Sundar-Rohit: వీడియో: సుందర్​పై సీరియస్ అయిన రోహిత్.. ఎందుకు అడుగుతున్నావంటూ..!

India vs Sri Lanka: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ డామినేట్ చేస్తోంది. లంక బ్యాటర్లను మన బౌలర్లు ఓ ఆటాడుకున్నారు.

India vs Sri Lanka: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ డామినేట్ చేస్తోంది. లంక బ్యాటర్లను మన బౌలర్లు ఓ ఆటాడుకున్నారు.

శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ డామినేట్ చేస్తోంది. లంక బ్యాటర్లను మన బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. అయితే పిచ్​ నుంచి పేస్, బౌన్స్​కు సపోర్ట్ దొరకడంతో ఆరంభంలో మన పేసర్లు లంకను బాగా ఇబ్బంది పెట్టారు. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (1)ను మహ్మద్ సిరాజ్ వెనక్కి పంపాడు. మరో ఓపెనర్ పతుమ్ నిస్సంక (56) ఒకవైపు నిలదొక్కుకొని పరుగులు చేసినా.. ఇంకోవైపు వచ్చిన వాళ్లు వచ్చినట్లు పెవిలియన్​కు క్యూ కట్టారు. స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ప్రత్యర్థి బ్యాటర్లను వణికించారు. అయితే ఒక నిర్ణయం విషయంలో సుందర్​పై కెప్టెన్ హిట్​మ్యాన్ సీరియస్ అయ్యాడు. లంక బ్యాటర్ దునిత్ వెల్లలాగే (67) విషయంలో డీఆర్​ఎస్​కు వెళ్లాలా? వద్దా? అని డిస్కషన్ నడిచింది.

సుందర్ వేసిన ఓవర్​లో ఫుల్ లెంగ్త్​లో పడిన బంతిని డిఫెన్స్ చేశాడు దునిత్. అయితే బాల్ అతడి ఎడమ కాలి షూకు తగిలినట్లు అనిపించడంతో భారత ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశారు. అంపైర్ నాటౌట్ అనడంతో అప్పీల్​కు వెళ్దామని సుందర్ అనుకున్నాడు. స్లిప్​లో ఉన్న రోహిత్.. కీపర్ రాహుల్​ను కన్ఫర్మేషన్ అడిగాడు. కానీ కేఎల్ తానేమీ చెప్పలేనన్నాడు. సుందర్ మాత్రం నువ్వు చెప్పు అంటూ హిట్​మ్యాన్​ను అడిగాడు. దీంతో హిట్​మ్యాన్ గరం అయ్యాడు. స్లిప్​లో ఉన్నాడు కాబట్టి అతడికి ఏం జరిగిందో ఎగ్జాక్ట్​గా కనిపించే ఛాన్స్ లేదు. ఆల్రెడీ కీపర్ ఏం చెప్పలేనని అన్నాడు.. అలాంటప్పుడు బౌలింగ్ చేసిన సుందరే ఔట్​కు వెళ్లాలో లేదో డిసైడ్ చేయాలి. కానీ సుందర్.. నువ్వే చెప్పు అంటూ రోహిత్​ను అడిగాడు. దీంతో నేను కాదు.. నువ్వు చెప్పు ఏం చేద్దామంటూ ఆగ్రహానికి లోనయ్యాడు. అయితే వెంటనే కోలుకొని.. నా వైపు ఎందుకు చూస్తున్నావంటూ నవ్వుల్లో మునిగిపోయాడు.

Show comments