టీమిండియా-సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్‌కు అంతా రెడీ అయింది. డర్బన్ వేదికగా డిసెంబర్ 10న ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ జరగడం కష్టంగానే ఉంది.
టీమిండియా-సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్‌కు అంతా రెడీ అయింది. డర్బన్ వేదికగా డిసెంబర్ 10న ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ జరగడం కష్టంగానే ఉంది.
సౌతాఫ్రికా టూర్‌కు అంతా రెడీ అయిపోయింది. సఫారీ గడ్డ మీద ఇప్పటికే ల్యాండ్ అయిపోయిన టీమిండియా ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు ఆడేందుకు సిద్ధమైపోయింది. సౌతాఫ్రికాను వాళ్ల దేశంలో ఓడించడం అంత ఈజీ కాదు. గత చరిత్ర కూడా అపోజిషన్ టీమ్‌కే అనుకూలంగా ఉంది. వన్డే ఫార్మాట్లో సౌతాఫ్రికాను సౌతాఫ్రికాలో భారత్ కేవలం ఒక్కసారే ఓడించింది. 2018లో జరిగిన ఆరు వన్డేల సిరీస్‌లో ప్రొటీస్‌ను 5-1 తేడాతో భారత్ చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమ్ అన్ని విభాగాల్లోనూ రాణించి ప్రత్యర్థి జట్టును దాని సొంత గడ్డ మీదే చిత్తు చేసింది. టీ20ల్లోనూ మన టీమ్ పలుమార్లు ఆధిపత్యం చూపించింది.
2018లోనే సఫారీలతో మూడు మ్యాచుల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. అంతకంటే ముందు 2006, 2011లో జరిగిన ఏకైక టీ20లో టీమిండియాదే పైచేయి అయింది. అయితే 2012లో జరిగిన ఒక టీ20లో మాత్రం మన టీమ్ ఓడిపోయింది. ఇక, సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ విక్టరీ అనేది భారత్‌ను చాన్నాళ్లుగా ఊరిస్తూ వస్తోంది. ఇప్పటిదాకా సఫారీ గడ్డ మీద టీమిండియా 8 టెస్ట్ సిరీస్‌లు ఆడింది. కానీ అందులో ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. 2010-11లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో సిరీస్ గెలిచేందుకు టీమ్‌కు మంచి ఛాన్స్ వచ్చింది. కానీ ఆఖరి టెస్టు డ్రా కావడంతో మూడు మ్యాచుల సిరీస్‌ను టీమిండియా 1-1తో ముగించింది. ఈసారి కూడా ప్రొటీస్‌తో భారత్‌కు కఠిన పరీక్ష తప్పదు. మూడు ఫార్మాట్లలోనూ ఆ జట్టు పటిష్టంగా ఉంది. పలువురు విధ్వంసక ప్లేయర్లు, లోయరార్డర్ వరకు బ్యాటింగ్ చేసే సత్తా ఆ టీమ్‌కు ఉంది. ముఖ్యంగా వన్డేల్లో సౌతాఫ్రికా దూకుడు మామూలుగా లేదు.
రెగ్యులర్ కెప్టెన్ అయిన తెంబా బవుమా రెస్ట్ తీసుకోవడంతో టీ20 కెప్టెన్ మార్క్రమ్ వన్డేలకూ సారథిగా వ్యవహరించనునాడు. రీజా హెండ్రిక్స్, క్లాసెన్, స్టబ్స్, మిల్లర్, యాన్సన్, ఫెలుక్వాయో, కొయెట్జీ, కేశవ్ మహారాజ్, షంసీ లాంటి వారితో టీ20ల్లో పటిష్టంగా ఉంది సౌతాఫ్రికా. అయితే రీసెంట్గా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో నెగ్గిన యంగ్ ఇండియా ఫుల్ జోష్‌లో ఉంది. ఈ సిరీస్‌లోనూ సత్తా చాటాలని యువ ఆటగాళ్లు అనుకుంటున్నారు. దీంతో టీ20 సిరీస్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే డర్బన్ వేదికగా జరగాల్సిన ఫస్ట్ టీ20కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం షెడ్యూల్ చేసిన ఈ మ్యాచ్ జరగడం కష్టమేనని అంటున్నారు. మ్యాచ్ రోజు డర్బన్‌లో వాన కురుస్తుందని అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 10వ తేదీన ఈ ప్రాంతంలో వర్షం కురిసే ఛాన్స్ 45 శాతం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ జరగకపోతే మాత్రం ఇరు టీమ్స్ ఫ్యాన్స్‌కు ఇది నిరాశ కలిగించే విషయమే. మరి.. టీమిండియా-ప్రొటీస్ ఫైట్ కోసం మీరెంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: MS Dhoni: టీమ్‌లోకి రావాలంటే 20 కిలోలు తగ్గాల్సిందే.. ధోని రూల్‌కు షాకైన ఆఫ్ఘాన్ క్రికెటర్!