Nidhan
టీమిండియా-సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్ట్‌లో ప్రొటీస్ జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన కేప్‌టౌన్ పిచ్ క్యూరేటర్పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
టీమిండియా-సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్ట్‌లో ప్రొటీస్ జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన కేప్‌టౌన్ పిచ్ క్యూరేటర్పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Nidhan
భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్ ముగిసింది. సెంచూరియన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్లతో నిండిన టీమిండియా తీవ్రంగా విమర్శల పాలైంది. అయితే వెంటనే బౌన్స్ బ్యాక్ అయిన రోహిత్ సేన కేప్‌టౌన్ ఆతిథ్యం ఇచ్చిన చివరి టెస్ట్‌లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మరో మూడ్రోజులు మిగిలి ఉండగానే విక్టరీని నమోదు చేసి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో అత్యంత తక్కువ టైమ్‌లో ముగిసిన మ్యాచ్‌గా ఇది రికార్డు సృష్టించింది. గ్రాండ్ విక్టరీతో జోష్ మీద ఉన్న టీమిండియా.. నెక్స్ట్ సిరీస్‌పై ఫోకస్ చేస్తోంది. అయితే ఈ ఓటమిని జీర్ణించుకోలేని సౌతాఫ్రికా మాత్రం ఓటమికి సాకులు వెతుకుతోంది. అతడి వల్లే ఓడామంటూ విమర్శలు చేస్తోంది.
కేప్‌టౌన్ టెస్ట్‌లో పిచ్ క్యూరేటర్ తప్పిదం వల్లే ఓడామంటూ సఫారీ జట్టు చెబుతోంది. అతడి అత్యుత్సాహం తమ కొంప ముంచిందని సౌతాఫ్రికా మాజీలు ఆరోపిస్తున్నారు. సీనియర్ క్రికెటర్లతో పాటు స్వయంగా ప్రొటీస్ టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. టీమిండియాను త్వరగా ఓడించాలనే పిచ్ క్యూరేటర్ అత్యుత్సాహం తమను ఇబ్బందుల్లోకి నెట్టిందనే భావన సౌతాఫ్రికా జట్టులో వ్యక్తమవుతోంది. దీనికి కోచింగ్ స్టాఫ్ చేసిన వ్యాఖ్యలే ఉదాహరణగా చెప్పొచ్చు. మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్‌కు వచ్చాడు ప్రొటీస్ బ్యాటింగ్ కోచ్ అష్వెల్ ప్రిన్స్. అయితే ఈ పిచ్ గురించి అతడి వద్ద సమర్థించుకోవడానికి ఏమీ లేకపోయింది. పిచ్ ఇంత ఫాస్ట్‌గా, అనూహ్యమైన బౌన్స్‌తో ఉంటుందనే విషయం తనకే తెలియదన్నాడు. ఒకవేళ దీని గురించి తెలిసి ఉంటే స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను ఎందుకు తీసుకుంటామని ప్రశ్నించాడు. షాన్ పొలాక్, డేల్ స్టెయిన్ సహా చాలా మంది సౌతాఫ్రికా మాజీలు ఈ పిచ్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పిచ్ క్యూరేటర్ నిర్లక్ష్యం వల్లే ఆతిథ్య జట్టు ఓడిందంటున్నారు సౌతాఫ్రికా మాజీలు. అయితే భారత బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ మాత్రం దీన్ని ఖండించాడు. టెస్ట్ క్రికెట్ అంటే ఇలాగే ఉంటుందన్నాడు. క్రికెటర్స్‌ను టెస్ట్ చేయడమే ఈ ఫార్మాట్ అసలైన ఉద్దేశమన్నాడు. ఇక, కేప్‌టౌన్ పిచ్ మీద రన్స్ చేసేందుకు బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 55 రన్స్‌కే ఆలౌట్ అయింది. మొదటి రోజు ఏకంగా 23 వికెట్లు పడ్డాయి. మ్యాచ్ రెండ్రోజుల్లోనే ముగిసింది. దీంతో పిచ్ క్యూరేటర్‌ను అందరూ టార్గెట్ చేసుకుంటున్నారు. సౌతాఫ్రికా టీమ్ మేనేజ్మెంట్తో పాటు ఆ దేశ మాజీ క్రికెటర్లు క్యూరేటర్‌ను తిట్టిపోస్తున్నారు. ఇదంతా చూస్తున్న భారత ఫ్యాన్స్ మాత్రం మంచి పనైందని అంటున్నారు. ఇండియాను ఓడించాలనే ఉద్దేశంతోనే ఎక్కువ పేస్, బౌన్స్ ఉన్న పిచ్‌ను తయారు చేయించారని.. కానీ అదే ప్లాన్ వాళ్లకు తిప్పికొట్టిందన్నారు. ఓటమి బాధను తట్టుకోలేక పిచ్ క్యూరేటర్ మీద నెపం వేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. పిచ్ క్యూరేటర్పై సౌతాఫ్రికా అనుమానాలు వ్యక్తం చేయడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: 2007 టీ20 వరల్డ్ కప్ హీరోపై కేసు! నాడు గెలిపించి.. నేడు..