ఆసియా కప్-2023లో భారత జట్టు తమకు ఎదురొచ్చిన ప్రత్యర్థిని చిత్తు చేస్తూ వెళ్తోంది. వరుసగా మూడ్రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. ఆ రెండింట్లోనూ నెగ్గి టోర్నమెంట్లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. టీమిండియా జోరును అడ్డుకోవడంలో మిగతా జట్లు ఫెయిల్ అవుతున్నాయి. సూపర్-4 దశలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. దాయాదితో మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ రాణించింది. అయితే శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం అదే ఆటతీరును కొనసాగించలేకపోయింది.
లంకతో మ్యాచ్‌లో ఆరంభంలో కెప్టెన్ రోహిత్ శర్మ వరుస బౌండరీలు, సిక్సులతో చెలరేగాడు. కానీ అదే జోరును కొనసాగించడంలో మిగతా బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. స్పిన్‌కు అనుకూలిస్తున్న కొలంబో పిచ్‌పై భారత బ్యాటర్లు తేలిపోయారు. టీమిండియా వరుస వికెట్లు కోల్పోవడంతో ఒక దశలో స్కోరు 200 దాటుతుందా అనే అనుమానం కలిగింది. కానీ చివర్లో అక్షర్ పటేల్ ఓ చేయి వేయడంతో 213 రన్స్ చేసింది. స్పిన్‌ను బాగా ఆడతారనే పేరున్న భారత బ్యాటర్లు.. స్పిన్నర్లు వెల్లలాగె, అసలంకకు వికెట్లను సమర్పించారు.
ఛేదనకు దిగిన లంకను పేసర్లు బుమ్రా, సిరాజ్ వణికించారు. వీరి దెబ్బకు ఆతిథ్య జట్టు 30 రన్స్ లోపే మూడు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ అద్భుతంగా రాణించడంతో భారత్‌కు విజయం సొంతమైంది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మంగళవారం రాత్రి భారత్, శ్రీలంకకు చెందిన క్రికెట్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న కొందరు అభిమానులు ఒకరి మీద ఒకరు చేయి చేసుకున్నారు. లంక క్రికెట్ జట్టు జెర్సీలో ఉన్న ఒక వ్యక్తి.. మరో బృందంపై పరిగెత్తుకుంటూ వచ్చి అటాక్ చేశాడు. ఆ టైమ్‌లో కొందరు వీళ్లను నిలువరించే ప్రయత్నం చేశారు. ఇరు దేశాల ఫ్యాన్స్ కొట్లాటకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: ఆ ఒక్కడి వల్లే రోహిత్ ఈ స్థాయిలో ఉన్నాడు: గంభీర్