Rohit Sharma: రోహిత్ కాదు.. అతడితోనే తమకు డేంజర్ అంటున్న సౌతాఫ్రికా!

భారత్​తో ఫైనల్స్​కు ముందు ఓ ప్లేయర్​ను చూసి భయపడుతోంది సౌతాఫ్రికా. అతడు ఎక్కడ తమ మీద విరుచుకు పడతాడోనని టెన్షన్ పడుతోంది. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే..?

భారత్​తో ఫైనల్స్​కు ముందు ఓ ప్లేయర్​ను చూసి భయపడుతోంది సౌతాఫ్రికా. అతడు ఎక్కడ తమ మీద విరుచుకు పడతాడోనని టెన్షన్ పడుతోంది. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే..?

సమవుజ్జీల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. బరిలోకి దిగితే కొదమసింహాల్లా పోరాడే రెండు జట్ల మధ్య మరికొన్ని గంటల్లో భీకర యుద్ధం జరగనుంది. టీ20 వరల్డ్ కప్-2024 టైటిల్ కోసం భారత్-సౌతాఫ్రికాలు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇవాళ జరిగే ఫైనల్ ఫైట్​లో గెలిచిన జట్టు విశ్వవిజేతగా అవతరిస్తుంది. ప్రొటీస్ టీమ్ ఇప్పటిదాకా ఒక్క ప్రపంచ కప్​ టైటిల్​ను కూడా అందుకోలేదు. అటు భారత్ వన్డేల్లో రెండుమార్లు, టీ20ల్లో ఒకసారి ఛాంపియన్​గా నిలిచింది. దీంతో తొలి కప్పు నెగ్గాలని సఫారీ జట్టు.. పొట్టి ఫార్మాట్​లో రెండోమారు విజేతగా నిలవాలని భారత్ పట్టుదలతో ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

అటు సౌతాఫ్రికా, ఇటు టీమిండియా అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తున్నాయి. రెండు జట్ల బౌలర్లు, బ్యాటర్లు మంచి ఫామ్​లో ఉండటంతో మ్యాచ్ నువ్వానేనా అంటూ సాగడం ఖాయమనే చెప్పాలి. ఇరు టీమ్స్ ఫైనల్ చేరే క్రమంలో ఒక్క మ్యాచ్​లోనూ ఓడకపోవడం మరో హైలైట్. అయితే సౌతాఫ్రికా కంటే భారత్ కాస్త బలంగా కనిపిస్తోంది. ఐసీసీ టోర్నీల్లో నాకౌట్, ఫైనల్ మ్యాచ్​లు ఆడిన అనుభవం మన జట్టు ఆటగాళ్లకు ఉంది. ఈ మ్యాచ్​లో ఉండే ఒత్తిడి గురించి వాళ్లకు తెలుసు. అటు సఫారీ ప్లేయర్లకు ఇదే తొలి ఫైనల్ కావడంతో వాళ్లు ఎగ్జయిటెడ్​గా ఉన్నారు. అదే టైమ్​లో ప్రెజర్​ను కూడా ఫీల్ అవుతున్నారు. ఈ తరుణంలో సౌతాఫ్రికా ఆటగాళ్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత జట్టులో రోహిత్ శర్మ కాదు.. విరాట్ కోహ్లీతోనే తమకు అసలు ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు.

కోహ్లీ చాలా డేంజర్ బ్యాటర్ అని సౌతాఫ్రికా సారథి ఎయిడెన్ మార్క్రమ్ అన్నాడు. తనదైన రోజున అతడు సింగిల్ హ్యాండ్​తో మ్యాచ్​ను ప్రత్యర్థుల నుంచి లాగేసుకుంటాడని చెప్పాడు. తనను తాను బెటర్ చేసుకునేందుకు అతడు అహర్నిషలు శ్రమిస్తుంటాడని పేర్కొన్నాడు. విరాట్ ఎన్నో ఏళ్లుగా కన్​సిస్టెంట్​గా రన్స్ చేస్తున్నాడని పేసర్ రబాడ మెచ్చుకున్నాడు. కోహ్లీ క్యారెక్టర్ అంటే తనకు ఇష్టమని పించ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ తెలిపాడు. అతడికి గెలుపు తప్ప ఇంకో ధ్యాస ఉండదన్నాడు. విరాట్ క్రికెట్​లో ఓ లెజెండ్ అని.. అతడి ఎనర్జీ, పెర్ఫార్మ్ చేయాలనే ప్యాషన్ అద్భుతమని స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ప్రశంసల్లో ముంచెత్తాడు. కోహ్లీ ఫిట్​నెస్​ విషయంలో అందరికీ ఇన్​స్పిరేషన్ అని పేర్కొన్నాడు. అతడి మైండ్​సెట్, గ్రౌండ్​లో వ్యవహరించే తీరు సూపర్ అని మరో స్పిన్నర్ తబ్రేజ్ షంసీ చెప్పుకొచ్చాడు. మరి.. సౌతాఫ్రికాపై కోహ్లీ రాణిస్తాడని మీరు అనుకుంటే కామెంట్ చేయండి.

Show comments