది. క్విక్‌ స్టార్ట్ లభించి ఉండకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. అయితే రోహిత్ ఇన్నింగ్స్​ గురించి ఇంతగా మాట్లాడటానికి ప్రధాన కారణం స్లో పిచ్​పై ఆడటమే. ఇలాంటి వికెట్​పై బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదనే విషయం తెలిసిందే.

స్లో పిచ్​లో బాల్ ఆగి వస్తుంది. దీంతో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారుతుంది. ఒక్కోసారి బాల్ మరింత లో అవడం లేదా అనూహ్యమైన బౌన్స్ కూడా లభిస్తూ ఉంటుంది. ఇలాంటి వికెట్లపై ముఖ్యంగా స్పిన్నర్లకు ఇక్కడ ఎక్కువ మద్దతు దొరుకుతుంది. వాళ్లను ఎదుర్కొని వికెట్ కాపాడుకుంటూ పరుగులు చేయడం ఎంతో ఛాలెంజ్​తో కూడుకున్నది. కానీ రోహిత్ మాత్రం ఈ పిచ్​లపై ఎలా పరుగులు చేయాలనే కిటుకు బాగా పట్టేశాడు. ఏ బౌలర్ వచ్చినా అతడి తొలి ఓవర్​లోనే దంచుడు మొదలుపెడతాడు హిట్​మ్యాన్. దీని వల్ల బౌలర్లు కోలుకునేందుకు టైమ్ దొరకదు. షాట్​కు ముందే కమిట్ కాకుండా బాల్ బ్యాట్ మీదకు వచ్చే దాకా ఆగి ఆఖరి మూమెంట్​లో బాదుతుంటాడు. స్పిన్నర్లపై స్వీప్ షాట్లతో విరుచుకుపడతాడు. దీంతో వాళ్లు లెంగ్త్​ అడ్జస్ట్ చేసుకోలేక ఇబ్బంది పడతారు. నిన్నటి మ్యాచ్​లోనూ ఇదే జరిగింది. అందరు బౌలర్లను ఉతికారేశాడు హిట్​మ్యాన్. ఇదే ట్రిక్​ను మిగతా బ్యాటర్లు కూడా పట్టుకుంటే ఇలాంటి పిచ్​లపై భారత్​ను ఆపడం ఎవరి వల్లా కాదని క్రికెట్ ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు.

Show comments