iDreamPost
android-app
ios-app

Mohammed Siraj: లంకపై చెలరేగి బౌలింగ్ చేసే సిరాజ్​కు ఏమైంది? అతడు లేకపోతే మియా రాణించడా?

  • Published Aug 08, 2024 | 4:22 PM Updated Updated Aug 08, 2024 | 4:22 PM

టీమిండియా స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. శ్రీలంక అనగానే చెలరేగే మియా ఆ టీమ్ మీద కూడా తుస్సుమన్నాడు. దీంతో అతడికి ఏమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

టీమిండియా స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. శ్రీలంక అనగానే చెలరేగే మియా ఆ టీమ్ మీద కూడా తుస్సుమన్నాడు. దీంతో అతడికి ఏమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

  • Published Aug 08, 2024 | 4:22 PMUpdated Aug 08, 2024 | 4:22 PM
Mohammed Siraj: లంకపై చెలరేగి బౌలింగ్ చేసే సిరాజ్​కు ఏమైంది? అతడు లేకపోతే మియా రాణించడా?

అన్ని ఫార్మాట్లలోనూ ఎదురులేకుండా ఆధిపత్యం చలాయిస్తున్న భారత జట్టు.. ఇటీవలే టీ20 వరల్డ్ కప్ గెలుచుకొని డామినేషన్​ను నెక్స్ట్ లెవల్​కు తీసుకెళ్లింది. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ-2025, వరల్డ్ టెస్ట్ సిరీస్​ లాంటి ఐసీసీ టోర్నీలు సొంతం చేసుకొని క్రికెట్​పై ఏకఛత్రాధిపత్యాన్ని చూపించాలని అనుకుంటోంది. ఇలా భారీ అంచనాలతో సాగుతున్న జట్టు అనూహ్యంగా శ్రీలంక చేతిలో సిరీస్​ను పోగొట్టుకుంది. ఆ జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్​ను 0-2 తేడాతో కోల్పోయింది. ఇది అంత ఇంపార్టెంట్ సిరీస్ కాదు.. పెద్దగా పోయేదేం లేదని అనొచ్చు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు భారత్ పెద్దగా వన్డేలు ఆడట్లేదు. ఈ ఏడాది ఇదే ఆఖరి వన్డే సిరీస్. అందులో ఓడటం బిగ్ మైనస్ అనే చెప్పాలి. అయితే ఓటమి కంటే కూడా కొందరు ఆటగాళ్ల ప్రదర్శన తీవ్రంగా నిరుత్సాహపర్చింది. అందులో మహ్మద్ సిరాజ్​ ఒకడు.

టీమిండియా స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. శ్రీలంక అనగానే చెలరేగే మియా ఆ టీమ్ మీద కూడా తుస్సుమన్నాడు. లంక సిరీస్​లో మూడు వన్డేల్లో కలిపి అతడు తీసింది 3 వికెట్లే కావడం గమనార్హం. ఆఖరి వన్డేలో 9 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు. భారీగా పరుగులు ఇచ్చుకోవడం, వికెట్లు తీయకపోవడంతో అతడు ఫ్రస్ట్రేషన్​లో కనిపించాడు. దీంతో అతడికి ఏమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిరీస్ డిసైడర్​లో అర్ష్​దీప్​ను తీసేసి ఏకైక పేసర్​గా సిరాజ్​ను టీమ్​లోకి తీసుకున్నాడు కెప్టెన్ రోహిత్. అతడికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి బాగా బౌలింగ్ చేయమని ఎంకరేజ్ చేశాడు. అయినా మియా అంచనాలను అందుకోలేదు. అతడి ఫెయిల్యూర్​కు పలు కారణాలు కనిపిస్తున్నాయి.

Siraj

లంక సిరీస్ కాదు.. అంతకుముందు నుంచే సిరాజ్ టచ్ కోల్పోయాడు. ఐపీఎల్​లో ఫెయిలయ్యాడు. ఇది ఆర్సీబీ విజయావకాశాలపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఆ తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్​లో మోస్తరుగా రాణించాడు. లంకపై చెలరేగే సిరాజ్.. ఈసారి అక్కడ కూడా తుస్సుమన్నాడు. స్టార్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా అండగా ఉంటే రెచ్చిపోయి బౌలింగ్ చేస్తుంటాడు సిరాజ్. అతడు లేకపోవడం వల్లే తన బెస్ట్ ఇవ్వలేకపోయాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బుమ్రా ఒకవైపు నుంచి బ్యాటర్ల మీద ఒత్తిడి పెంచితే, సిరాజ్ ఆ ప్రెజర్​ను మరింత పెంచి బ్రేక్​త్రూలు అందిస్తూ వచ్చాడని.. తన సరిజోడీ లేకపోయే సరికి కొంత డల్ అయ్యాడని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. కారణాలు ఏవైనా సిరాజ్ మళ్లీ ఫామ్​ను అందుకోవడం టీమ్​తో పాటు వ్యక్తిగతంగా అతడికి కూడా ఎంతో ముఖ్యం. తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో జట్టులో పర్మినెంట్ ప్లేయర్​గా, ఆల్ ఫార్మాట్ పేసర్​గా ఉండాలంటే తన రిథమ్​ను అందుకోవాలి. మరి.. సిరాజ్ స్ట్రాంగ్​గా కమ్​బ్యాక్ ఇస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.