IND vs SA Suryakumar Yadav Match Turing Catch: వీడియో: బ్యాటింగ్‌లో జీరో అయ్యాడు.. కానీ ఒక్క క్యాచ్‌తో కప్పు అందించి హీరో అయ్యాడు!

వీడియో: బ్యాటింగ్‌లో జీరో అయ్యాడు.. కానీ ఒక్క క్యాచ్‌తో కప్పు అందించి హీరో అయ్యాడు!

India vs South Africa: 140 కోట్ల మంది భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగాయి. ప్రపంచ కప్​ను టీమిండియా గెలవడంతో వీధి వీధినా సంబురాలు మిన్నంటాయి. రోహిత్ సేన గెలుపును చిన్నా పెద్దా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

India vs South Africa: 140 కోట్ల మంది భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగాయి. ప్రపంచ కప్​ను టీమిండియా గెలవడంతో వీధి వీధినా సంబురాలు మిన్నంటాయి. రోహిత్ సేన గెలుపును చిన్నా పెద్దా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

140 కోట్ల మంది భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగాయి. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచ కప్​ను టీమిండియా కైవసం చేసుకోవడంతో దేశంలోని వీధి వీధినా సంబురాలు మిన్నంటాయి. రోహిత్ సేన గెలుపును చిన్నా పెద్దా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్షణం కోసమే కదా ఇన్నాళ్లూ ఎదురు చూసిందంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే సౌతాఫ్రికాపై విజయం ఊరికే రాలేదు. మ్యాచ్ చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా సాగింది. రెండు జట్లు నువ్వానేనా అంటూ ఫైట్ చేయడంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. అయితే తమ అనుభవాన్ని అంతా రంగరించి ఒత్తిడిని తట్టుకున్న టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. అయితే నిన్నటి మ్యాచ్​లో ఒక క్యాచ్​ హైలైట్​గా నిలిచింది.

బ్యాటింగ్​లో విరాట్ కోహ్లీ (59 బంతుల్లో 76), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47), శివమ్ దూబె (16 బంతుల్లో 27) అద్భుతంగా రాణించారు. దీంతో కఠిన పిచ్​పై 176 పరుగుల భారీ స్కోరును సెట్ చేసింది టీమిండియా. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ హిస్టరీలో ఇదే హయ్యెస్ట్ స్కోర్ కావడం విశేషం. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన సఫారీలను హార్దిక్ పాండ్యా (3/20), జస్​ప్రీత్ బుమ్రా (2/18), అర్ష్​దీప్ సింగ్ (2/20) కట్టడి చేశారు. అయితే అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు ఇంత కష్టపడి టీమ్​ను విజయతీరాలకు చేర్చినా అసలు క్రెడిట్ మాత్రం మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కొట్టేశాడు. అతడు బ్యాటింగ్​లో ఫ్లాప్ అయ్యాడు. 4 బంతుల్లో 3 పరుగులు చేసి రబాడ బౌలింగ్​లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ ఫీల్డింగ్ టైమ్​లో అతడు పట్టిన ఓ క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.

ఒక్క క్యాచ్​తో హీరోగా మారిపోయాడు సూర్యకుమార్ యాదవ్. అది సౌతాఫ్రికా ఇన్నింగ్స్. ఆఖరి ఓవర్ వేసేందుకు బౌలింగ్​కు దిగాడు హార్దిక్. విజయానికి ప్రొటీస్ టీమ్ 6 బంతుల్లో 16 పరుగులు చేయాలి. క్రీజులో ఉన్నది డేంజరస్ డేవిడ్ మిల్లర్ (17 బంతుల్లో 21). భారీ షాట్లు అలవోకగా ఆడే అతడు మ్యాచ్​ను మన నుంచి లాగేసుకుంటాడని ఫ్యాన్స్ భయపడ్డారు. అందుకు తగ్గట్లే ఫస్ట్ బాల్​ను లాగి కొట్టి సిక్స్​గా మలిచే ప్రయత్నం చేశాడు మిల్లర్. కానీ లాంగాఫ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సూర్య.. పరిగెత్తుకొచ్చి దాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో బౌండరీ రోప్ దాటుతున్నట్లు గమనించిన అతడు.. బాల్​ను గాల్లోకి విసిరి మళ్లీ లోపలికి వచ్చి అందుకున్నాడు. స్టన్నింగ్ క్యాచ్​తో మిల్లర్​ను ఇంటికి పంపాడు సూర్య. ఆ తర్వాత ఆ జట్టు మరో 9 పరుగులు చేసినా ఆఖరికి 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సూర్య ఆ క్యాచ్ పట్టకపోతే, అది సిక్స్​గా వెళ్లి ఉంటే కప్పు చేజారేది. కానీ మిస్టర్ 360 తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్​తో అద్భుత క్యాచ్​ను అందుకొని హీరో అయిపోయాడు. ఇది మ్యాచ్​కు టర్నింగ్ పాయింట్​గా మారింది. మరి.. సూర్య క్యాచ్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments