Nidhan
సెకండ్ టెస్ట్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లను భారత స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ పోయిస్తున్నాడు. సిరాజ్ బౌలింగ్‌కు సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గర్‌కు మైండ్ బ్లాంక్ అయింది.
సెకండ్ టెస్ట్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లను భారత స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ పోయిస్తున్నాడు. సిరాజ్ బౌలింగ్‌కు సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గర్‌కు మైండ్ బ్లాంక్ అయింది.
Nidhan
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ ఓటమి ఎదురైన నేపథ్యంలో ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా ఎలా ఆడుతుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఇది రోహిత్ సేనకు రియల్ టెస్ట్‌గా మారింది. అయితే ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన భారత్.. రెండో టెస్ట్‌లో అదరగొడుతోంది. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో ముకేశ్ కుమార్‌ను తీసుకుంది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను గ్రౌండ్లోకి దింపింది. తొలి మ్యాచ్‌లో ఫెయిలైన యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణపై టీమ్ మేనేజ్మెంట్ నమ్మకం ఉంచి మరో ఛాన్స్ ఇచ్చింది. రెండో టెస్ట్‌లో టాస్ నెగ్గిన ఆతిథ్య జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఆ టీమ్‌ను మహ్మద్ సిరాజ్ ముప్పుతిప్పలు పెడుతున్నాడు.
కెరీర్లో ఆఖరి టెస్ట్ ఆడుతున్న సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్‌కు సిరాజ్ మియా షాకిచ్చాడు. అతడికి వరుసగా డాట్ బాల్స్ వేస్తూ ఓపికను టెస్ట్ చేశాడు. చెత్త బంతులు వేయకుండా షాట్స్ కోసం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టేలా ఎల్గర్‌ను పుష్ చేశాడు. దీంతో సిరాజ్ వేసిన ఓ బాల్ దూరంగా వెళ్తుండగా దాన్ని వికెట్ల మీదకు ఆడుకొని ఔటయ్యాడు ఎల్గర్. ఫస్ట్ టెస్ట్‌లో సెంచరీతో దుమ్మురేపిన ఎల్గర్‌ను ప్లాన్ ప్రకారం డాట్ బాల్స్‌తో మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాడు. అతడి కంటే ముందు ఎయిడెన్ మార్క్రమ్ను గుడ్ లెంగ్త్ బంతితో ఔట్ చేశాడు సిరాజ్. లెంగ్త్‌లో పడి ఒక్కసారిగా బౌన్స్ అయిన బంతిని ఏం చేయాలో తెలియక బ్యాట్ అడ్డుగా పెట్టాడు. అంతే ఎడ్జ్ తీసుకున్న బంతి కాస్తా స్లిప్స్‌లోకి వెళ్లడం.. యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ డైవ్ చేసి పట్టుకోవడం రెప్పపాటులో జరిగిపోయాయి. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చారు టోనీ జార్జి (2), ట్రిస్టాన్ స్టబ్స్ (3).
జార్జి, స్టబ్స్‌కు ఇన్నింగ్స్‌ను బిల్డ్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు భారత పేసర్లు. సిరాజ్ బౌలింగ్‌లో కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు జార్జి. మరో బ్యాటర్ స్టబ్స్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 15 పరుగులకే నలుగురు టాపార్డర్ బ్యాటర్లు ఔటవడంతో ప్రొటీస్ దిక్కుతోచని స్థితిలో పడింది. పిచ్ నుంచి పేస్, స్వింగ్‌కు మంచి మద్దతు ఉండటంతో సిరాజ్, బుమ్రా రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. ముఖ్యంగా హైదరాబాదీ సిరాజ్ లైన్ అండ్ లెంగ్త్ పట్టుకొని కన్సిస్టెంట్గా ఒకే ఏరియాలో బాల్స్‌ను హిట్ చేశాడు. అతడి డిసిప్లిన్ వర్కౌట్ కావడంతో టపటపా వికెట్లు పడ్డాయి. సిరాజ్‌కు తోడుగా మిగతా బౌలర్లు కూడా పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే సౌతాఫ్రికాను 100 రన్స్ లోపు ఆలౌట్ చేసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్ చేస్తున్న తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇలాంటి బౌలింగ్ అతడికే సాధ్యమని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. సిరాజ్ బౌలింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: David Warner: చివరి టెస్టుకి ముందు వార్నర్ ఎమోషనల్.. ఇందుకే నువ్వు మాకు నచ్చేది!
Siraj breaks the defence of Dean Elgar. pic.twitter.com/3AGrFL7hgB
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 3, 2024